By Village Missionary Movement
Friday, 03-May-2024దిన ధ్యానము(Telugu) 03.05.2024
అంశం:- వయసు ఒక సమస్య కాదు
"బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును" - సామెతలు 10:4
విద్యార్థులను ఉత్సాహపరిచే భారతదేశానికి చెందిన స్త్రీ ఒకరు ఆస్ట్రేలియా దేశమునకు ఒక నెల రోజులు అనేకమైన స్కూలు మరియు కాలేజీలకు విద్యార్థులను ఉత్సాహవంతమైన మాటలతో ఉత్సాహపరచడానికి పిలవబడి ఉన్నారు. ఆ దినములలో అనేక చోట్లలో చుట్టూ చూసి సంతోషించి రావచ్చు అనే ఆలోచించుకున్నారు. వారికి సహాయం చేయుటకు మార్గదర్శిగా పంపించబడిన వ్యక్తిని చూసిన వెంటనే నిరుత్సాహము ఎందుకంటే ఆవిడ 82 సంవత్సరాల వయసు గల ఒక ముసలావిడ. ఆమె పేరు మెర్లిన్. ఈమె ఎలా నాకు సహాయం చేయబోతుంది అని నిరుత్సాహముతో బయలుదేరిన ఆమెకు ఆశ్చర్యం కలిగింది. మెర్లిన్ యొక్క చురుకైన పరుగులు వంటి నడక, వాహనాన్ని చాలా శ్రద్ధతో అదే సమయంలో అవసరమైన వేగముతో చక్కగా నడిపించే విధానము, ఈమెకు చాలా ఉత్సాహం ఇచ్చింది. దినములు గడిచాయి కొన్ని సమయాల్లో ఈ మాట్లాడే వ్యక్తి ఆలస్యం చేసిన మార్గదర్శిని మెర్లిన్ చాలా చురుకుగా అనేక చోట్లకు తీసుకుని వెళ్ళింది. సాయంకాలం సమయంలో ఒక చిన్న పిల్లల హాస్టలకు లెక్కలు రాయడానికి సహాయపడతాను, ఇంకా కొన్ని సమయాల్లో వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల ఆశ్రమలకు రొట్టెలు తయారు చేసి ఇస్తాను ఇది నా నా దినచర్య అని చెప్పారు. ఒకరోజు కొన్ని చెట్లు గల పార్కులకు వెళ్లారు. అక్కడ ఒక చెట్టుని చూపించి ఇది ఏం చెట్టు అని అడిగినప్పుడు మెర్లిన్ జవాబు చెప్పలేకపోయారు. ఒక నెల గడిచింది ఆ మాట్లాడిన వ్యక్తి భారతదేశం తిరిగి వచ్చినప్పుడు మెర్లిన్ మీ యొక్క నెక్స్ట్ ప్లాన్ ఏమిటి అని అడిగినందుకు ఆమె నేను ఈ చెట్ల గురించి చదువు కొరకు సాయంకాలపు క్లాసులో జాయిన్ అవుతున్నాను అని చెప్పింది. మీరు నాకు కొన్ని చెట్ల గురించి అడిగారు అది నేను చెప్పలేకపోయాను కాబట్టి దాని గురించి తెలుసుకునుటకు నేను ఈవినింగ్ క్లాసులకు వెళ్లబోతున్నాను అని చెప్పిన మెర్లిన్ ను చూసి మరవలేని ఒక వ్యక్తిని కలుసుకున్నాను అనే సంతోషముతో భారతదేశమునకు వచ్చారు ఆ స్త్రీ.
ఇది ఒక సవాలు కరమైన కార్యముగా మనకు ఉంటుంది ఒక చోటు నుండి మరొక చోటుకు వెళ్లాలంటే కదులుతూ, బంగురుతూ వస్తున్న ఈ దినపు యవ్వనస్తులకు మెర్లిన్ చాలా సవాలుతో కూడిన వ్యక్తిగా ఉంది. బైబిల్లో కూడా కాలేబు తన 85వ సంవత్సరంలో కొండ ప్రాంతం ఇవ్వుడి అని అడిగి పొందుకుంటున్నాడు.
ప్రియ సహోదరీ, సహోదరులారా మీ యొక్క శరీరాన్ని ఎలాగు వాడుకుంటున్నారు, అలవాటు చేసుకుంటున్నారు? మన శరీరాన్ని దేవుడు నివసించే దేవాలయం అనేదాన్ని గుర్తుంచుకొని చురుకుతో, శ్రద్ధతో వాడుకొనడం చాలా ప్రాముఖ్యం. గోడ ఉంటేనే దానిని ఆధారం చేసుకుని చిత్రము గీయగలం. దేవుడు మీ ద్వారా మహిమ పరచబడతారు. దేవుని రాజ్యమునకు ప్రయోజనకరముగా దేవుడు మనలను వాడుకోవాలి అంటే మన శరీరాన్ని చక్కగా కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆమెన్!
- బ్రదర్. ఎల్. అలగర్ సామీ గారు
ప్రార్థన అంశం:-
వి.బి.ఎస్ పరిచర్యలు చేయుటకు మనతోపాటు కలిసి అనేక మంది వాలంటీర్లు కలిసి పని చేసేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250