By Village Missionary Movement
Sunday, 05-May-2024దిన ధ్యానము(Telugu) 05.05.2024 (Kids Special)
అంశం:- వి.బి.ఎస్ వచ్చేసింది
ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు
"నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును" - మత్తయి 11:29
సమ్మర్ హాలిడేస్ వస్తేనే చాలా జాలిగా ఉంటుంది కదా పిల్లలు. హోంవర్క్ లేదు, స్కూల్ లేదు అన్నిటికి పైగా చక్కగా పడుకొని లేటుగా లేవవచ్చు. సంతోషమే కదా! పిల్లలు. మీరు సెలవుల్లో ఊరికి వెళ్తుంటారా? వి. బి.ఎస్ మిస్ చేసేయకూడదు ఓకేనా పిల్లలు.
ఎలాగు ఎగ్జామ్స్ అయిపోయాయి అయ్యా జాలియే అని సంతోషంతో ఇంటికి వచ్చిన శ్యామ్ ను చూసిన వారి యొక్క అత్త కొడుకు వసంత్ హాయ్ అని చెప్పి వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చక్కగా క్రికెట్ ఆడుకోవచ్చు అని ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. నువ్వు ఈ సెలవులకి ఎక్కడికి వెళ్లలేదా అని అడిగాడు వసంత్. శ్యామ్ తో మేము మే నెలలో 6 మొదలుకొని 10వ తారీకు వారికి టూర్ వెళ్తున్నాము నువ్వు కూడా వస్తావా అన్నాడు వసంత్. మా నాన్నతో అడిగేసి నీకు చెప్తాను రా అని అన్నాడు శ్యామ్.
తర్వాత దినము ఉదయం శ్యామ్ ఇంట్లో కుటుంబముగా భోజనానికి కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు నాన్న వసంత్ ఇంటిలో అందరూ టూర్ కి వెళ్తున్నారు నన్ను కూడా రమ్మన్నాడు నేను కూడా వెళ్ళనా అని అడిగాడు. అందుకు నాన్న శ్యామ్ మే 1 నుండి 10 వరకు వి.బి.ఎస్ జరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారి వి. బి. ఎస్ జరుగుతుంది కదా నీవు దాంట్లో కచ్చితంగా పాల్గొనాలి అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నువ్వు కచ్చితంగా దానికి వెళ్లాలి. విబిఎస్ ముగించుకున్న తర్వాత వెళ్ళవచ్చు అని నాన్న చెప్పిన వెంటనే మీరు చెప్పినట్టుగానే చేస్తాను. వీళ్ళిద్దరి యొక్క మాటలు విన్న అమ్మ మీ డీల్లో నన్ను మర్చిపోకండి అని చెప్పినప్పుడు అందరూ కలిసి నవ్వుకున్నారు. యేసయ్యను మొట్టమొదటిగా వెతుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అని అమ్మ చెప్పిన వెంటనే సరే సరే అని నాన్న చెప్పినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా సంతోషంతో నిండిపోయింది.
ప్రియమైన పిల్లలు ఈ సమ్మర్లో వి.బి.ఎస్ మిస్ చేయకండి. వి. బి. ఎస్ కి వెళ్ళినప్పుడు మీ జీవితం మారుతుంది మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. శ్యామ్ వలే యేసయ్యకు ప్రధానమైన స్థలం ఇవ్వాలి. మీ కోరికలు అన్నింటిని కూడా యేసయ్య ఖచ్చితంగా నెరవేరుస్తారు. సరైన పిల్లలు!
- శ్రీమతి. గ్రేస్ జీవమని గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250