By Village Missionary Movement
Wednesday, 28-Feb-2024దిన ధ్యానము(Telugu) 28.02.2024
అంశం:- బహుమానం
"దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" - యోహాను 3:16
బహుమానము ప్రేమ యొక్క ప్రత్యక్షత. సాధారణంగా ఒకరు ఇతరులకు ఇచ్చే బహుమానమే గిఫ్ట్ అని పిలుస్తాము. ఈ బహుమానము ఎదురు చూడని పరిస్థితిలో దొరుకుతున్న ఒక కార్యము. స్నేహితుల వద్ద పంచిపెట్టబడుతున్న బహుమానము, కుటుంబ బంధువుల మధ్యలో ఇవ్వబడుతున్న బహుమానము అని అనేక విధములైన బహుమానములు కలవు, మరియు పుట్టినరోజు, వివాహపు దినము అని వీటికి ఇవ్వబడుతున్న బహుమానము విశేషమైనది. ఈ బహుమానాలు అన్నింటికీ ప్రేమ ఉంటేనే ఇవ్వగలరు ప్రేమ లేకుండా ఏది కూడా ఇవ్వలేరు. ఉదాహరణగా మనం చెప్పిన యెడల మదర్ థెరిస్సా, గ్రహాం స్టెయిన్స్ వీరందరూ దేవుని మీద గల ప్రేమ వల్లే రోగముగా ఉన్న ప్రజలను ఉచితముగా తమ సేవలను అందించారు.
బైబిల్లో ఐశ్వర్యవంతుడైన ఒక మనుష్యుడు గురించి లాజరు అనే పేరు కలిగిన దరిద్రుడు గురించి రాయబడి ఉంది. వీరిద్దరిని ప్రభువు సృష్టించారు కానీ ఈ లాజరు ఐశ్వర్యవంతుడి ఇంటి తలుపు వద్ద పడి ఆయన భోజనపు బల్లపై నుండి పడినటువంటి రొట్టె మొక్కలు తింటూ ఆయన ఆకలని తీర్చుకునేవాడు. ఇద్దరు కూడా మరణించారు. దరిద్రుడు మరణించి అబ్రహము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఐశ్వర్యవంతుడు మరణించి పాతాళమునకు తీసుకొనిపోబడ్డాడు। ఐశ్వర్యవంతుడు భూమిపైన ఉన్నప్పుడు చాలా చక్కగా జీవించి తర్వాత పాతాళమునకు వెళ్ళుట అన్నది చాలా దుఃఖ కరమైన పరిస్థితి కదూ! ఐశ్వర్యవంతుడిగా జీవించి ప్రేమ లేని వాడిగా మరణించి తన పరుగును ముగించాడు.
ప్రియమైన వారలారా! ధనము, అధికారము, పేరు మాత్రమే దీవెనలు అని అనుకుంటున్నాం. వాటిని బట్టి ఆయన నా మీద ప్రేమ కలిగి ఉన్నారు అని తలస్తున్నాం. ఆయన యొక్క ప్రేమ లోకానుసారమైన వస్తువుల ప్రకారమున దీవెన మాత్రమే కాదు కొదువుల్లోనూ అన్ని పరిస్థితుల్లో కూడా మనము రుచి చూడగలము. ప్రేమ లేకుండా ఇవ్వలేరు, ఇవ్వకుండా ప్రేమను వ్యక్తపరచలేము అని అన్నారు మదర్ థెరిస్సా. తండ్రి మనకు ప్రేమను బహుమానముగా యేసయ్యను ఈ భూమికి పంపించారు. మనము ఆయన ప్రేమతో నిండిన వారిగా యేసయ్య బహుమానమును ఇతరులకు ప్రకటిద్దాం. మన యొద్ద ఉన్నదాన్ని అవసరతలో ఉన్న వారికి ఇచ్చి ఇతరులను కూడా సంతోష పరుద్దాం.
- సిస్టర్. సెల్వి గారు
ప్రార్థన అంశం:
ఉత్తర భారత దేశంలో గల మిషనరీలు యొక్క ఆరోగ్యము కొరకు పరిచర్య కొరకు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250