By Village Missionary Movement
Wednesday, 08-May-2024దిన ధ్యానము(Telugu) 08.05.2024
అంశం:- ఉజ్జీవమునకు ముందు ఉన్నది దీనత్వము
"అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను" - లూకా 18:14
పలు విధములైన తత్వశాస్త్రములతో నిండి ఉన్న ప్రపంచంలో అన్ని రకములైన ప్రజలు అనేక కార్యములు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో కూడా కొన్ని సామెతలు కలవు. నాశనమునకు ముందు గర్వం నడుచును (సామెతలు 16: 18). పడిపోవుటకు ముందు గర్వము ఇది లూసిఫర్ కి ఒక ఉదాహరణంగా ఉన్నది. గర్వములో పడిపోయాడు మనలను గర్వములో పడద్రోయుటకు తన యొక్క కుయుక్తులను చేస్తూ ఉన్నాడు.
యూదా మరియు ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులు తమ్మును తగ్గించుకుని జీవించినప్పుడు హెచ్చింపబడ్డారు. గర్వముతో పరిపాలించినప్పుడు వాళ్లు గణహీనమై పతనమయ్యారు. ఇవన్నీ కూడా మనకు దృష్టాంతముగా రాయబడి ఉన్నది.
ఉజ్జీవాన్ని మనము చూడాలి అంటే క్రైస్తవులమైన మనము శిష్యులుగా మారాలి. యేసు కొరకు పనిచేయాలి. దేవుని రాజ్య విస్తరణలో పాలు పంపులు పొందుతున్న మనము పేరు, ప్రఖ్యాతి చూడకుండా యేసుప్రభువు నామము హెచ్చింపబడాలి అని ప్రయాసపడాలి.
లోక ప్రజలు నా కన్ను పోతే పరవాలేదు నా శత్రువుకి రెండు కనులు పోతే బాగున్ను అనే పూర్తి అవిశ్వాసంతో పని చేస్తున్నారు కానీ మనమైతే యోహాను వలె నేను తగ్గించుకోవడానికి తాను హెచ్చింపబడాలి అనే మనసుతో ప్రయాసపడితేనే తప్ప ఉజ్జీవాన్ని చూడలేము. యేసుప్రభువు మొదటి రాకడ ముందు ప్రజలు హృదయాన్ని వాడుకున్న యోహాను వలె రెండవ రాకడకముందు లోక ప్రజలు తమ ప్రయాసం వలన ప్రార్థన మరియు ఐక్యత వలన ఇతరులను సంపాదించుకునేవారుగా మనం మారాలి.
అమెరికా రాష్ట్రపతి అయిన జార్జ్ వాషింగ్టన్ మొదటి ప్రధానమంత్రిగా ఉండుటకు గల కారణం ఏమిటి ఆయన రాష్ట్రపతి అవ్వడానికి ముందు అమెరికా ప్రధాన యుద్ధ మంత్రిగా ఉండేవాడు. ఒక దినము సైన్యములో తర్ఫీదులన్నింటిని ఎలా జరుగుతున్నాయో చూచుటకు వేరే వేషము ధరించుకొని గుర్రం పైన వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒక యోధుడు తన క్రింద ఉన్న సైనికుడును కఠినమైన పని చేయిస్తూ ఉన్నాడు. ఒక పెద్ద చెట్టు నీ పొర్లించడానికి ఇబ్బంది పడుతున్న సైనికునికి వాషింగ్టన్ సహాయము చేశాడు. ఆ పనిని చూచే ఆ నాయకుడైతే సహాయము చేయుటకు రమ్మని పిలిచిన అది పనిచేసే వారి పని నేను పని చేయించేవాడిని కాబట్టి నేను చేయను అని సమాధానమిచ్చాడు. వెంటనే జార్జ్ వాషింగ్టన్ ఆ చెట్టుని పొర్లించి సహాయం చేసి వెళ్ళకముందు ఇలాంటి పని ఎక్కడ ఉన్నా నన్ను పిలవండి నేను చేసి పెడతాను అన్నాడు. అందుకు అతడు నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వు ఎవరు అని అడిగాడు. అందుకు జార్జ్ వాషింగ్టన్ నేను ఈ దేశం యొక్క ప్రధానమైన యుద్ధ సైన్యాధిపతి అని చెప్పాడు. ఆ పని చేయించిన ఆ అధికారి సాష్టాంగ పడి నమస్కరించి వనికి క్షమాపణ అడిగాడు. యేసయ్య మనల్ని చూస్తూ ఉన్నారు. ఉజ్జీమునకు ఆటంకముగా ఉంటున్న గర్వాన్ని విడిచిపెట్టి తగ్గింపుతో ఉండుటకు, ప్రయాసపడుటకు, ప్రార్థించుటకు త్యాగపూరితముగా ఇచ్చుటకు దేవుడు మనలను పిలుస్తూ ఉన్నారు. మీరు సిద్ధమేనా?
- బ్రదర్. టీ. సెల్వరాజ్ గారు
ప్రార్థన అంశం:-
ఈ నెల అంతా మన సేవకుల యొక్క ట్రాన్స్లేషన్ కార్యంలో దేవుని హస్తము తోడైయుండి నడిపించేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250