By Village Missionary Movement
Sunday, 10-Mar-2024దిన ధ్యానము(Telugu) 10.03.2024
అంశం: బంగాళదుంప ప్లాస్టిక్ కవర్
"ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి" - ఎఫెసీయులకు 4:32
హలో పిల్లలారా ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు స్కూల్ కి వెళ్తున్నారా? అవును పిల్లలు మీరు ఏ ఏ ఆటలాడుతారు? మీ స్కూల్లో, మీ వీధిలో ఉన్న ఫ్రెండ్స్ తో జాలిగా ఆడుకుంటారు కదూ.
మీలాగే రియాజ్ ,సంధ్య స్కూల్లో చాలా పెద్ద గ్రౌండ్ ఉండేది. అక్కడ అందరి పిల్లలతో జాలీగా సంతోషంగా నవ్వుకుంటూ ఐక్యత కలిగి ఆడుకొని వచ్చారు. రోజులు గడుస్తూ ఉండగా వాళ్ల మధ్యన గొడవలు వచ్చి ఒక్కొక్కరు విడివిడి గ్రూపుగా మారిపోయారు. ఇది అక్కడ ఉన్న టీచర్కి తెలిసింది. టీచర్ దాని విన్న వెంటనే చాలా బాధపడ్డారు వీళ్ళందర్నీ ఐక్యత కలిగి ఆడుకొనుటకు ఏమి చేయాలి అని ఆలోచించడం ప్రారంభించి అందర్నీ రమ్మని చెప్పి రేపు మీరు స్కూలుకు వచ్చినప్పుడు మీరందరూ ఒక సంచిలో బంగాళదుంపలను, ప్లాస్టిక్ కవర్ను తీసుకుని రమ్మని చెప్పారు. పిల్లలందరూ అలానే తీసుకువచ్చారు.
టీచర్ వాళ్ళందరిని చూసి మీరు ఎవరితో అయినా గొడవ పడి ఎవరినైనా క్షమించుటకు ఇష్టం లేకుండా ఉన్నారో వాళ్ళ పేర్లను ఈ బంగాళదుంప పైన రాసి ఆ ప్లాస్టిక్ కవర్ లో వేయమన్నారు. స్టూడెంట్స్ అందరూ ఆలోచించి సమయం తీసుకుని రాసుకున్నారు. ఆ గోనెలో వున్న బంగాళదుంపలు తగ్గిపోయి ప్లాస్టిక్ కవర్లో బంగాళదుంపలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఎవరిని క్షమించలేకపోయారో ఆ బంగాళదుంప సంచి తీసి బయట పెట్టండి. రోజు మీరు స్కూలుకు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఈ బంగాళదుంప ఉన్న కవర్ను మీరు తీసుకొచ్చి మరలా తీసుకుని వెళ్లాలి అని చెప్పారు. ఆ పిల్లలందరూ అలానే తీసుకుని వచ్చి తీసుకు వెళుతూ ఉండేవారు. కొన్ని దినముల తర్వాత బంగాళాదుంపలు కుళ్ళిపోయి వాసన రావడం మొదలెట్టింది. మిగిలిన పిల్లలు వాళ్ళ పక్కన కూర్చోవడానికి ఇష్టపడలేదు. వాళ్లతో పాటు కలిసి ఉండటకు ఇష్టపడలేదు. వాళ్ళని చూసి పారిపోతు ఉండేవారు. దానిని గమనించిన పిల్లలు కుళ్ళిపోయిన బంగాళదుంపలను విసిరేసి అందర్నీ క్షమించి జాలిగా మునుపు వలె ఐక్యత కలిగి అందరితో ఆడుకోవడం మొదలుపెట్టారు.
ప్రియమైన తమ్ముడు, చెల్లెల్లారా మనము ఇతరులను క్షమించలేదు అంటే వాళ్ళ పైన మనకు ఇంకా శత్రుత్వము, బాగా కోపము మన లోపల ఉంటే మన లోపల పాపం పెరిగిపోతూ ఉంటుంది. మన జీవితము కుళ్ళిపోయిన జీవితముగా మారిపోతుంది. కాబట్టి యేసయ్య ఎలాగు సిలువలో వేలాడినప్పుడు తనను సిలువకు కొట్టిన వారిని, అవమానపరిచిన వారిని, హేళన చేసిన వారిని క్షమించారో అలానే మీరును మారాలని యేసయ్య మీ కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి యేసయ్య ఎదురుచూపులు నెరవేర్చి అతనిని సంతోషపరిచి జీవితం జీవిస్తారా?
- శ్రీమతి. సారాల్ సుభాష్ గారు
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250