Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.05.2024
Share:

By Village Missionary Movement

Thursday, 09-May-2024

దిన ధ్యానము(Telugu) 09.05.2024

 

అంశం:- సజీవుడైన దేవుడు 

 

"నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి" - ప్రకటన గ్రంథం 1:18 

 

యూదా రాజసింహము పునరుద్దానుడాయును అనే పాటను పరవశించి సంతోషంతో పాడి పునరుద్దాన పండుగను కొనియాడి ముగించారు. ఇప్పుడు ఆ పునరుద్ధానుడైన ఆయన ఎక్కడ? ఏమి చేస్తున్నారు? అని మనం ఎప్పుడైనా ఆలోచించేసామా? 

 

చివరకాలంలో జరగబోతున్న కార్యాలను గురించి ఆయన ప్రియమైన శిష్యుడైన యోహాను పద్మసు దీవిలో ఉండేటప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షపరిచారు. యేసుప్రభు యొక్క రొమ్మున అనుకుని ఆయనకు దగ్గర బంధువుగా ఉండిన యోహానుకు ఆయనను చూచిన వెంటనే ఎలాగు ఉండి ఉంటుంది? బూర ధ్వని మోగుతున్న స్వరాన్ని విని ఉండవచ్చు, ఉన్నవాడను, అనువాడను, సజీవుడుగా ఉన్నారు అని ఆయన స్వరాన్ని మరల వినేటప్పుడు ఆయన చూచిన దృశ్యం ఏమిటి? 7 దీపస్తంభముల మధ్యలో నిలవబడి తెల్లని వస్త్రము ధరించుకున్న వారిగా బంగారుపు దట్టి కట్టుకున్నవాడుగాను మనుష్య కుమారునిగా పోలిన వాడిగా ఉన్నాడు. ఆయన శిరస్సులో బంగారు వంటి వెంట్రుకలు ఉన్నాయి. గొప్ప ప్రవాహ జలమువంటి స్వరము ఆయనది. ఆయన చేతిలో 7నక్షత్రములు పట్టుకున్నవాడిగా ఆయన నోటి నుండి రెండంచుల ఖడ్గం వంటి మాటలు ఆయన యొక్క కాంతులను ప్రకాశింపజేసి బయటికి వచ్చింది. ఇంత శక్తితో నిండిన ప్రభువును గురించి ఆలోచించారా? చూస్తే మనము ఖాళీగా ఉండలేం. ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడానికి యోహానే ఉండలేకపోయాడు చచ్చిన వాడి వలె ఆయన పాదముల మీద పడ్డాడు. ఆయన మనుషు కుమారునిగా జీవించిన 33½ సంవత్సరములు మాత్రమే కానీ నిత్యము యుగయుగములు ఆయన ఆయుష్షు గలవారు. ఈ సృష్టి ప్రారంభంమునకు మునుపు ఉన్నవారు. ఇంకను సదాకాలము నిత్యజీవముతో జీవించే వ్యక్తి. 

 

అవును ఇలాంటి శక్తిని, బలాన్ని, మహోన్నత్వముతో నిండిన ఉన్నతమైన దేవునిని మనము కలిగి ఉన్నాము. అలాంటి దేవునికి మనం భయపడుతున్నామా లేక ఏదో పరితాప కరమైన పరిస్థితిలో శిలువలో మరణించిన మనిషి వలె అశ్రద్ధ చేస్తున్నామా? ఆయన మరణించిన క్రీస్తుగ మరల తిరిగి లేచి జీవము కలిగిన దేవుడిగా ఉన్నాడు. మన కొరకు సమస్తాన్ని చేసి ముగించిన వ్యక్తి ఆయనే. మన కొరకు నిత్యము జీవించి పరిపాలించే రాజాధిరాజుగా ఉన్నాడు. ఆయనకే మహిమయు, ఘనతయు నిరంతరము చెల్లును గాక. ఆమెన్! 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం:-

అన్ని ఫీల్డ్లలోనూ చిన్నపిల్లల క్యాంపులు నడిపించబడేటట్లు ప్రార్థిద్దాం, మరియు వారి ద్వారా అనేకమంది తల్లిదండ్రులు దేవున్ని తెలుసుకొనుటకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet