By Village Missionary Movement
Monday, 13-May-2024దిన ధ్యానము(Telugu) 13.05.2024
అంశం:- విశ్వాసం యొక్క ఫలితం
"నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడును(మూలభాషలో-నమ్మినవారిని ఈ సూచక క్రియలు వెంబడించును); ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు" - మార్కు 16:17
స్మిత్ వికిల్స్ వర్థ అనే విశ్వాస వీరుడు కి ఒక ఉత్తరం వచ్చింది. అది ఏమిటి అంటే 200 కిలోమీటర్ల దూరంలో గల ఒక ఇంట్లో నుండి ఆ ఉత్తరం వచ్చింది. వెంటనే రమ్మని ఆ ఉత్తరంలో రాసి ఉంది. ఆయన అత్యవసరంతో వెళ్లి చూసిన తర్వాత ఐదుగురు ఒక స్త్రీని నొక్కి పట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఆ స్త్రీ అపవిత్ర ఆత్మ చేత పీడింప బడుతోంది. ఆ స్త్రీ కొరకు ప్రార్థించిన వెంటనే ఆ దయ్యము చెప్పింది మేము 37 మంది మమ్మల్ని తరిమి వేయుట నీవల్ల అవ్వదు నీవు వెళ్ళు అని చెప్పింది. కానీ ఆయన అయితే లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి అధికారంతో ప్రార్థించారు. ఆ దయ్యమును వెలగొట్టుగలిగాడు. ఆ స్త్రీ యొక్క కుటుంబం అంతా దేవుడిని అంగీకరించ గలిగారు. యేసుక్రీస్తు ప్రభువు లోకంలో జీవించిన దినములలో చాంద్రా రోగి అయిన ఒక కుమారుడిని ఆ తండ్రి యేసుప్రభు యొక్క శిష్యుల వద్దకు తీసుకొని వచ్చారు. వారు ఆ కుమారుడ్ని స్వస్థపరచ లేకపోయారు. అప్పుడు యేసుప్రభు వద్దకు వచ్చి చెప్పిన వెంటనే విశ్వాసం లేని సంతానమా అని శిష్యులను గద్దించారు. ఆవగింజంత విశ్వాసం మీలో ఉంటే మీరు కొండను చూసి ఇక్కడ నుండి అవతలకి వెళ్లేము అని చెప్పినయెడలా అవతలికి వెళ్లి పోతుంది అని చెప్పారు. అలానే మీరు విశ్వాసము కలిగినవారిగ ప్రార్థనలో అడిగినవన్ని కూడా జరుగుతాయి అన్నారు. కావున విశ్వాసము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది మీకు ఉన్న పోరాటాలు, చింతలు, సాతాను పోరాటాలు వీటన్నిటికీ సేవకులను వెతికి వెళ్ళవలసిన అవసరం లేదు వారిలో ఉండి పనిచేస్తున్న దేవుడే మీలో కూడా ఉన్నారు. విశ్వాసము కొలతలలో తేడా ఉండటం వలన వారి వలన అద్భుతాలు జరుగుతున్నాయి. విశ్వాసము ఆవగింజంత ఉంటే చాలు కొండంత గొప్ప కార్యములు జరుగుతాయి.
ప్రియమైన వారలారా ఊరగాయి ఎక్కువ రోజులు ఉండడానికి ఉప్పు కొద్దిగా వేయవలసి ఉంటుంది. అలానే మీరు దేవునిలో స్థిరముగా స్వస్థతను ఆశీర్వాదములు పొందుకొనుటకు విశ్వాసము అవసరమైనది కాబట్టి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తారు . మనలో విశ్వాసం లేనందున మనము సేవకుల పైన ఆధారపడుతున్నాం. సేవకులను పిలిపించి ఆనుకొనుట చేయకూడదు అని చెప్పడం లేదు కానీ మనము వారి కంటే వారి పైన కంటే దేవుని పైన ఎక్కువగా ఆధారపడినప్పుడు మన జీవితంలో దేవుడు ఇంకా అనేక అద్భుతమైన కార్యాలు చేస్తారు. మనలో ఉండే దేవుని యొక్క బలాన్ని గ్రహించి ఆయన పైన ఆనుకున్నప్పుడు దేవుడు మనలో కూడా గొప్ప కార్యాలు చేస్తారు.
- శ్రీమతి. జాస్మిన్ పాల్ గారు
ప్రార్థన అంశం:
ఈ దినము జరుగుతున్న మన మిషనరీల "కోటి, మరియ" వారి యొక్క వివాహంలో దేవుడు వారికి తోడైయుండి వారి ప్రతి అవసరాలను తీర్చు లాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250