Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.04.2024 (Kids Special)
Share:

By Village Missionary Movement

Sunday, 07-Apr-2024

దిన ధ్యానము(Telugu) 07.04.2024 (Kids Special)

 

ప్రత్యేకంగా చిన్న పిల్లల కొరకు

 

"నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును" - సామెతలు 1:33

 

హలో పిల్లలు ఈ దినము నిజముగా జరిగిన ఒక సంఘటన వినబోతున్నాం. యేసయ్య యొక్క మాట విని నడిచిన యెడల అది మనకు సంరక్షణను దీవెనలు ఇవ్వగలదు అనేదాన్ని గురించి ఒక సంఘటన విందామా! యేసయ్య యొక్క స్వరాన్ని వినాలని మీకు కూడా ఆశగా ఉందా? రోజు బైబిలు చదివి ప్రార్థించి చూడండి. 

 

మచ్చకో అనే తల్లి యుద్ధంలో తన భర్తను కోల్పోయి దుఃఖముతో ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉండేది తన ముగ్గురు పిల్లలను హిరోషిమా వెళ్లే ట్రైన్ లో నుండి కిందకు తోసి వేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచించింది. అప్పుడు దేవుడు నేను నీకు తోడు యున్నాను అని ఆమెతో మాట్లాడారు. వెంటనే తన ఆత్మహత్య చేసుకునే ఆలోచన విడిచిపెట్టి హిరోషిమా నగరమునకు వెళ్లి పని వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడ ఒక హాస్పిటల్లో పని దొరికింది. అక్కడ చాలా శ్రద్ధతో పని చేయడం ప్రారంభించింది. అక్కడ తాను చేస్తున్న పనిలో ప్రమోషన్ వచ్చింది. అప్పుడు హఠాత్తుగా ఒక రోజు ఈమెకు జీతం ఎక్కువ ఇస్తామని చెప్పి ఆ హాస్పిటల్ నిర్వహకులు పిలిపించారు కానీ ఆ దినము రాత్రి దేవుడు ఆ పని విడిచి ఆ స్థలమును విడిచిపెట్టి వెళ్లిపోమని చెప్పారు. వెంటనే ఆమె హీరోషిమా నగరాన్ని విడిచిపెట్టి పక్కనే ఉన్న కొండ ప్రాంతంమునకు వెళ్లిపోయింది. మరుసటి రోజు అ నగరం మీద అమెరికా బాంబు వేసింది అయితే ఈ మచ్చుకో కుటుంబం మాత్రం కాపాడబడింది. తర్వాత పనిచేసి పిల్లలను పెంచుకుంటూ వచ్చారు. రోజు బైబులు చదివి ప్రార్థించుట నేర్పించారు. పిల్లలందరూ మిషనరీలుగా ఎదిగారు. ముగ్గురు పిల్లల్లో ఒకరు జమైకా దేశమునకు మరి ఒకరు ఆఫ్రికా దేశం నకు మరి ఒకరు భారతదేశమునకు మిషనరీలుగా వచ్చారు. మచ్చకో తల్లిగారు నాకంటూ ఎవరు లేరు అని ఆలోచించి నిరుత్సాహపడిన పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అనే పరిస్థితిలో నుండి దేవుడు ఆమెను విడవకుండా ఆమెతో మాట్లాడి ఆమెను కాపాడారు. 

 

ఇలాగే తమ్ముడు, చెల్లి! నాకు అమ్మ లేరు లేదా నాన్న లేరు నన్ను ప్రేమించడానికి ఎవరు లేరు జీవితంలో దారిలేదే అని ఆలోచిస్తూ ఉన్నారా? యేసయ్య మీకు తోడుగా ఉన్నారు ఆయన మీతో ఉండి మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ప్రార్థించి ఆయనను పట్టుకొనుడి. 

- శ్రీమతి. అనుభూ జ్యోతి స్టాలిన్ గారు

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al