Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 29.03.2024
Share:

By Village Missionary Movement

Friday, 29-Mar-2024

దిన ధ్యానము(Telugu) 29.03.2024

 

అంశం: సిలువలో పూసిన పుష్పాలు 

 

“అందుకు పిలాతుఎందుకు? అతడే చెడుకార్యము చేసెనని వారి నడుగగా వారువానిని సిలువవేయుమని మరి ఎక్కువగా కేకలువేసిరి” - మార్కు 15:14

 

ప్రేమ స్వరూపి అయిన ప్రభువు సిలువలో వేయబడుతూ కొట్టుమిట్లాడుతూ ఉండేటప్పుడు పలికిన ఏడు మాటలు ఏడు పుష్పాలుగా పరిమళిస్తున్నాయి. వాటిని చూద్దామా! 

 

1.క్షమాపణ అనే పుష్పము

 యేసు క్రీస్తు ప్రభువు సిలువలో వేయబడి శ్రమల గుండా వెళుతూ ఉండేటప్పుడు అలా కీడు చేసిన వారిని తాను క్షమించి తండ్రిని కూడా క్షమించమని ప్రార్థన చేశారు. మనకు ఎవరు ఈ లోకంలో పెద్ద కీడు చేయలేదు కాబట్టి అందరిని మనము క్షమిద్దాం. 

 

2. రక్షణ అనే పుష్పము 

తన పాపాన్ని గ్రహించి మీతోపాటు రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అని బ్రతిమలాడిన దొంగకు రక్షణను ప్రసాదించారు. మనము ఈ రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నారు. మనం ఎంతమందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం.

 

 3. పరామర్శించుట అనే పుష్పము 

తనను నవమాసాలు మోసిన కన్న తల్లికి వేపనకరమైన పరిస్థితిలో ఏడుస్తూ ఉండడు చూసి తన బాధ్యత నెరవేర్చుటకు తల్లిని తన ప్రేమ కలిగిన శిష్యునికి పరామర్శించుటకు అప్పగించారు. మనము మనలను అనేక శ్రమల గుండా పెంచిన తల్లిదండ్రులను ఆఖరి వరకు పరామర్శించాలి. ఈ కార్యము చెప్పుటకు మనకు మాదిరిగా యేసు క్రీస్తు ప్రభువు కార్యము చేశారు. 

 

4.పరితపించుట అనే పుష్పము 

లోక పాపము అంతటినీ యేసుప్రభు పైన మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటిమయముగా ఉంది. తండ్రి ముఖము మరుగు చేయబడింది. ఆ చెప్పలేని వేదనతో పరితపించారు. మన జీవితంలో వచ్చే ఆత్మీయ చీకటి మారి ప్రభు యొక్క ముఖమును చూచుటకు మనం పరితపించి ప్రార్థన చేస్తున్నామా? 

 

5.దప్పిక అనే పుష్పము 

కొన్ని సమయాల్లో రక్తము చెమటగా కారుతున్నట్లు మనోభారాలను, శరీరంలో కొరడా దెబ్బలను కొట్టుటను అనే అనేక శ్రమలను భరించి దప్పిక చెందారు. మరియు పాపులను రక్షించుటకు వచ్చిన ఆయన ఆత్మల గూర్చిన దప్పికచేత దప్పిక కలిగి ఉన్నాను అని అన్నారు. అవును మనము ఆయనను ఎరగని వారికి సువార్తను ప్రకటించి దేవుని దప్పిక తీరుద్దాం.

 

6. ముగింపు అనే పుష్పము 

దేవాది దేవుడు మానవ అవతారం ఎత్తి వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చి ముగించారు. పౌలు క్రీస్తు కొరకు జీవించి తన పరుగున తుద ముట్టించాను అన్నారు. అలానే మనకి ఇవ్వబడిన కార్యములను చేసి ముగించుటకు శ్రద్ధగా ఉందాం. 

 

7.అప్పగించుట అనే పుష్పము 

అప్పగిస్తున్నాను అనేదానికి విలువ కలిగిన ఒకదానిని మరలా పొందుకొనుటకు సంరక్షణ కలిగిన చోట్లలో కాపాడబడేటట్లు తన తండ్రికి తన ఆత్మను అప్పగిస్తున్నారు. ఈ దినము మన జీవితాన్ని ఆయన హస్తములకు అప్పగిద్దామా! 

 

సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని మూడు గంటల్లో ఏడు పుష్పములుగా పరిమళింప చేశారు. మనము ఈ పుష్పముల వలె పరమలిస్తూ జీవిద్దాం. 

- శ్రీమతి. వనజా పాల్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:

ఫిలిప్ గాస్పల్ టీం పరిచర్య కొరకు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al