By Village Missionary Movement
Thursday, 02-May-2024దిన ధ్యానము(Telugu) 02.05.2024
అంశం:- మలుపు
"ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి" - మత్తయి 11:30
నేను ఒక పారంపర్యము గల క్రైస్తవ కుటుంబంలో జన్మించి భక్తితో పెంచబడ్డాను. అయినప్పటికీ నా యొక్క 18 సంవత్సరాలు వరకు యేసయ్య ప్రేమను ఎరుగలేదు. దేవునికి ఇష్టం లేని జీవితం జీవించి వచ్చాను..నా తల్లితండ్రులు ఇద్దరు పుట్టుకతో మాట్లాడలేని చెవులు వినబడని వారు కాబట్టి వాళ్లను వేధించాను. ఒక దినము యధావిధిగా ఒక యవ్వనస్తుల కూడిక లో పాల్గొన్నాను. దేవుడు నాతో మాట్లాడారు. ఈ రెండు రోజులు యవనస్తుల కూడిక నీ కొరకే అని దేవుడు నాతో మాట్లాడారు. నా జీవితాన్ని యేసయ్యకు సమర్పించాను. నా యొక్క 18 వ సంవత్సరంలో యేసుక్రీస్తు నా పాపమును క్షమించి నన్ను ఆయన బిడ్డగా అంగీకరించారు. ప్రభువు నా జీవితంలో చేసిన కార్యాలను తలంచి నా తల్లిదండ్రులు పొందుకున్న సంతోషానికి అవధులు లేవు. ప్రభువు మీద ఉన్న ప్రేమ వల్ల చిన్న పిల్లల పరిచర్య చేస్తూ వచ్చాను. మా ఊరికి వచ్చిన గ్రామ మిషనరీ ఉజ్జీవపు మిషనరీ జాకబ్ అన్నయ్య ఆయనతో కలిసి గ్రామ పరిచర్య చేస్తూ ఉండేవాడిని. 2012వ సంవత్సరం జనవరి నెలలో పరమకుడి అనే ప్రాంతంలో మూడు రోజుల కూడికలో మన నాయకుడైన డేవిడ్ గణేష్ అన్నయ్య దేవుని మాటలు ప్రసంగించారు. కుటము ముగింపులో ఆయన దగ్గరికి వెళ్లి ఆయన కలిశాను. చివరగా నాకు ఒక మాట చెప్పారు. యేసయ్య ఏడుస్తున్నారు నీవు ఎందుకు మాతో పాటు కలిసి పనిచేయకూడదు అని అడిగారు. దాని విన్న వెంటనే నా సంతోషంగా అవధులు లేవు ,నా కన్నీరును తుడిచిన యేసయ్య ఏడుస్తున్నారు ఆయన కొరకు ఈ పరిచర్యలో కలిసి పరిచర్య చేద్దాము అని నిర్ణయం తీసుకున్నాను. ఒకవైపు మాట్లాడలేని, చెవులు వినబడలేని నా తల్లిదండ్రులు మరొకవైపు వివాహం కొరకు వేచిన నా సహోదరి మరియొకపక్క ఆత్మల కొరకు ఏడుస్తున్న యేసయ్య. అప్పటికే నా యొక్క కుటుంబీకులు యొక్క సంపూర్ణ సహకారముతో పరిచర్యకు రావడానికి దేవుడు సహాయం చేశారు. ఈ దినమున తల్లిదండ్రులు ఇద్దరూ 18 సంవత్సరాలకు పైగా మాటలు రాని చెవులు వినపడని వారి మధ్యలో పరిచర్య చేస్తున్నారు. సహోదరి వివాహమును దేవుడే ఘనంగా చేశారు. నా కుటుంబతో నేను కుటుంబముగా కలిసి పరిచర్య చేస్తూ వస్తున్నాను అంటే కేవలం అది దేవుని కృపే.
దీన్ని చదువుతున్న ప్రియ యవ్వన సహోదరుడా సహోదరి మీరు ఎలాంటి కఠినమైన పరిస్థితిలో ఉన్న మీ జీవితాన్ని ఆయన కొరకు, పరిచర్య కొరకు సమర్పించి చూడండి. మిమ్మల్ని యేసయ్య వాడుకుంటారు. యేసయ్య ఏడుస్తున్నారు ఆయన కొరకు పని చేయడానికి ఆయన కన్నీరు తుడవడానికి మీరు మీ వంతు కార్యము చేయండి. ఒక విత్తనం అనేకులకు ప్రయోజనకరమైన విత్తనాలుగా మారేటట్లు మీ జీవితాన్ని క్రీస్తు కొరకు సమర్పించుడి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
- బ్రదర్. ఆల్విన్ జాకబ్ గారు
ప్రార్థన అంశం:
ఈ నెల అంతా వి.బి.ఎస్ పరిచర్య ద్వారా 5000 గ్రామాలు దర్శింపబడేటట్లు ప్రార్థిద్దాం
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250