By Village Missionary Movement
Wednesday, 17-Apr-2024దిన ధ్యానము(Telugu) 17.04.2024
అంశం: క్రీస్తు యొక్క పరిచర్య
"పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా" - లూకా 18:28
ఆర్ధర్ మార్గాసిస్ ఆరోగ్యవంతమైన శరీరం కలిగిన వారు కాదు. ఆస్తమా రోగం వలన ఇబ్బంది పడేవారు. అయినప్పటికీ తన ఆసక్తితో అంగీకరించిన పరిచర్య నెరవేర్చుటలో వాంఛ కలిగిన వ్యక్తి ఈయన. తన పరిచర్య చేయుటకు సమర్పించబడినప్పుడు వయసు 22 సంవత్సరాలు. వైద్య కళాశాలలో చదివి డిగ్రీ పొందుకొంటున్న సమయంలో మిషనరీ రాబర్ట్ కాల్డ్వెల్ యొక్క ఉత్సాహవంతమైన పిలుపు భారతదేశ దక్షిణ భాగం వైపు తీసుకుని వచ్చింది. ఈయన యొక్క సంపూర్ణ పరిచర్య సమర్పణ వలన వచ్చిన గ్రామమే నాజరేత్. ఇది తూతుకూడి జిల్లాలో ఉంది. ఈయన చేసిన పరిచర్య గురించి ఇప్పటివరకు మాట్లాడబడుతూ వస్తుంది. ఈ నాజరేత్ చుట్టూ అనేక గ్రామాలు క్రైస్తవ గ్రామాలుగా క్రీస్తు సువాసన పరిమళించే వారిగా ప్రజలు ఉన్నారు. ఈయన వలన చేయబడిన పనులు సమాజంలో అనేకమైనవి. కారణము క్రీస్తు పనిని ఉన్నతముగా ఆలోచించి సమస్త పనులు చేసేవారు.
విశ్వాసం వలన మోషే పెద్దవాడైనప్పుడు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అని పిలవబడుటకు ఇష్టపడక అశాశ్వతమైన పాప సంతోషంలో అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కీడును అనుభవించుట మేలు అని ఎంచుకొని ఇక వచ్చే ఉన్నతమైన కార్యము పై దృష్టి ఉంచి ఐగుప్తులో గల నిధులను గొప్ప కార్యాలను క్రీస్తు కొరకు వచ్చే నిందను భాగ్యముగా ఎంచుకున్నారు.
ప్రియమైన వారలారా గోధుమ గింజ నేలలో పడి చచ్చిన యెడల విస్తారమున ఫలితం వస్తుంది అని చెప్పబడిన వాక్యం ప్రకారంగా క్రీస్తు ప్రభువు యొక్క రాజ్యము కొరకు తమ కార్యాలను కోల్పోయిన వాళ్ళు త్యాగం చేసిన వారు అనేకమంది ఉన్నారు. కారణము క్రీస్తు యొక్క రాజ్య సువార్త ఉన్నతమైనదిగా ఎంచుకోబడింది. మన యొక్క దేశంలో విదేశీ మిషనరీలు కార్చిన రక్తపు చుక్కల పైన ఈ దినము నిలబడుతున్నాం. వారి వల్ల ప్రారంభించబడిన అనేక విద్యాలయాలు ఈ దినం వరకు వారి యొక్క త్యాగమును గుర్తు చేస్తూ ఉన్నాయి. ఒకరు క్రీస్తు కొరకు చేసిన త్యాగములను ఈ లోకం మర్చిపోవచ్చు కానీ క్రీస్తు పని కొరకు త్యాగం చేస్తున్న వాటిని పరలోకం ఎన్నడూ మర్చిపోదు. వారికి మరలా తిరిగి ఇస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుటకు సంతోషముగాను మహిమగల కార్యముగాను ఎంచెదము.
- శ్రీమతి. రూబీ అరుణ్ గారు
ప్రార్థన అంశం:-
మన ఆమెన్ విలేజ్ టీవీ కార్యక్రమంలో వాక్యము మరియు పాటలు పాడుతున్న చిన్నారుల యొక్క భవిష్యత్తు గురించి ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250