Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 24.04.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 24-Apr-2024

దిన ధ్యానము(Telugu) 24.04.2024

 

అంశం:- అవసరమైనది ఒక్కటే. 

 

"మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొ నెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను" - లూకా 10:42

 

ఒక తండ్రి అమెరికా దేశంలో పని చేస్తూ వచ్చాడు. ఆయన కుటుంబం తమిళనాడులో ఉండేది. సెలవుకని ఇంటికి వచ్చిన ఆ తండ్రి తన ఒకే కుమారుడిని కూర్చోబెట్టి అనేక వస్తువులను అతనికి ఇచ్చాడు. ఆ కుమారుడితో ప్రతిదాన్ని ఎత్తి చూపించి వాటిని ఎంత ప్రయాసముతో నీకొరకు కొన్నాను అని వివరించి చెప్పాడు. కుమారుడు అయితే ఆ వస్తువుల మీద ఆసక్తి చూపించలేదు. తన తండ్రి ముఖమును కోపముతో చూస్తూ ఉండిపోయాడు. ఎందుకు అని అడిగాడు తండ్రి. అందుకు తండ్రి నాన్న ఈ వస్తువులు నాకు అవసరం లేదు మీరే నాకు కావాలి మీరు ప్రేమతో ఇదంతా కొనిచ్చారు నిజమే కానీ నేను వీటి కొరకు ఎదురు చూడలేదు. మీరు ఎప్పుడూ నాతో ఉండాలి, నన్ను స్కూలుకు తీసుకుని వెళ్లాలి, మీ ఒడిలో కూర్చుని హోంవర్క్ రాయాలి, మీతో ఆడుకోవాలి ఇదే నా కోరిక అన్నాడు. 

 

ఇది బైబిల్లో ఒక సంఘటనతో పోల్చవచ్చు. బేతని గ్రామంలో మార్తా, మరియ అనే ఇద్దరు సహోదరీలు ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మార్తా అయితే అనేక పనులు చేస్తూ ఉంది. మరియ యేసయ్య పాదముల చెంత కూర్చుని ఉంది. ఆయన మాటలు వినటకు ఆయనతో మాట్లాడుటకు ఆసక్తి కలిగినదిగా ఉన్నది. కానీ మార్తా అయితే పనిచేసే నిరుత్సాహపడి అలసిపోయి యేసయ్య యొద్దకు ఒంటరిగా వెళ్లి నేను నిలబడి ఒంటరిగా కష్టపడి పని చేస్తున్నాను అని విలపించింది. అందుకు యేసయ్య నీవు అనేక కార్యముల కొరకు చింతిస్తూ ఉన్నావు కానీ అవసరమైనది ఒక్కటే దానిని మరియ ఎంచుకున్నది అని అన్నారు యేసయ్య. 

 

ప్రియమైన వారలారా ఈ లోకంలో జీవిస్తున్న కుమారుడు తనకు తండ్రి ఎన్ని వస్తువులకు ఇచ్చినా గాని ఆయన తండ్రి యొక్క ప్రేమ గురించి ఎదురుచూస్తున్నట్లుగానే మిమ్మల్ని సృష్టించిన ప్రభువు ఎదురుచూపు ఏమిటో తెలుసా? మనము ఆయన సముఖములో వేచి ఉండాలి మనము ఎంత కానుకలు ఇస్తున్నామో, ఇతరులకు సహాయం చేస్తున్నామో పరిచర్య చేస్తున్నామో అని మనము కారణములు చెప్పిన మనము ఆయనతో కలిసి కూర్చ కూర్చోవాలి, సమయం అతనికి ఇవ్వాలి. మనము ఆయన పాదముల చెంత కూర్చుందాం, సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకుందాం. ఇతరులకు దానిని ప్రకటిద్దాం. 

- సిస్టర్. ఫాతిమా గారు 

 

ప్రార్థన అంశం:-

మన పరిచర్యలో సాయం చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al