Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.05.2024
Share:

By Village Missionary Movement

Saturday, 04-May-2024

దిన ధ్యానము(Telugu) 04.05.2024

 

అంశం:- ప్రేమ ఎవరి మీద? 

 

"ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును" - గలతియులకు 1:10

 

1961 వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఇంగ్లాండ్ దేశపు మహారాణి అయిన ఎలిజిబెత్ నేపాలలో గల కాట్మండుకు వచ్చారు. అప్పుడు ఎవరెస్టు శిఖరం పక్కనే ఉన్న గ్రామంలో నివసించే కుంజు మరియు ఆయన భార్య కంభీకి మహారాణిని దర్శించుటకు అవకాశం దొరికింది. కంబి అప్పుడు గర్వవతిగా ఉన్నది ఆమె చాలా దూరముగా చాలా కఠినమైన మార్గం గుండా 180 మైళ్లు వెళ్లి పది రోజుల్లో ఆ ప్రయాణం చేశారు. మార్గమధ్యంలో ప్రసవ సమయం వచ్చింది. ఒక గంట మాత్రం విశ్రాంతి తీసుకుని మరల చేతిలో బిడ్డను పట్టుకుని ప్రయాణం చేసి మహారాణి దర్శించారు. మహారాణిని చూడాలి అనే ఆసక్తి ఆ కఠినమైన మార్గం గుండా నడవడానికి ఆమెకు ప్రేరేపించింది. 

 

అలాగే దానియేలు కూడా దేవుని పైన గల భక్తి, పౌరుషము ఆటంకాలను కూడా అధిగమించి పనిచేయటకు ప్రేరేపించింది. రాజును తప్ప ఎవరిని కూడా నమస్కరించ కూడదు అనే ఆజ్ఞ వచ్చినప్పటికీ మునుపు చేసినట్లుగానే దేవునికి ప్రార్థించారు. దేవుని దర్శించుటకు ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని మీద గల ప్రేమతో ఇంకా పనిచేస్తున్నారు. సింహపు బోనులో వేయబడినప్పటికీ తడబడకుండా అక్కడకు కూడా వెళ్లారు. కానీ ఈ దినము క్రైస్తవులుగా మనలో అనేకులు యేసును ప్రేమిస్తున్నామని చెబుతున్నాము కాని చిన్న కష్టము, నిరుత్సాహం వచ్చిన వెంటనే నిరుత్సాహపడిపోయి క్రీస్తును విడిచి వెనక్కి వెళ్లిపోయిన వారు కలరు. క్రీస్తు మీద ప్రేమ ఉంటే కష్టములు నిరుత్సాహాలు అపజయాలు ఒక లెక్కగా అనిపించవు. షడ్రకు మేషకు అబేద్నగోలు దేవుని మీద గల ప్రేమ వలన అగ్నిగుండంలో వేయబడినప్పటికీ ఆయనను విడిచిపెట్టలేదు. 

 

ప్రియమైన వారలారా మన ప్రేమ ఎవరి మీద ఉంది? ప్రజలను తృప్తి పరచాలని ఉందా లేక దేవుని తృప్తి పరచాలని ఉందా? మీ ప్రేమ దేవుని పైన ఉంటే ఆయన కొరకు దేనినైనా సహిస్తారు. దేనినైనా ఆయన కొరకు ఇస్తారు కాబట్టి ఆలోచించుడి ఆయన మీద గల ప్రేమ సమస్తాన్ని సహించుటకు దేవుని బలాన్ని మనకు ఇస్తుంది. మన మొదటి ప్రేమ అంతా ఆయన మీద ఉంటే చాలు దేవుని కొరకు శ్రమలు మరియు కష్టాలు మధ్యలో కూడా మనమే జీవించగలం. ఆయన అందుకు తగిన బలాన్ని మనకు దయచేస్తారు. ప్రేమతో ఉండుడి ఆయన కొరకు జీవించుడి దేవుడు మిమ్ములను దీవిస్తారు. 

- శ్రీమతి. అనిత అలగర్ స్వామి గారు 

 

ప్రార్థన అంశం:

ఆంధ్ర రాష్ట్రంలో గల విజయనగరం ఫీల్డ్ లో కట్టబడుతున్న దేవాలయం కొరకు ప్రార్థించండి

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al