Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.03.2024
Share:

By Village Missionary Movement

Thursday, 21-Mar-2024

దిన ధ్యానము(Telugu) 21.03.2024

 

అంశం: బొప్పాయి

 

"నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము" - మార్కు 9:43 

 

కృప ఇంటి ముందు కంటికి కనిపించే అంత దూరంలో ఒక తోటలో ఒక మంచి బొప్పాయి చెట్టు కనిపించింది. ఆమెకు చాలా సంతోషంగా ఉంది. రోజురోజు దాన్ని చూస్తూ అది ఎదుగుతున్న విధానాన్ని గమనిస్తూ వచ్చింది. రెండు నెలలు గడిచిన తర్వాత ఆ బొప్పాయి చెట్టు ఎదుగుతున్నది. రోజులు గడుస్తున్న కొలది చిన్న చెట్టు పెద్ద చెట్టుగా మారింది. కానీ ఎటువంటి కాపు లేదు కృపకు చాలా బాధగా ఉంది. చెట్టు అయితే పెరిగింది గాని పండ్లు కాసే సమయంలో పడిపోతుందేమో అని భయం మొదలైంది. కాయలు వచ్చాయి కాయలు కొద్దిగా పెరిగాయి పచ్చగా ఉన్న కాయలు ఎర్రగా మారి పండ్లుగా మారాయి. దారిలో వెళ్తున్న అందరూ చూపు వాటిపైనే పడ్డాయి. ఒకరోజు ఆ దారిలో వెళ్తున్న పేద వ్యక్తి రెండు బొప్పాయి పండ్లను తీసుకొని చాలా సంతోషముతో ఆయన వెళ్లిపోయాడు. 

 

తన కాలమందు కాపుకు వచ్చి మంచి ఫలముల చేత ఇతరులను తృప్తిపరిచిన ఆ బొప్పాయి చెట్టును చూసి కృపకు దేవుని గ్రంథం నుండి వాక్యము గుర్తుకొచ్చింది. మంచి ఫలము ఇవ్వలేని చెట్టును నరికి అగ్నిలో పడి వేస్తారు అనేది. 

 

ప్రియమైన వారలారా! మనము ఆ చెట్టు వలె లోపం కలిగిన వారిగా, చదువు లేని వారుగా ఉండవచ్చు, పేదరికంలో ఉండవచ్చు కానీ మన జీవితంలో దేవుడు ఎదురు చూస్తున్నా ప్రేమ, సంతోషము, సమాధానము, చాలా ఓర్పు, దయ మంచితనము, విశ్వాసము, ఆశా నిగ్రహము ఇలాంటి మంచి ఫలములు లేకపోతే మనము కూడా నరకబడి అగ్నిలో వేయబడతాము. ఫలములు ఇచ్చే జీవితము మాత్రమే అర్థవంతమైన జీవితం. ఈ బొప్పాయి చెట్టుకు లోటు ఉన్నను తగిన కాలంలో మంచి ఫలములతో ఆకలితో ఉన్నవారికి తన పనిని చేసింది కదా. అవును మనము కూడా ఫలములు ఇచ్చే జీవితం జీవించడానికి అడ్డుగా ఉన్న కార్యాలను నరికి పడవేయాలి. రెండు కళ్ళతో ఉండి ఫలము లేకుండా నరకంలో పడవేయబడడాని కంటె ఒక కన్నుతో ఫలమిచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశించుట మంచిది అని పరిశుద్ధ గ్రంథములో మార్పు 9: 47 లో మనము చదువుతూ ఉన్నాం. జీవించిన ఈ ఒకే జీవితంలో మంచిగా జీవించి మంచి కార్యాలు చేసి ఆలమను ఇచ్చి జీవించుటకు ప్రయత్నిద్దాం. ఒక్కొక్క రోజు ముగించబోతున్న సమయంలో దేవుని కొరకు ఏదైనా మంచి కార్యాలు చేసి దేవుని సంతోష పరచాలి అని చేయుటకు ఆలోచించండి. 

 

మీ యజమానుడు చూడడానికి వచ్చిన రోజు మీరు ఫలములతో ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నారా? దేవుడు ఇస్తున్న ఒక్కొక్క రోజును దేవుడు మీ పేరు మీద సంతోషపడే కార్యాలను మనము చేయుటకు జాగ్రత్తగా ఉన్నామా? మనము సాకులు చెప్పి అతని బాధ పెడుతున్నామా? మీకోసం తన జీవితాన్ని ఇచ్చిన దేవునికి మీరు ఏమి చేయబోతున్నారు? 

- శ్రీమతి. ఏమీమా సుందర రాజన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మన ఫీల్డ్ లో చర్చి కట్టడానికి సహాయపడె కుటుంబాలు దొరికేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al