Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 06.04.2024
Share:

By Village Missionary Movement

Saturday, 06-Apr-2024

దిన ధ్యానము(Telugu) 06.04.2024

 

అంశం: నా విమోచకుడు సజీవుడు 

 

"అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును" - యోబు 19:25 

 

 తీసేయన్ విలే అనే ఊర్లో గల స్కూల్ క్యాంపస్ లో మా ఇల్లు. రాత్రి ఈ సమయాల్లో చాలా ప్రశాంతం ఉంటుంది. వెనక భాగంలో ట్యూబ్ లైట్ వెలుగులో కుర్చీలో కూర్చొని చదువుట నాకు అలవాటు. రాత్రి 7:00కి నేను మాత్రం కుర్చీలో కూర్చుని ఉన్నాను ఇప్పుడు పాము వచ్చి నిన్ను కరిసిన ఎడల ఏమి చేస్తావ్ అని నాలో ఒక స్వరము వినబడింది. నేను ఆ స్వరాన్ని మనసులో ఆలోచించి ఇది ఏమి కాదులే అనుకున్నాను. కొంత సమయానికి టెలిఫోన్ మోగింది వెళ్లి చూస్తే నా కుమారుడు. వాడు ఎప్పుడూ ఆదివారం మాత్రమే మాట్లాడుతున్న వాడు ఆ దినం వాడికి సమయం దొరికినందున మాట్లాడుతున్నాను అని చెప్పాడు. మాట్లాడి ముగించిన తర్వాత బయటకు వచ్చి కుర్చీలో కూర్చునప్పుడు కుర్చీ అడుగుభాగం నుండి మెరిసిపోతున్న పాము ఒకటి వేగంగా వెళ్ళింది. నా విమోచకుడు సజీవుడు నన్ను కాపాడడానికి నాతోనే ఉన్నారు అని ఆయన స్తుతించాను. 

 

హగరు నీవు నన్ను చూచుచున్న దేవుడువు అని ఆయన పిలిచింది. అవును దేవుడు మన గాయములను, సమస్యలను, పోరాటలను చూచే దేవుడు. వాటన్నిటిలో సహాయం చేస్తున్నాడు అని మనం విశ్వసిస్తున్నామా? మన సత్క్రియలు చూచి ఫలితం ఇస్తున్న దేవుడు మనతో ఉన్నాడని గ్రహిస్తున్నామా? అదే సమయంలో ఆయన మన హృదయము కీడైన తలంపులతో నిండి ఉన్న దానిని మనం గ్రహిస్తున్నామా? కీడైన కార్యం వలన జరుగుతున్న కార్యాలను దేవుడు చూస్తున్నారు అనే భయం మనకు ఉన్నదా? 

 

తరువాత మనం మాట్లాడుతున్న దాన్ని శ్రద్ధగా వింటున్నారు, దేవుని పిల్లల మీద మనము మాట్లాడుతున్నవన్ని శ్రద్ధగా ఆలోచిస్తున్నారు కాబట్టి మన మాటల్లో శ్రద్ధ కలిగి ఉండాలి. మనం ఉత్సాహ పరచవలసిన కార్యము మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన దాని వింటున్నారు. తర్వాత మాట్లాడుతారు మన ప్రార్థనకు జవాబు ఇస్తున్నారు. బైబిల్ వాక్యాలు దేవుని సందేశాలు కలలో, దర్శనాలు, వ్యక్తులు, పరిస్థితులు, వీటి ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితంలో పరిచర్యలో అవసరమైన కార్యాలను సలహాలు మాట్లాడుతున్నారు. దేవుని ఎరుగుకుండా జీవిస్తున్న జీవితాలు జీవిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడి రక్షిస్తున్నారు. నా విమోచకుడు సజీవుడు యోబు 19: 25 అనే వాక్యాన్ని అనేకసార్లు మనము ఎత్తి పట్టుకుని ఆ దినమును ప్రారంభించిన యెడల మన విశ్వాసము దృఢపరచబడి క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్దాం. 

 

 యేసు సజీవుడు అనే సందేశాన్ని శిష్యులకు ప్రకటించుటకు మగ్దలెనా మరియ మరియు మరియొక మరియ త్వరగా పరిగెత్తి వెళ్లుట మనం చూస్తున్నాం. ఈ సందేశాన్ని ప్రకటించుటకు మనము కూడా తీవ్రత చూపిస్తామా? 

- శ్రీమతి. గీతా రిచర్డ్ గారు 

 

ప్రార్థన అంశం:-

సువార్త క్యాంపుల ద్వారా దర్శించబడుతున్న యవ్వనస్తులు మరియు చిన్నారుల కొరకు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al