Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 09.04.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 09-Apr-2024

దిన ధ్యానము(Telugu) 09.04.2024

 

అంశం: క్రీస్తుతో మనము

 

"నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను" - గలతియులకు 2:20

 

ఒక మనిషి అనేక చోట్ల పని కొరకు వెతుకుతూ ఏ పని దొరక లేనప్పుడు ఎలాంటి డబ్బులు లేనప్పుడు ఒక దినము సముద్ర ఒడ్డున నడుస్తూ వెళ్తున్నాడు. సముద్రపు ఒడ్డున ఆయన నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆయన కాలుకు ఒక బాటిల్ తగిలింది. దానిని చూచి అతను దానిని తీసి ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు. ఆ బాటిల్ లోపల ఒక పేపర్ మడతపెట్టి ఉంది ఈ బాటిల్ ని తీసే అదృష్టవంతులు నా లాయర్ యొద్దకు వెళ్లి నా యొక్క ఆస్తి అంతటినీ వారికి రాసిస్తున్నాను ఇద్దరూ సరి సమానంగా దానిని పంచుకోవాలి అని రాయబడి ఉన్నది. దానిని అలాగే రాసిన వారి పేరు డేసి సింగర్ అలెగ్జాండర్ సింగర్ మిషన్ యజమానురాలైన ఒకరు. 12 సంవత్సరాల మునుపు లండన్లో గల ఒక నది ఒడ్డున ఈ బాటిల్ లో ఈ మాటలు పెట్టి విడిచిపెట్టారు. అది 12 సంవత్సరాల తర్వాత జెక్ బూమ్ అనే పేదరికంలో ఉన్న ఒక వ్యక్తి చేతికి దొరికింది. అది ఆయనను ఒకే దినములో గొప్ప వాడిగా చేసింది. ఎంత ఆశ్చర్యమో చూడండి. 

 

అపోస్తులుడైన పౌలు రాసిన గలతీయులకు పత్రికలో ఇలా చదువుతున్నాం. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం అయినను బ్రతుకుతున్నది నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నారు. (గలతియులకు రాసిన పత్రిక 2:20) అదే గలతియులకు రాసిన పత్రిక క్రీస్తుతో ఉన్నవారు తమ శరీర క్రియలను దాని యొక్క కోరికలను సిలువలో వేసి ఉన్నారు గలతి 5:24 అని అర్థమయ్యేటట్లు రాసిపెట్టారు. తమ శరీరానుసారముగా వెళ్లేవారు క్రీస్తు ఆలోచనకు లోబడరు దానికి వ్యతిరేకంగా ఆత్మీయ పరముగా నడిచే వారే సిలువలో వేసిన యేసయ్య కొరకు జీవిస్తారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! డేసి సింగర్ తన ఆస్తి అంతటిని తన వీలునామాలో రాసి ఒక బాటలో పెట్టి ఉంచారు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం మనం వెళ్లే పరలోకమునకు తీసుకొని వెళ్లలేము అలానే జెక్ బూమ్ కూడా తీసుకుని వెళ్లలేడు. దీనిని ఈ లోకపు ఐశ్వర్యం లోకముతో ముగించాలి ఎంత గొప్ప ధనవంతులుగా ఉండినను ఒక చిల్లి గవ్వను కూడా మరణించిన తర్వాత తన కొరకు తీసుకుని వెళ్ళలేరు. క్రీస్తుతో కూడా ఉండి ఆయన కొరకు ఏమి చేస్తున్నామో అదే మనతోపాటు నిలిచి ఉంటుంది కాబట్టి మన యొక్క కోరికలను క్రీస్తు కొరకు విడిచిపెట్టి ఆయన చిత్తానుసారముగా జీవిద్దాం. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఆమెన్ విలేజ్ టీవీ శాటిలైట్ టీవీ ఛానల్ గా మార్చబడడానికి తీసుకుంటున్న వేతనాన్ని దేవుడు మనకు సమకూర్చేటట్ల ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al