Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.04.2024
Share:

By Village Missionary Movement

Monday, 01-Apr-2024

దిన ధ్యానము(Telugu) 01.04.2024

 

అంశం: బయలుదేరి వెళ్ళేదము. 

 

"పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు" - యోహాను 9:4

 

సంపూర్ణ రాత్రి ప్రార్థన మంచి ఉద్దేశంతో అన్ని సంఘములలో కనబడుతుంది. అది ఎలాంటి సంఘమైనను ఆదివారంతో ఉండిపోకుండా ఉపవాసంతో సంపూర్ణ రాత్రి ప్రార్థన అని సంఘము నెలలో గల పట్టికలో ఒకసారి ఉండటం మనం చూడగలం. ఇలాంటి ధ్యానంలో వాక్యానుసారముగా సంపూర్ణ రాత్రి ప్రార్థన గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 

 

మన ప్రభువైన యేసుక్రీస్తు తన పరిచర్య అనేకసార్లు రాత్రంతా కూడా ప్రార్థించారు. మార్కు సువార్త 1:35, లూకా సువార్త 6:12, 21,37. రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా విశ్రాంతి తీసుకోకుండా పరిచర్య చేశారు అని బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. రాత్రంతా ప్రార్థించారు పగలంతా అన్ని ప్రాంతాలు తిరుగుతూ పరిచర్య చేశారు. ఇదే యేసయ్య మనకు నేర్పించిన మాదిరి కరమైన పరిచర్య విధానం. రాత్రి ప్రార్థన గురించి ఎక్కువగా ఆసక్తితో మాట్లాడుతున్న ఈ దినపు సంఘాలు, సేవకులు, సువార్తికులు పగలు కూడా బయటకు వెళ్లి పరిచర్య చేయాలి అని బోధించుట సరియైన విధానంగా ఉంటుంది. పనులు చేయకుండా ప్రార్థన మాత్రం చేయడం సరైనది కాదు. ఈ దిన ధ్యానాంశములో మనము చదివేటప్పుడు దానిని మనము అర్థము చేసుకోగలము. 

 

సంపూర్ణ రాత్రి ప్రార్థన మరియు ఉపవాస ప్రార్థన గురించి తీవ్రతతో మాట్లాడుతూ బోధిస్తున్న మన సంఘాలకు బయటకు బయలుదేరి వెళ్లి పరిచర్య చేయాలి అని అనే కార్యము మాత్రము ఎందుకు మరిచిపోయిందో మనకు అర్థం కావడం లేదు. ఈ దినపు సందేశంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెబుతున్న కార్యమేమిటి అంటే ప్రార్థనతో నిలిపివేయకుండా బయటకు బయలుదేరి వెళ్లి పరిచర్య చేయండి అనే భారము కలిగిస్తున్నారు. చార్లెస్ ఫిన్ని ఈయం ఫోన్స్, జాన్ గైడ్ అనే అనేక మంది దేవుని సేవకుల యొక్క జీవితాలు తిరిగి చూసిన ఎడల వారందరూ రాత్రంతా ప్రార్ధించి పగలంతా తిరుగుతూ పరిచర్య చేసేవారు అని వారిని గురించి చరిత్ర మనం చదవగలం. మన దేశంలో పరిచర్య చేసిన సాధు సుందర్ సింగ్ రాత్రంతా ప్రార్థిస్తారు పగలంతా కూడా హిమాలయ ప్రాంతంలో చుట్టూ తిరిగి పరిచర్య చేసి అనేక ఆత్మలను యేసు దగ్గరకు నడిపించారు అని ఆయన గురించి చరిత్ర చదువుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైన వారలారా రాత్రి ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో అలానే బయటికి వెళ్లి పరిచర్య చేసి ఆత్మలను రక్షించుటలో కూడా ప్రాముఖ్యత చూపించాలి అనే కార్యం వైపు ప్రభువు మనల్ని నడిపించును గాక! 

- బ్రదర్. పి. జాకబ్ శంకర్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంతా జరుగుతున్నటువంటి పరిచర్యలో దేవుని హస్తము తోడైయుండి నడిపించినట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al