Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.04.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 21-Apr-2024

దిన ధ్యానము(Telugu) 21.04.2024 (Kids Special)

 

అంశం: మీరు విశేషమైనవారు 

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు. 

 

“గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు” - మత్తయి 10:31 

 

అడవిలో ఒక ఏనుగు నివసిస్తూ ఉండేది. ఆ ఏనుగు ఎప్పుడూ ఇతర పక్షులతో, జంతువులతో తనను పోల్చుకొని నిరుత్సాహపడిపోతూ ఉండేది. ఎప్పుడూ చింతతోనే బాధతోనే ఉండేది. ఒక దినము చిన్నపిచ్చుక ఎగురుతూ వెళ్ళుట చూచి చెప్పలేనంత దుఃఖముతో బాధపడింది. నాకు రెక్కలు లేవే ఉంటే నేను కూడా ఎగురుతూ వెళ్ళేదాన్ని కదా అని అనడం ప్రారంభించింది. ఆ ఏనుగు అందువల్ల తిండి తినడం కూడా మానేసింది. 

 

అక్కడికి ఒక అందమైన నైటింగేల్ పక్షి చక్కగా పాడుతూ వచ్చింది. దాన్ని చూచిన ఏనుగుకు ఇంకా దుఃఖం ఎక్కువైంది. ఈ పక్షులన్నీ కూడా ఎంత చక్కగా పాడుతున్నాయి నాకు మాత్రం పాడడానికి తలాంతులు లేవే అని బాధపడింది. మరల ఒక సీతాకోకచిలుక అందముగా ప్రతి పువ్వు మీద వాలి ఆ తేనెను పిలుస్తూ ఉంది. ఏనుగు దాన్ని చూచి దేవుడు నాకు మాత్రమే ఎందుకు రుచి లేని ఆహారాన్ని ఇచ్చారు కానీ ఇది అయితే చక్కటి రుచికరమైన తేనెను తాగుతుంది అనీ బాధపడింది. 

 

చక్కగా లేడులు గెంతులు వేస్తూ ఉన్న దాని ఏనుగు చూసిన వెంటనే అయ్యో ఈ అందమైన లేడీ వలె నేను లేనే ఎంత చక్కగా పరిగెడుతున్నాయి అని కన్నీరు కార్చింది. అక్కడ చీమలు భూమిలోనికి వెళ్లి బయటికి వచ్చిన చూచి అయ్యో నేను ఇలా ఉండలేకపోతున్నానే అని బాధపడుతూ బలహీనమై మరణ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అడవిలో గల జంతువులు పక్షులు అన్నీ ఏనుగు యొద్దకు వచ్చి ఏనుగు దేవుడు నీకు ఎంత బలాన్ని ఎంత శక్తిని ఇచ్చారు. ఎంత బలమైన పెద్ద కాలు నీకు ఉన్నాయి చాలా విలువైన తొండం మరియు దంతాలు నీకు ఉన్నాయి. సృష్టిలో మీరు ఎంత గొప్పవారు అని ఆలోచించి చూడండి మిమ్మును గూర్చి ఏనుగు బ్రతికినా 1000 చచ్చినా వెయ్యి అనే మాట చెబుతూ ఉంటారు అని చెప్పి ఓదార్చాయి. అప్పుడు దేవుడు తనకిచ్చిన ఉన్నతమైన కార్యాలు తలంచి దేవున్ని మహిమ పరచుట ఏనుగు ప్రారంభించింది. తనను ప్రత్యేకంగా సృష్టించిన దేవుడ్ని మహిమ పరచడం ప్రారంభించింది

 

ప్రియ తమ్ముడు చెల్లి మీరు కూడా నేను నల్లగా ఉన్నాను నాకు అందము లేదు, నాకు తెలివి లేదు, నాకు సదుపాయాలు లేవు అని చెబూతు బాధపడుతున్నారా? మీరు ఎలా ఉన్నను యేసయ్యకు అది చాలా ఇష్టమే ఎందుకంటే మీరు యేసయ్య దృష్టిలో శ్రేష్టమైన వారు. 

- శ్రీమతి. జీవా విజయ్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet