By Village Missionary Movement
Monday, 11-Mar-2024దిన ధ్యానము(Telugu) 11.03.2024
దిన ధ్యానము
అంశం: పరిపక్వత
"నేను పిల్లవాడనైయున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని" - 1 కోరింథీయులకు 13:11
మనము చాలా ఆసక్తితో ఒక మామిడి మొక్కను కొని మన ఇంట్లో దాన్ని నాటి దాన్ని శ్రద్ధగా చూసుకుంటూ పెంచుతుంటాం. ఒకరోజు అందుకు కావాల్సిన నీళ్లు, ఎరువు అన్నింటిని చక్కగా వేసి సరియైన సమయంలో మంచి ఎదుగుదల కొరకు ఎదురు చూస్తుంటాం. అదే మామిడి మొక్క ఎదిగి మామిడి చెట్టుగా మారి ఫలాలు ఇవ్వడం ప్రారంభిస్తే ఎంత సంతోషిస్తాం. ప్రతిరోజు ఎదుగుదల చాలా ప్రాముఖ్యం అలానే క్రీస్తు నందు జన్మించిన వారమైన మనము ప్రతిరోజు ఎదగాలి అని దేవుడు ఎదురుచూస్తూ ఉన్నారు. అంటే ఆత్మీయ జీవితంలో, బైబిల్ ధ్యానంలో, సత్క్రియలు చేయుటలో దేవునితో గల బంధంలో, లోతైన ప్రార్థన జీవితంలో అని చెబుతూ వెళ్ళవచ్చు. ఇలా ఎదిగిన ఆత్మీయుడు యొక్క పరిపక్వత గుర్తు ఏమిటో ఈ దినము ధ్యానిద్దాం.
1) ఇతరుల కొరకు సహాయం చేసే మనసత్వం కలిగిన వారుగా ఉంటాం. ఈ యోనాతాను సౌలు రాజు యొక్క సొంత కుమారుడుగా ఉండినప్పటికీ తన స్నేహితుడైన దావీదుకు మీరు రాజుగా ఉంటారు నేను మీకు రెండోవాడిగా ఉంటాను అని తన స్థానాన్ని ఇచ్చేవాడిగా యోనాతానును మనం చూస్తున్నాం.
2) నెక్స్ట్ పేరా ఇప్పుడు తాము వహించే బాధ్యత, అధికారము, ప్రధానమైన స్థలాన్ని తలంచుకున్న వాటిని ఇచ్చి వేసి దీనత్వముగల వారిగా పరిచర్య చేయుటకు ముందుకు వస్తారు. వీరు ఇతరులను మనకంటే ఉన్నతమైన వారిగా ఎంచుతారు. చదువు లేని వారు, పేదవాళ్లు, రక్షింపబడని వారు అని ఎవరైనాప్పటికీ వారిని తమకంటే ఉన్నతమైన వారిగా తలంచి సంపూర్ణ ఘనతను ఇచ్చి వాళ్లతో ప్రేమ గల వారిగా నడుచుకుంటారు.
3) అందరికీ సేవ చేసే మనస్తత్వం ప్రభువైన యేసు తన శిష్యుల యొక్క పాదములను కడిగారు. ఇలాంటి ఆలోచన గలవారు తమ గురించి ఎలాంటి గర్వపు ఆలోచన రాకుండా ఎలాంటి ఆటంకం లేకుండా ఇతరులను ఘనపరుచుటకు ముందుంటారు.
దీని చదువుతున్న ప్రియమైన వారలారా! బిందెలో నీళ్లు తక్కువగా ఉంటే శబ్దం చేస్తూ ఉంటుంది. నీళ్లు నిండుగా ఉంటే శబ్దం లేకుండా ఉంటుంది అనే సామెతకు తగ్గట్టుగా ఆత్మీయ జీవితంలో ఎదగని వారు నీళ్లు తక్కువగా ఉన్న బిందువలె చిన్న చిన్న కార్యంలో కూడా బాధపడుతూ ఉంటారు. శబ్దము చేస్తు ములుగుతున్న శబ్దాన్ని ఎప్పుడు వారి వద్ద వినగలం. ఆత్మీయ పరిపక్వత గలవారైతే దేవుని ప్రేమతో నింపబడిన వారిగా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది?
- బ్రదర్. జయకుమార్ గారు
ప్రార్థన అంశం:-
ఆమెన్ విలేజ్ టీవీ శాటిలైట్ టీవీ ఛానల్ గా మార్చబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250