Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 01.03.2024
Share:

By Village Missionary Movement

Friday, 01-Mar-2024

దిన ధ్యానము(Telugu) 01.03.2024

 

అంశం: సుబ్బుడు యొక్క వేడుకలు

 

"అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను" - అపో.కార్యములు 1:8

 

సుబ్బుడు యొక్క వేడుకలు అని హాస్య కథలు నా చిన్నతనంలో చదువుకునేవాడిని. ఈ సుబ్బుడు ఏమి చేసినా తల క్రిందులుగా, పొరపాటుగా చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆ గ్రామంలో గల ఒక స్నేహితుడు సుబ్బుడు వద్దకు వచ్చి ఎద్దులు మీ ఇంట్లో ఉన్నాయా అని అడిగాడు. అందుకు సుబ్బుడు లేవు అన్నాడు. వెంటనే ఆ స్నేహితుడు ఎద్దులు ఎంత ప్రాముఖ్యమైనవో తెలుసా? మన గ్రామాలలో ఎద్దులు లేని ఇల్లు లేవు అన్నాడు. దానిని విన్న సుబ్బుడు వెంటనే ఒక ఎద్దును కొన్నాడు. చాలా దినములు తర్వాత ఆ స్నేహితుడు సుబ్బుడు ఇంటికి వచ్చి ఆ ఎద్దు కట్టియుండును చూసి ఈ ఎద్దును ఎలా వాడుకుంటున్నావు అని అడిగాడు. అందుకు ఆ సుబ్బుడు ఇది ఖరీదు అయిన ఎద్దు కాబట్టి బయట ఎండలో తిరగనివ్వకుండా ఇంట్లో కట్టి చాలా జాగ్రత్తగా పరామర్శిస్తున్నాను అన్నాడు. స్నేహితుడు దాన్ని విని తల పట్టుకుని ఎద్దును పొలము దున్నుటకు, బండి లాగుటకు దాన్ని వాడాలి అని చెప్పాడు. 

 

పైన చెప్పబడిన సుబ్బుడు కథకు ఈ దినపు సంఘమునకు సంఘములో భాషలు అనే వరము పొందుకున్న కార్యానికి ఒక పోలిక ఉన్నది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా కుమ్మరింపబడిన వెంటనే శిష్యులందరూ భాషల్లో మాట్లాడారు అని చదువుతున్నాం. దాని తరువాత వెంటనే వారు సువార్తను ప్రకటించడం ప్రారంభించారని చూస్తున్నాం. పేతురు 11 మందితో లేచి నిలబడి చుట్టూ ఉన్న వాళ్ళకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు అని ఆ లేఖన భాగంలో చదువుతున్నాం. కానీ ఈ దినాలలో అనేక సంఘాలు భాషల్లో మాట్లాడడానికి ప్రోత్సహిస్తున్నాయి అవి మంచివే కానీ అదే ప్రాముఖ్యత సువార్త చెప్పుటకు చూపించడం లేదు. ఎలా సుబ్బుడు పొలములో ఎద్దును వాడకుండా కట్టి ఉంచాడో అలానే ఈ దినము సంఘాలలో భాషలు మాట్లాడుతున్నాం కానీ దాన్ని పొందుకున్న ఉద్దేశాన్ని మర్చిపోతున్నాం. 

 

మొదటి కోరింది 14:4 లో భాషలు మాట్లాడుట భక్తి యొక్క వృద్ధి కలుగుటకే అని చదువుతున్నాం. అవును మనము దేవునిలో బలపడటానికి ఆత్మలో వేడిని కలవారిగా ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరము వంటిదే భాషలు. ఈ అనుభవము ఒక వేళ మీకు లేనియెడల ప్రార్థించి ఆశించి పొందుకొనుడి. అదే సమయంలో మనకు భక్తి యొక్క వృద్ధి కలగడం మాత్రమే కాదు ఆ భక్తిని లోకమంతా సువార్త ప్రకటించాలి అన్నది ప్రభువు యొక్క ఆజ్ఞ వైపు మనలను నడిపిస్తుంది. భాషలతో మాట్లాడదాం అదే సమయంలో నరకం వైపు వెళుతున్న ప్రజలకు సువార్తను ప్రకటించడానికి బయలుదేరుదాం. 

- బ్రదర్.జె.సంతోష్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఈ నెల అంతా జరగబోతున్న పరిచర్యలో దేవుని హస్తం తోడుండేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş casibom jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet