By Village Missionary Movement
Friday, 05-Apr-2024ಧೈನಂದಿನ ಧ್ಯಾನ(Kannada) – 05.04.2024
అంశం: బాధ్యత మీ మీద
“అంతట వారు వీరిని గూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను” - అపో.కార్యములు 1:26
ఆస్ట్రేలియా దేశంలో ఒక చిన్న గ్రామంలో పేద వ్యవసాయ కుటుంబంలో కుమారుడుగా జన్మించాడు మెగ్రాత్. చిన్నపాయంలో పేదరికంలో చాలా కష్టపడ్డాడు. క్రికెట్ అటలో చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఈయన ఎలాగైనా తమ దేశము క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఏది తనకు కలిసి రాలేదు. అప్పుడు ఒకసారి తన సొంత ఊరి క్రికెట్ పోటీలో పాల్గొనుటకు అవకాశం దొరికింది. ఈయన అవకాశాన్ని వాడుకొని తన బౌలింగ్ ప్రతిభను తన జట్టు గెలువుటకు ప్రాముఖ్యమైన కారకుడయ్యాడు. తర్వాత తన బౌలింగ్ తెలివితేటల వలన నైపుణ్యత వలన ఆస్ట్రేలియా దేశపు జట్టులో మంచి ఆటగాడుగా స్థానం దక్కించుకున్నాడు. ఈయన అనేకమైన ప్రధానమైన పోటీలో తన జట్టును విజయ మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. మూడుసార్లు ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ క్రికెట్ పోటీ గెలవడానికి ఈయన వంతు ప్రయాసము చాలా ప్రాముఖ్యమైనది.
పరిశుద్ధమైన బైబిల్లో అపోస్తులకార్యం 1వ అధ్యాయంలో శిష్యులు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అదేమిటి అంటే ఇస్కరియోతు యూదా అనేవాడు తన స్థానాన్ని కోల్పోయాడు కాబట్టి ఆయన స్థానంలో మరొక వ్యక్తిని నియమించాలి అందుకొరకు ఆయన స్థానంలో ఒకరిని పెట్టుకొనుటకు చీట్లు వేస్తున్నారు. అయితే ఆ చీటి మత్తీయ అనే వ్యక్తి పేరు మీద పడింది. ఆయన ఈ 11 మంది అపోస్తులతో పాటు కలిసి పరిచర్య చేయటం మనం చూస్తున్నాం. తర్వాత దినాల్లో అపోస్తులు చేస్తున్న కొన్ని కార్యాలు మత్తీయ బాధ్యత కూడా మనం చూస్తున్నాం. అపోస్తులు రాస్తున్న చరిత్రలో ఈయనకు చోటు దక్కింది.
స్నేహితులారా! ఒక సొంత ఊరి ఆటలో ఆడుకొనుటకు అవకాశాన్ని వాడుకున్న ఒక యోధుడు అలానే శిష్యుల్లో ఒకరిగా చేర్చబడిన మత్తీయ అనే వ్యక్తి గురించి ఈ దినం మనం చూశాం. అయితే ఈ దినము మీ పరిస్థితి ఏమిటి? ఏదో ఒక బ్యాక్ గ్రౌండ్ లో, ఏదో ఒక కాలంలో, ఏదో ఒక వ్యక్తి ద్వారా యేసు యొక్క సువార్త మీ వద్దకు వచ్చింది. ఆ సువార్త ఎరుగని ప్రజలు లక్షల కొలది మనదేశంలో ఉంటున్నారు ఆ సువార్తను చెప్పవలసిన బాధ్యత మీ మీద నా మీద ఉన్నది అన్నదాన్ని మర్చిపోవద్దు. ఆ చీటు ఈ దినము మన పేరు మీద పడింది. నేను 12వ శిష్యుడిని అనేదాన్ని ప్రతి క్రైస్తవుడు చెప్పాలి ప్రియాసపడాలి. ఈ బాధ్యతను గ్రహించిన వాడిగా ఇశ్రాయేలు వలే బయలుదేరి వెళ్లి యేసయ్య ప్రేమను ఇతరులకు చెప్పాలి.
మన బాధ్యత మనం నెరవేర్చి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం.
- బ్రదర్. టీ. శంకర్ రాజు గారు
ప్రార్థన అంశం:-
ఇంపైన స్త్రీ అనే కార్యక్రమం వలన దర్శింపబడుతున్న
*Whatsapp*
ಈ ಧ್ಯಾನ ಸಂದೇಶವನ್ನು ತಮಿಳು, ಇಂಗ್ಲಿಷ್, ಹಿಂದಿ, ಮಲಯಾಳಂ, ತೆಲುಗು, ಕನ್ನಡ, ಪಂಜಾಬಿ ಮತ್ತು ಒರಿಯಾ ಭಾಷೆಗಳಲ್ಲಿ ವಾಟ್ಸಾಪ್ನಲ್ಲಿ ಪಡೆದುಕೊಳ್ಳಲು *+91 94440 11864* ಈ ಸಂಖ್ಯೆಯನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ.
www.vmm.org.in
ಈಮೈಲ್:- info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
ವಿಲೇಜ್ ಮಿಷಿನರಿ ಮೊಮೆಂಟ್ ವಿರುಧುನಗರ್, ಇಂಡಿಯಾ-626001
ಪ್ರಾರ್ಥನಾ ಅವಶ್ಯಕತೆಗಾಗಿ :- +91 93455 40482