Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 08.03.2024
Share:

By Village Missionary Movement

Friday, 08-Mar-2024

దిన ధ్యానము(Telugu) 08.03.2024

 

అంశం: దీనత్వము

 

"ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును" - యాకోబు 4:10

 

ఒక మారు సాధు సుందర్ సింగ్ ఇంగ్లాండ్ దేశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సహోదరి మీకేంటండి మీరు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎంతో ఘనత ఎన్నో పొగడ్తలు అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన చెప్పారు యేసుక్రీస్తు ఎక్కి వెళుతున్న గాడిద వలె నన్ను నేను చూసుకుంటున్నాను. ఆ దినము క్రీస్తును మోసిన గాడిద తనంతట తానే ఆలోచించి ప్రజలు నన్నే ఆహ్వానిస్తున్నారు నాకే మహిమ చెల్లిస్తున్నారు అని తలంచిన యెడలా అది ఎంత పెద్ద మూర్ఖత్వమో అలాగే ఇప్పుడు నేను పొందుకుంటున్న ఘనత పొగడ్తలు అన్ని నాకు అని నేను ఆలోచిస్తే నేను కూడా ఒక మూర్ఖుని వలె ఉంటాను. క్రీస్తు నాలో లేనియెడల నేను వట్టి గాడిద వంటి వాడిని అన్నారు. ఎంత గొప్ప దీనత్వం చూడండి. 

 

బైబిల్లో ఇశ్రాయేలీయుడైన నాబోతుకు సమరయ రాజైన ఆహాబు భవనం వద్ద ఒక చిన్న ద్రాక్ష తోట ఉండేది. ఆహాబును దేవుడు దీవించి మంచి ఆస్తులు ఇచ్చి ఉన్నారు కానీ ఆహాబు ధనాశ కలిగినవాడిగా తనకు ఉన్నది చాలు అని తలంచకుండా పక్కనే ఉన్న నాబోతు యొక్క ద్రాక్ష తోటను పొందుకోవడానికి ఆశించాడు. కానీ నాబోతు తన యొక్క ద్రాక్ష తోటను తన పితురులు అనుగ్రహించిన ఆస్తి అని చెప్పి ఇవ్వడానికి తిరస్కరించాడు. ఆహాబు భార్య యజెబెలు ఆహాబు యొక్క కోరిక దక్కిన విధముగా నాబోతు మీద అబద్ధపు సాక్ష్యం మోపి అతనిని రాళ్లతో కొట్టి చంపించారు. ఆ పరిస్థితిలో దేవుడు ప్రవక్త అయిన

ఏలియా ద్వారా ఆహాబును హెచ్చరించాడు. ఆహాబు కార్యములన్ని సరియైన కార్యములు కాదు కానీ దీనత్వముగలవాడిగా నడుచుకొనుట వలన దాన్ని చూచిన దేవుడు ఆహాబుకు రావాల్సిన శిక్షను ఆయన కుమారుని యొక్క దినములలో రప్పించారు. 

 

ప్రియమైన వారలారా తగ్గింపు అనే గుణాతిశయము క్రైస్తవులందరి యొద్ద ఉండవలసినది. సాధారణ విశ్వాసి మొదలుకొని సేవకునిగా ఉండినప్పటికీ అది ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణాతిశయము. యేసుక్రీస్తు ప్రభువు భూమిలో జీవించిన దినాలలో తన యొక్క శిష్యుల యొక్క పాదాలను కడిగి తన దీనత్వం వ్యక్తపరిచారు. ఎవరి వద్ద మన ఈగోను చూపించకుండా దీనత్వం గలవారమై ఉంటాం. వాళ్ళు మనకంటే చిన్న వయసు కావచ్చు, పెద్దవాళ్లు కావచ్చు దేవుని యొక్క ఎనలేని కృపను పొందుకోవాలి అంటే ఈ దినమే మనము అందరి ముందు తగ్గించుకుందాం. కృపను పొందుకుందాం. తగ్గించుకొనుటకు ఆలస్యం చేయవద్దు. 

- శ్రీమతి. శక్తి శంకర్ రాజ్ గారు 

 

ప్రార్థన అంశం:-

హాస్పిటల్ పరిచర్యలో అవసరమైన మందులు మరియు పరికరాలు, వస్తువులు కొనుటకు సహాయం చేసే వ్యక్తులు లేపబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al