Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 28.03.2024
Share:

By Village Missionary Movement

Thursday, 28-Mar-2024

దిన ధ్యానము(Telugu) 28.03.2024

 

అంశం: ఏసుప్రభు యొక్క శ్రమలు

 

"అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వధకు తేబడు గొఱ్ఱెపిల్లయు బొచ్చు కత్తిరించువానియెదుట గొఱ్ఱెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరువలేదు" - యెషయా 53:7

 

యేసుక్రీస్తు లోకంలోనికి రక్షకుడుగా పంపించబడటానికి ముందు ఆయన జన్మము, పరిచర్య ఆయన అనుభవించబోతున్న శ్రమలు అన్నిటిని ప్రవచనముగా ప్రవచించబడింది. విశేషముగా ఆయన చివరి దినాల్లో జరగబోతున్న సంఘటనలు, సిలువ శ్రమలు, మరణము వీటన్నిటిని గురించి అనేకమైన ప్రవచన గ్రంథాల్లో రాయబడింది. 

 

ఇస్కరియోతు యూదా యేసును 30 వెండి నాణముల కొరకు అప్పగించుటకు ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని వెళ్లారు. అక్కడ ఆయన మీద అబద్ధపు సాక్షులతో నేరరోపణ చేయబడింది. యేసయ్య అయితే మౌనంగా ఉన్నారు (మత్తయి సువార్త 26: 63). మరణమునకు పాత్రుడు అని తీర్పు తీర్చినప్పుడు ఆయన ముఖముపై ఉమ్మి ఆయనను కొట్టారు. మరికొందరైతే ఆయన చెంప మీద కొట్టి ఆయనను పరిహాసము చేశారు. 

 

యేసయ్యను ఫిలాతు వద్దకు పంపించినప్పుడు ఫిలాతు ఆయనను విడిపించాలని ఆశించి పండుగ దినాలలో ఎవరినైనా నేను మీ కొరకు విడిపించాలి కదా బరబ్బాను విడిపించాలా యేసు క్రీస్తును విడిపించాలా అని అడిగినందుకు జనాలు బరబ్బాను విడుదల చేయుడి యేసయ్యను సిలువలో వేయండి అని కేకలు వేశారు. పిలాతు యొక్క సైనికులు యేసు యొక్క వస్త్రములను విప్పి ఎర్రని వస్త్రము ధరించి ముళ్ళ చేత ముళ్ళ కిరీటం చేసి ఆయన తల మీద పెట్టి ఆయన ముందు సాష్టాంగ పడి యూదులకు రాజుకు ఘనత కలుగును గాక అని ఆయనను అపహాసించిరి. ఆయన ముఖము మీద ఉమ్మి ముళ్ళ కిరీటాన్ని ఆయన తలకు కొట్టడం మొదలుపెట్టారు. 

 

యేసు ప్రభువు హేరోదు వద్దకు పంపించబడ్డారు. హేరోదు యేసుప్రభునకు అడిగిన ప్రశ్నలకు యేసుప్రభువు ఏమాత్రం జవాబు చెప్పలేదు (లూకా 22: 9). కొరడాలతో కొట్టి మరణమునకు అప్పగించారు. ఇద్దరు నేరస్తుల మధ్యలో వేయబడ్డారు. రెండు చేతులకు మరియు కాళ్లకు మేకులు కొట్టబడి చంపబడ్డారు. ఆయన మరణించారా అని చూచుటకు ఈటెతో ప్రక్కలో పొడిచి చూసారు. 

 

దీనిని చదువుతున్న ప్రియమైన సహోదరీ, సహోదరులారా యేసుప్రభువు ఇన్ని శ్రమలను ఎందుకు సహించారు? ఎవరి కొరకు సహించారు? పరిహాసము, నింద, అవమానము, ముండ్ల కిరీటము, సిలువ శ్రమలు, వీటన్నిటిని ఎందుకు సహనంతో సహించారు? కేవలం మన కొరకే. మనం పాపములో నుండి శాపములో నుండి విడిపించబడుటకే. ఆయన చిందించిన రక్తం యొక్క శక్తి గ్రహించి ఆయనను రక్షకునిగా, ప్రభువునిగా అంగీకరించిన యెడల మన పాపములు కడగబడి నిత్య జీవాన్ని పొందుకుంటాము. ఈ నిత్యజీవము పొందుటకు దేవుడు మీకు కృప దయచేయును గాక ! 

- శ్రీమతి. భువన ధన బాలన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన క్యాంపస్ లో జరుగుతున్న స్వస్థ పరిచే ఆరాధనలో అనేకులు పాల్గొని ఆరోగ్యం పొందుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al