Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 23.03.2024
Share:

By Village Missionary Movement

Saturday, 23-Mar-2024

దిన ధ్యానము(Telugu) 23.03.2024

 

అంశం: సమయము బంగారం వంటిది

 

"అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి" - ఎఫెసీయులకు 5:16 

 

అనేకులు కాలము గురించి అనేక విధములుగా చెబుతూ ఉంటారు. సమయము బంగారం వంటిది కాలాన్ని వ్యర్ధము చేయొద్దు. ప్రతి సెకను కూడా విలువ గలిగినది అని అనేక మాటలు చెబుతూ ఉంటారు. ఒక నిమిషం యొక్క విలువ రైలు పోగొట్టుకున్న వారిని అడిగితే తెలుస్తుంది అంటారు. గంట యొక్క విలువ సరైన సమయంలో ఆపరేషన్ చేయలేకపోయినా డాక్టర్ని అడిగితే చెబుతారు. ఒకరోజు యొక్క విలువను రోజు కూలి పని చేస్తూ తన ఇంటిని పోషిస్తున్న వారికి అడిగితే తెలుస్తుంది అంటారు. ఒక నెల యొక్క విలువ ఒక నెల తక్కువలో జన్మనిచ్చిన బిడ్డ యొక్క తల్లిని అడిగితే తెలుస్తుంది అంటారు. ఇలా దినములు గురించి అనేక ఆలోచనలు అనేక కార్యములు లోకంలో ఉన్నప్పటికీ బైబిల్ మనకు చెబుతుంది దినములు చెడ్డవి గనుక వాటిని సద్వినియోగం చేసుకొనుడి. 

 

దినములు చెడ్డవి అని ఎందుకు బైబిల్ చెబుతుంది? ఎవరికి చెడ్డవి? లోక ప్రజలందరికీ చెడ్డవే. ఎప్పుడు ఇది చెడ్డదిగా మారింది అంటే దేవుడు ప్రతి దినాన్ని మంచిగానే చేశారు కానీ మనుషుడు పాపము చేసినప్పుడు దినములు చెడ్డవిగా మారాయి. చాలా సుందరమైన ఏదైనా తోటలో దీనిని కోల్పోయాడు. చెమట కార్చవలసి వచ్చింది, ప్రసవించినప్పుడు వేదనను అనుభవించవలసి వచ్చింది. మేలు చేస్తే మేలు కీడు చేస్తే కీడు మనము చేస్తున్న మేలుకొరకైనా కీడు కొరకైనా తగిన ఫలితాన్ని పొందుదాము అని బైబిల్ చెబుతుంది. 

 

మనము నిత్యముగా సుఖమంతమైన జీవితాన్ని పొందుకొనుటకు సద్వినియోగపరుచుకోవాలి ఒక తలాంతులు పొందుకున్న వాడు ఆ తలాంతు భూమిలో పాతిపెట్టాడు. వాడు చెడ్డ దాసుడు సోమరివాడు అని పేరుతో నిత్యపు చీకట్లో తోసి వేయబడ్డాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని తలాంతులు అభివృద్ధి చేసుకున్న వాడు మేలు కలిగి ఇంకా ఎక్కువ తలాంతులు పొందుకున్నాడు. యజమాని యొక్క సంతోషములో పాలు పొందుకొనే భాగ్యము ధన్యత అతనికి దొరికింది (మత్తయి 25:15- 30).

 

మనకు ఇవ్వవలసిన కాలము ఎంత అన్నది మనం ఎరిగి ఉండలేదు కాబట్టి దానిని మనం లోకంలో జీవించవలసిన ఉద్దేశాన్ని నెరవేర్చి ముగించిన పౌలు వలె మంచి పోరాటం పోరాడితిని నా పరుగు తుద ముట్టించితిని జీవ కిరీటం నా కొరకు దాచబడి ఉన్నది అని మనము కూడా పరిగెత్తాలి. జీవ కిరీటాన్ని పొందుకున్న వారిగా పరిగెడదాం. ఏ ఒక్కరము కూడా మన కిరీటన్ని తీసుకొనకుండా జాగ్రత్త పడదాం (ప్రకటన 3:11).

- బ్రదర్. శామ్యూల్ మోరీస్ గారు 

 

ప్రార్థన అంశం:

ప్రతి సోమవారం జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని బలమైన శక్తి బయలుపరచబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al