By Village Missionary Movement
Thursday, 16-May-2024దిన ధ్యానము(Telugu) 16.05.2024
అంశం:- వెతుకుడి
“అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును” - మత్తయి 7:7
ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము ఏదో ఒక విధానంలో ఏదో ఒక కార్యాన్ని వెతుకుతూ ఉన్నాం. చిన్న వయసు ఉండేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు మంచి స్కూల్స్ వెతుకుతూ ఉంటారు. చదువు పూర్తి అయిన వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగాలు వెతుకుతూ ఉంటారు. భవిష్యత్తు కొరకు ఏ వృత్తి చేస్తే మంచిగా ఉండగలము అనే దాని గురించి కార్యాలు వెతుకుతూ ఉంటారు. వృద్ధాప్యంలో మనం ఆరోగ్యం కొరకు మంచి హాస్పిటల్ వెతుకుతూ ఉంటారు. ఈ లోకంలో మనం జీవిస్తున్నంత కాలం మన వెతుకులాట కొనసాగుతూనే ఉంటుంది. కొండమీద ప్రసంగంలో యేసుప్రభు మనము దేనిని వెతకాలి? దానిని వెతికిటప్పుడు ఏ ఏ కార్యాన్ని పొందుకుంటాం అని చెబుతున్నారు. దానిని ఈ దినం ధ్యానిద్దాం.
దేవున్ని వెతకాలి:- (సామెతలు 8:15) మొదటిగా దేవున్ని వెతకాలి. రెండు మార్గాల్లో మనం ప్రభువును వెతకగలం. మొదటిగా ప్రార్థన దానియేలు 9:3లో దానియేలు ప్రార్థనలో ప్రభువును వెతుకుతున్నాడు. రెండవది బైబిల్ యెషయా 34:16 లో ప్రభువును గూర్చి దేవుని గ్రంథంలో వెతికి చదవండి. మన యొక్క ప్రభువు ఎలాంటి వారు అనేక గుణాతిశయముల గురించి బైబిల్లో వెతికే వారముగా మనం ఉండాలి.
తండ్రి చిత్తాన్ని వెతకాలి:- యోహాను సువార్త 5:30 మన కోరికలు నెరవేర్చుట కొరకు జీవితంలో కార్యాలు చేస్తున్నామా లేదా తండ్రి చిత్తని ఎరిగి దాని ప్రకారము నెరవేర్చుటకు ప్రయాసపడుతున్నామా అని ఆలోచించాలి.
ఆత్మలను వెదకాలి:- లూకా సువార్త 19:10 పాపము చేత రక్షణ కోల్పోయి ఉన్న ప్రజలను మన వెతుకుతూ వెళ్లి యేసుప్రభు ప్రేమను ప్రకటించాలి. అలాంటి వ్యక్తులు మీ వీధుల్లో, మీరు పని చేసే స్థలములలో, చదివే కాలేజీలో ఉండవచ్చు. ఇలాంటి వ్యక్తులు మనం వెతుకుతున్నామా?
ఉన్నతమైన వాటిని వెతుకుడి కొలస్సీ రాసిన పత్రిక 3:1-2 ఇతరులను మోసగించి అబద్ధమాడి ఇతరులు కిందకు త్రోసి పొందుకుంటున్న కార్యాలను మనం వెతికే వారంగా ఉండకుండా ఉన్నతమైన వాటినే వెతికే వారిగా ఉండాలి.
ప్రియమైన వారలారా! మనము ఈ లోక దీవెనల కొరకు మన సొంత ప్రయోజనం కొరకు ప్రభువైన యేసుక్రీస్తును వెతికే వారముగా జీవించిన యెడలా మన పరిస్థితి దుఃఖకరమైనదే. మనము ఆయన చిత్రాన్ని వెతికేటప్పుడు దీవెనలను దేవుడు మనకు దయచేస్తారు.
- శ్రీమతి. జబకని శేఖర్ గారు
ప్రార్థన అంశం:-
మన సేవకులు యొక్క ప్రయాణంలో దేవుని సంరక్షణ ఉండేటట్లు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250