Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.03.2024
Share:

By Village Missionary Movement

Tuesday, 12-Mar-2024

దిన ధ్యానము(Telugu) 12.03.2024

 

అంశం: ఇది న్యాయమా

 

"కాబట్టి ఆ కుష్ఠ రోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చియొక గుడారము జొచ్చి భోజనపానములుచేసి, అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తికొని పోయి దాచిపెట్టి, తిరిగి వచ్చి మరియొక గుడారము జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తికొని పోయి దాచిపెట్టిరి" - 2 రాజులు 7:8

 

చాలామంది ప్రజలు ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు అని మనం అనుకుందాం. వెళ్తున్న దారిలో చాలామంది ప్రజలు ఆహారం లేకుండా ఆకలితో చనిపోతున్నారు. కానీ ఒక్క వ్యక్తి దగ్గర మాత్రం పాత్రలో ఆహారం ఉంది. ఆహారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే మిగిలిన వాళ్లకు ఇస్తూ ఉంటే ఆహారము అందులో పెరుగుతూ ఉండేది. అలాంటి గొప్ప ఆహారం అది కానీ అతను ఆహారాన్ని ఎవరికీ ఇవ్వకుండా అనేకమంది తన కళ్ళ ముందు మరణిస్తున్న గాని కొంచమైనా బాధ లేకుండా ఉన్నారు. మనకు ఈ సంఘటన మనకు న్యాయంగా ఉంటుందా? 

 

పరిశుద్ధ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము 6,7 అధ్యాయలలో ఇశ్రాయేలు దేశ ప్రజలు చాలా కరువులో చిక్కుబడి ఉన్నారు. దేశములో కుష్టి రోగులు నలుగురు రాత్రివేళ ఈ కరువుకు కారణమైన తన దేశాన్ని ముట్టడివేసిన సిరియా దేశపు పాలెం లోనికి వెళ్లి చూశారు. అక్కడ ఒక్కరు కనిపించలేక పోవుట చూసి శత్రువుల యొక్క గుడారం లోనికి ప్రవేశించి భుజించి వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా వస్తువులలో కొన్ని విలువైన వస్తువులు తీసుకొని దాచిపెట్టుకుని వచ్చారు. మరల పశ్చాత్తాప పడి మన దేశ ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నప్పుడు మనం మాత్రం తృప్తిగా తిని ఉండుట న్యాయం కాదు ఈరోజే సువార్తను ప్రకటించే రోజు మనం మౌనముగా తెల్లవారి వరకు మన వేచి ఉంటే నేరం మన మీదకి వస్తుంది అని చెప్పి రాత్రికి రాత్రి వెళ్లి రాజు యొక్క భవనంలోనికి ఆ వార్తను తెలియజేసిరి. 

 

దీనిని చదువుతున్న దేవుని యొక్క ప్రజలారా! మనుషులు పాపములోను, అక్రమములోనూ, అతిక్రములోను, వేదనలోను, మరణాంధకారంలోను చిక్కుబడి ఉన్నారు. వారిని రక్షించుటకు తండ్రి అయిన దేవుడు తన యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించారు. మూడవ రోజున తిరిగి మరలా లేచారు। దీనివలన మనము పాపము నుండి రక్షణ పొందుకున్నాము. మనకు రాబోయే రోజుల్లో పరలోకంలో దేవునితో ఉండుటకు అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేశారు కానీ ఎంతోమంది ప్రజలు ఈ సత్యాన్ని తెలుసుకోకుండా నశించిపోతున్నారు. ప్రతిరోజు మన సువార్త ప్రకటించ వలసిన రోజులే. ఆకలితో మరణిస్తున్న ప్రజలు గురించి కనికరము ఆ కుష్టి రోగులకు ఉన్నది. మనం ఎలా ఉన్నాము? ఒకవేళ తెల్లవారి మనం చెబితే నేరం మన మీదకు వస్తుంది అని ఆ కుష్టు రోగులు వెంటనే వెళ్లి చెప్పారు. ఈ కుష్టు రోగులకు ఉన్న దుఃఖములో కొంచమైననూ మన దగ్గర ఉన్నదా? మనలను మనము నిదానించి చూద్దాం. 

- బ్రదర్. సిమ్యోన్ గారు 

 

ప్రార్థన అంశం:-

చిన్నపిల్లల కొరకు కిడ్స్ ఛానల్ ప్రారంభించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al