By Village Missionary Movement
Tuesday, 19-Mar-2024దిన ధ్యానము(Telugu) 19.03.2024
అంశం: బలహీనత అడ్డు కాదు
"అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని" – 2 కోరింథీయులకు 12:8
ఇంగ్లాండ్ దేశంలో ఒక ఆమె ఏడుగురు బిడ్డలను సుఖమైన ప్రసవంలో ప్రసవించింది. ఎనిమిదో బిడ్డకు జన్మనిచ్చినప్పుడు వ్యాధితో, బలహీనతతో ఒక బిడ్డను కన్నది. ఆ బాలుడు బలహీనతతో పుట్టినందువల్ల చాలా కష్టాలు అనుభవించాడు. అతనిని చాలా హాస్పిటల్స్ కు తీసుకు వెళ్లినప్పటికీ అతనికే మాత్రం బాగుపడలేదు కానీ ఆ పిల్లవాడు ఎదిగినప్పుడు క్రీస్తు అంగీకరించాడు. దేవుని కొరకు పౌరుషముగా జీవించాడు. ఒకరోజు ఊపిరి పీల్చిన కష్టంగా ఉన్నప్పుడు ఒక డైరీ ని తీసి ప్రభువా నీ నామమును మిగతా వాళ్ళకి చెబుతాను నన్ను కాపాడుతావని నమ్ముతున్నాను అని రాశాడు. దీనిని చూసి దేవుడు అతనికి మంచి స్వస్థతను ఇచ్చారు. అతను ఎవరు అంటే ఆర్ధర్ మార్క సీజర్. ఇతను తమిళనాడులో నాజరేత్ అనే స్థలమునకు వచ్చి దేవుని కోసం పని చేశారు.
పరిశుద్ధ గ్రంథంలో పౌలు బలహీనుడిగా ఉన్నప్పుడు బలహీనత పోవాలి అని ప్రార్థన చేశాడు అయితే దేవుడు బలహీనతలలో నా బలము సంపూర్ణముగా ఉంటుంది అని చెప్పారు. ఇతను కూడ చాలా బలహీనతతో చాలా కష్టాలు అనుభవించారు. అయినను ఎక్కువ సంఘాలను కట్టగలిగారు చాలా ప్రాంతములకు వెళ్లి యేసుప్రభు యొక్క పనిని చేయగలిగారు. బలహీనత ఎప్పుడూ దేవుని యొక్క పనికి అడ్డుగా ఉండకూడదు. ఒకవేళ మీరు బలహీనతగా ఉన్నందున దేవుని నుండి వెనకకు తిరిగిన యెడల దేవుని దగ్గర మరల ప్రార్థించండి. మీరు మీ బలహీనతలో కూడా దేవుని కొరకు పనిచేసినప్పుడు దేవుడు తన కృపతో మమ్మల్ని జాగ్రత్తగా నడిపిస్తారు. మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు.
దీనిని చదువుతున్న ప్రియమైన వారలారా! మీరు మీ యొక్క బలహీనతలు చూసినప్పుడు అది చాలా పెద్దగా కనిపిస్తుంది. మీకు వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి చూస్తే మీ బలహీనత ఏమి లేనట్లుగా కనిపిస్తుంది. మీరు ముందుకు వెళ్ళండి, దేవుడు లేని దానిని ఉన్నదిగా పిలిచిన దేవుడు. భయపడకు అని గిద్యోను ద్వారా భయంకరం కార్యాలు చేశారు. యవ్వనస్తుడైన యెహోషువాను భయపడకు అని చెప్పి లక్షల కొలది ప్రజలను నడిపించడానికి బలమును దయచేసారు. బలహీనతగా ఉన్న పౌలును దేవుడు వాడుకున్నారు కూడా. దేవుడు వాడుకుంటారు బలహీనతను చూసి మీరు కృంగిపోకండి. క్రీస్తుని చూసి అతని కృపను పొంది ముందుకు వెళ్ళండి. దేవుడు మీ ద్వారా చాలా గొప్ప కార్యాలు చేస్తారు. ఆమెన్!
- శ్రీమతి. అనుభూ జ్యోతి స్టాలిన్ గారు
ప్రార్థన అంశం:-
ఈ సంవత్సరంలో 313 గ్రామాలలో చిన్నపిల్లల యొక్క పరిచర్య నడిపించే విధంగా ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250