Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.03.2024
Share:

By Village Missionary Movement

Monday, 04-Mar-2024

దిన ధ్యానము(Telugu) 04.03.2024

 

అంశం: ఇదే రక్షణ దినము 

 

"నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను" - లూకా 19:10

 

టీవీలో బ్రేకింగ్ న్యూస్. మైన్స్ లో చిక్కుకున్న 41 మందిని రక్షించుటకు జరిగిన ఆపరేషన్ యొక్క 16వ దినం. ఎడతెగకగా చేసిన ప్రయత్నంలో 15వ రోజు వచ్చిన వార్త ఇది. ఈ దినం సాయంకాలం లోగా అందర్నీ కూడా రక్షించి బయటికి తీసుకు వస్తాము అన్నదే ఈ సందేశము. టీవీలో చూసి, పత్రికలో చదివిన ప్రతి ఒక్కరికి ఆ మైన్స్ లో చిక్కుకున్న 41 మందిని తన ఇంటి బంధువులుగా తలంచి ఎదురుచూస్తూ ఉన్నారు. 

 

41 అంబులెన్సులు, వైద్యులు యొక్క బృందం, చాలా నైపుణ్యత కలిగిన పనివారు, ఎడతెగక పనిచేసే క్రైన్ డ్రైవర్లు ఇలా అనేకమంది చిక్కుకున్న వారిని రక్షించుటకు సిద్ధంగా ఉన్నారు. చిక్కుకున్న వారి యొక్క బంధువులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అనే ప్రజా గుంపుతో ఆ స్థలం నిండిపోయింది. చాలా గందరగోళం ఉన్న పరిస్థితుల్లో అందరు మనసులో ఇంకను 41 మంది రక్షింపబడాలి అన్నదే వారి ఆలోచన. ఆ పరిస్థితుల్లో అందరి ముఖంలో ఒకే ఆలోచన, ఒకే తలంపు, దేవుణ్ణి వేడుకొనుట. అందరి మనసు లో ఉండిన ఆలోచన అదే. 

 

చీకటిగా ఉన్న ఆ మైన్స్ నుండి బయటికి రావడం ఆ 41 మంది కొరకు చేసిన ఆపరేషన్ విజయవంతంగా జరుగుతున్న కార్యాన్ని టీవీలో చూడగలిగాం. ఇదే విజ్ఞాపన దేశంలో గల అనేకులు ఆలాపనగా ఉండేది. అవును వారు ఏక మనసు కలిగి ఉండుటవలన అది సాధ్యము అయింది. చాలా సంతోషమైనా ఆనందముతో 41 మంది కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ చీకటి మైన్స్ నుండి బయటకు వచ్చారు. తరువాత తమ బంధువులు వారి కొరకు ప్రయాసపడిన అందరూ కూడా సంతోషింపజేసే విధముగా సంతోషకరముగా ఆ పరిస్థితి జరిగిన పరిస్థితిని మాటలతో వివరించలేం. 

 

ప్రియమైన వారలారా ఈ దేశమంతా ఎరిగిన ఈ సంఘటన రక్షించిన ఆ పని మహోన్నత్వమును అందరూ చక్కగా గ్రహించారు. బైబిల్లో మారుమనస్సు పొందుతున్న ఒక పాపి నిమిత్తము పరలోకములో మిక్కిలి సంతోషము కలుగుతుంది అని లూకా సువార్త 15లో చదువుతున్నాం. యేసుక్రీస్తు రక్తము సకల పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును (1 యోహాను 1:7). ఈ సందేశాన్ని మీరు గ్రహించి ఉన్నారా? మీరు రక్షింపబడి ఈ రక్షణలోనికి వచ్చి ఉన్నారా? అవును మీరు దీనికి జవాబు మీ యొక్క రక్షణ నిమిత్తమై పరలోకంలో సంతోషం కలుగుతుంది అన్నది నిశ్చయము. ఒకవేళ దీని జవాబు లేదు అని చెప్పిన యెడల ఈ దినమే ఒక నిర్ణయం తీసుకోనండి. యేసుక్రీస్తు రక్తము మాత్రమే మన పాపములు నుండి మనలను రక్షించగలదు. ఆయనను నమ్మిన యెడల మీరు ఆయన పిల్లలగా మారుతారు. మీ రక్షణను పరలోకము కొనియాడుతుంది. ఆలస్యం చేయవద్దు. ఇదే అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. 

- శ్రీమతి. ఏమిమా సుందర్ రాజు గారు 

 

ప్రార్థన అంశం:-

ప్రతి నెలలో ప్రతి రాష్ట్రంలో 120 మంది మిషనరీలు కొత్తగా మనకు దొరికేటట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet