By Village Missionary Movement
Saturday, 09-Mar-2024దిన ధ్యానము(Telugu) 09.03.2024
అంశం: ఇచ్చెదము
“అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును” - మత్తయి 25:40
మోటార్ కార్లు యొక్క తండ్రి అని పిలవబడుతున్న హెన్ డ్రి ఫోర్డ్ అనే వ్యక్తితో ఒక అనాధాశ్రమం కట్టుటకు సహాయము కోరబడినది. ఆయన 200 డాలర్లు గల చెక్కుని ఇచ్చారు. మరుసటి రోజు న్యూస్ పేపర్లో అనాధాశ్రమం కట్టుటకు హెన్ డ్రి ఫోర్డ్ 20వేల డాలర్లు సహాయము చేశారు అని తప్పిదముగా సంఖ్య న్యూస్ పేపర్ లో వచ్చింది. దీన్ని గ్రహించిన అనాధాశ్రమం కట్టే వ్యక్తి హెన్ డ్రి ఫోర్డ్ దగ్గరకు వెళ్లి పశ్చాత్తాప పడ్డాడు. వెంటనే హెన్ డ్రి ఫోర్డ్ మీరు బాధపడొద్దు అని చెప్పి మరలా 18 వేల డాలర్లు గల చెక్కుని ఆయన ఇచ్చారు. ప్రభువు ఆయనను విస్తారంగా దీవించారు.
సువార్తలో కూడా యోహాను సువార్తలో యేసుక్రీస్తు చేసిన అద్భుతం ఒకటి రాయబడి ఉన్నది. దాంట్లో యేసుప్రభు యొక్క బోధను వినుటకు వచ్చిన ప్రజలు ఆకలితో ఉండుట గ్రహించిన యేసు వాళ్లకు ఆకలి తీర్చుటకు ఆహారం ఇవ్వాలని కోరారు. యేసు చేసిన అద్భుతమునకు గల ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నది ఆ చిన్న బాలుడే. ఈ చిన్న బాలుడు ముందుకు వచ్చి ఇచ్చిన ఐదు రొట్టెలు, రెండు చేపలే ఐదువేల మందికి పైగా ఆకలి తీర్చడానికి కారణమైంది. ఈ చిన్న బాబు తన వద్ద ఉన్న సమస్తాన్ని ఇచ్చాడు. తన ఆకలికి ఏమి చేస్తాను అని ఎంత మాత్రమూ ఆలోచించకుండా ఇచ్చాడు. దీని యొక్క ఫలితమే ఈ దినము వరకు ఆ చిన్న బాలుడు అని బైబిల్ మాట్లాడుతూ వస్తుంది.
ప్రియమైన వారలారా పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మనము ఇచ్చుట గొప్పతనం కొరకు కాదు గాని కుడి చేతి చేత ఇవ్వబడినది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. మనము ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమి తీసుకుని రాలేదు కాబట్టి మనము జీవించే కాలంలో ప్రభువు మనకు ఇచ్చిన వాటిలో అవసరమైన వాళ్లకు పంచిపెట్టి సంతోషిస్తాం. దేవుడు అలాంటి వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి లేమిలో ఉన్నవారికి ఇవ్వగలిగినది ఇస్తాం. మన యొద్ద విస్తారమైన ఆశీర్వాదము ఉండినప్పుడు ఇవ్వడం మాత్రమే కాదు లేమీలోనూ కొదువులోనూ ఇచ్చుట నేర్చుకుందాం. ఏమీ కార్మిఖేల్ అనే తల్లిగారు మన చేతులు గాయపడే వారికి ఇస్తూ ఉండాలి అని చెప్తున్నారు మరియు బిల్లీ గ్రహం అనే దేవుని దాసుడు చెప్పినప్పుడు దేవుడు మనకు రెండు హస్తాలు ఇచ్చి ఉన్నాడు. ఒకటి దేవుని వద్ద నుండి పొందుకొనుటకు మరి ఒకటి దేవుని కొరకు ఇవ్వడానికి. అవును మనము విస్తారంగా ఇచ్చి యేసుక్రీస్తు యొక్క ఉన్నత గుణాతిశయాన్ని వ్యక్త పరుద్దాం.
- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:-
మన ఆమెన్ విలేజ్ టీవీ అవసరతలు తీర్చబడేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250