Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.04.2024
Share:

By Village Missionary Movement

Thursday, 04-Apr-2024

దిన ధ్యానము(Telugu) 04.04.2024

 

అంశం: నీ నిధి ఎక్కడ? 

 

"దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను" - లూకా 12:21 

 

ఒకరు ఒక దేశం నుండి మరొక దేశమునకు పని కొరకు వెళ్లారు. కొన్ని సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉండి పనిచేయడానికి ఆయనకు అగ్రిమెంటు ఉండేది. అందువలన ఆయన అక్కడ ఉండి చక్కగా పనిచేశారు. అందువలన వచ్చే రాబడిలో తాను జీవించుటకు మాత్రము కావలసినది పెట్టుకుని మిగిలినది తన సొంత దేశంలో గల తన బ్యాంక్ అకౌంట్కు పంపిస్తూ ఉండేవారు. ఎందుకు అంటే ఇది నా సొంత దేశం కాదు అని ఇక్కడ నేను సమకూర్చిన యెడల అందువలన నాకు ఎలాంటి ప్రయోజనం లేదు అని ఇవ్వబడిన సమయము ముగించిన వెంటనే అక్కడ జీవించలేము అనేదాన్ని గ్రహించి ఆయన ఈ పని చేశారు. ఇది మనకు బాగా అర్థమవుతుంది. 

 

ఈ భూమి ఎవరికి శాశ్వతము కాదు ఖచ్చితంగా ఇక్కడి నుండి మన ఆత్మ పరలోకమునకు లేదా నరకమునకు అని పెట్టబడిన స్థలమునకు కొనిపోబడుతుంది అనే గ్రహింపు మనందరికీ ఉండవలసినది చాలా అవసరం కానీ మనలో అనేకులు దీనిని మర్చిపోయి ఈ భూలోకంలో ఎప్పుడూ ఉంటాము అని తలంచి విస్తారమైన వస్తువులను ఇక్కడ తమ కొరకు సమకూర్చి ఉండటం చూస్తున్నాం.  

 

పరిశుద్ధ గ్రంథంలో ఇలా తమ కొరకు సమకూర్చి పెట్టుకున్న ఒక ఐశ్వర్యవంతుడైన ఒక మనిషి గురించి చదువుతున్నాం. ఆయన తన ఆత్మతో నీ కొరకు అనేక సంవత్సరాలు వస్తువులు సమకూర్చి పెట్టుకొని ఉన్నాను కాబట్టి నీవు తిని త్రాగి సుఖించుము అని తనకు తాను చెప్పుకుంటున్నాడు. అయితే దేవుడు వాడిని చూసి ఓ వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును నేను తీసుకుంటే ఈ రాత్రి నీవు సమకూర్చున్నంత ఎవరిది అవుతుంది అని అడిగారు. ఇదే ప్రశ్న ఈ దినము దేవుడు మనల్ని అడిగిన ఎడల? 

 

ఈ లోకంలో ఎంతో మంది పేద ప్రజలు మనం చూడగలుగుతున్నాం. పేదలను కనికరించువాడు యెహోవా అప్పు ఇచ్చువాడు మరియు ఆకలి గల వారిగాను, దప్పిగల వారు గాను ,వస్త్ర హీనుడిగాను, రోగులుగాను, చెరసాలలో బంధింపబడిన వాడిగాను, అల్పులైన సహోదరులను బట్టి మీరు ఏమి చేశారో అది నాకే చేశారు అని యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నారు. 

 

మనము పరలోకములో నిధులను సమకూర్చుకొనుటకు ఇలాంటి కార్యములు చేయుటకు మంచి అవకాశం దేవుడు మనకు దయచేసి ఉన్నారు. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకుందాం ఈ భూమిని విడిచి మనం ఎప్పుడు వెళ్తామో ఎవరికీ తెలియదు. మనలను సృష్టించిన దేవునికి తప్ప కాబట్టి జాగ్రత్త పడదాం. 

- బ్రదర్. సింయోన్ గారు 

 

ప్రార్థన అంశం:

మన సోషల్ మీడియాలో ప్రార్థన అంశాలు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు అద్భుతాలు చేసినట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al