Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.05.2024
Share:

By Village Missionary Movement

Friday, 10-May-2024

దిన ధ్యానము(Telugu) 10.05.2024

 

అంశం:- వృద్ధాప్యంలో బలమైన వారు 

 

"వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు" - కీర్తనలు 92:15

 

40 సంవత్సరాలు దాటిన వెంటనే కొంచెం జుట్టు పండిపోతుంది, శరీరంలో కొంచెం నొప్పులు, వేదనలు, చూపు తగ్గిపోవుట, బిపి, షుగర్ పెరుగుట తగ్గట జరిగిన వెంటనే అంతే వయసు అయిపోయింది అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో విశ్రాంతి ఇచ్చారు అంటే అంతే ఇంటిపై కప్పును చూస్తూ సమయాన్ని చూస్తూ మరణ దినం కొరకు ఎదురుచూస్తున్నాను అనే డైలాగుతో మాట్లాడేవారు కలరు. కానీ వయసు బలహీనత వీటిని అధిగమించి దేవుని కొరకు ప్రయాస పడుతున్న వారు ఈ లోకంలో అనేకులు. 

 

థామస్ మాథ్యూ సీనియర్ అనే బిజినెస్ మాన్ గొప్ప భూములు కలవారు. ఎలిజిబెత్ 3 యొక్క గవర్నర్ ఈయన కుమారుడు థామస్ సీనియర్ ఆ దీవి ప్రజల మధ్య పరిచర్య చేశారు. నావలో నీది సంపాదించుటకు ఇతర దేశాలకు వెళ్లి సపోర్ట్ పొందుకోవాలి అని ఇంగ్లాండ్ దేశంనకు వెళ్లిన కుమారుడు మరలా తిరిగి రాలేదు. కుమారుడిని కోల్పోయిన దుఃఖముండినప్పటికీ కుమారుడు విడిచిపెట్టిన పరిచర్యను కొనసాగించుటకు సిద్ధపడిన థామస్ మాథ్యూ అనేకులను పరిచర్యకు రమ్మని పిలుపునిచ్చారు. ఆ దీవి భాష ఎవరికి రానందున ఎవరు ముందుకు రాలేదు. తన 70వ సంవత్సరంలో ఆ దీవిలో గల భాషను నేర్చుకుని అక్కడ పరిచర్య చేయుటకు తమను సమర్పించుకున్నారు. 20 మైళ్ళు అడవుల్లో తిరుగుతూ సుమారు 3000 ఆత్మలను దేవుని లోనికి నడిపించారు. 

 

అరణ్యంలో తన యొక్క మామ గొర్రెలను మేపుతూ ఉన్న మోషేకు ముండ్ల పొదల మధ్యలో తన పరిచర్య చేయుటకు రమ్మని ఇశ్రాయేలు జనాంగమును పాలు తేనెలు ప్రవహించు దేశంనకు నడిపించమని దేవుడు ఏర్పరచుకున్నాడు. అనేక అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసి దేవుడు మోషేను పిలుస్తున్నారు. తాను నేను మాట్లాడలేనని నెపములు చెప్పిన అహరోను నీకు నోరుగా ఉండును అని ఐగుప్తు రాజైన ఫరోకు నిన్ను దేవుడిగా చేశాను అని అంటున్నారు. ఫరోకుముందు మోషే అహరోనులు నిలబడినప్పుడు మోషే యొక్క వయసు 80 సంవత్సరాలు అహరోను వయసు 83వ సంవత్సరం (నిర్గమకాండం 7: 7). 

 

అవును ప్రియమైన వారలారా తమ శక్తిని తమ యొక్క బలాన్ని దేవుని కొరకు ఉపయోగించడానికి మీకు ఉన్న వయసు ఒక సమస్య కాదు. ఇశ్రాయేలు దేవుని తప్ప వేరే దేవుడు లేడు అని భూలోకంలో సమస్త జాతులు మోషే నడిపించిన నాయకత్వం ద్వారా తెలుసుకున్నారు. ఏదో ఒక కారణం చెప్పి మీరు ఆగిపోయారా? దేవుని కొరకు పరిచర్య చేయుటకు వయసు అభ్యంతరం కాదు. మనసులో ఆసక్తి ఉంటే చాలు దేవుని కొరకు ఏదైనా ఒక కార్యము చేయుటకు అవకాశాన్ని, బలాన్ని ఆయన ఇస్తారు. ఆమెన్! 

- సిస్టర్. మంజుల గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఆమెన్ విలేజ్ టీవీ ఛానల్ శాటిలైట్ టీవీ ఛానల్ గా మార్చబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet