By Village Missionary Movement
Saturday, 24-Feb-2024దిన ధ్యానము(Telugu) 24.02.2024
అంశం:- చిన్న బలముగల బలాద్యుడు
"అంతట యెహోవా అతనితట్టు తిరిగిబలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా" - న్యాయాధిపతులు 6:14
ముగ్గురు యవ్వనస్తులు తమ భుజము మీద పెట్టబడిన శిలువను మోస్తూ నడుస్తూ వెళ్తున్నారు. ఒకడు తన సిలువ చాలా భారముగా ఉన్నదని దాని యొక్క పొడవును తగ్గించాడు రెండో వాడు కూడా అలానే చేశాడు. కొంచెం దూరము వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అగాధం వారికి ఎదురైంది. ఆ అగాధమును దాటలేక ఏమి చేయాలి అని ఆలోచిస్తూ నిలబడి ఉన్నారు ఆ మొదటి ఇద్దరు వ్యక్తులు. మూడో వ్యక్తి వచ్చాడు తన భుజం పైన గల శిలువను అగాధము పైన పెట్టాడు అది ఒక వంతెన వలె మారింది సులువుగా దాని పైనుండి దాటి అవతలికి వెళ్ళగలిగాడు। ఇద్దరు ఆలోచించారు దేవుడు మాకు ఇచ్చిన సిలువను మోయుటకు వెనకంజ వేసాము అని గ్రహించి మూడో వ్యక్తి చేసిన ఆ కార్యాన్ని చూసి బాధపడ్డారు.
బైబిల్ లో 1 సమూయేలు 6వ అధ్యాయము 7,8 వచనాలు చదువుతున్నాం. దేవుని యొక్క మందసాన్ని మోయుటకు అలవాటు లేని ఆవు తమ పిల్లలను విడిచిపెట్టి ఆ మందసమును మోయుటకు యెహోషువ పొలం వైపు కుడి ఎడమకు తిరగకుండా తిన్నగా వెళ్లింది. తర్వాత తనను తానే బలిగా సమర్పించుకున్నది। తమ దూడ యొక్క పరిస్థితిని ఆలోచించి వెనుకకు చూడలేదు. ఆ మందసము మోయుట అంటే సులువు కాదు అది మనకు అలవాటు లేదు అని ఆగిపోలేదు. సాధారణ ఒక పశువు దేవుని యొక్క మందసాన్ని మోసిన యెడల అభిషేకాన్ని బలాన్ని పొందుకున్న మనము ఎందుకు సిలువ యొక్క గొప్పతనాన్ని యేసుని ప్రేమను ఇతరులకు చెప్పకూడదు.
దీనిని చదువుతున్న ప్రియ సహోదరీ సహోదరులారా! నీకు ఉన్న బలము చాలు దేవుడు నీకు నియమించిన కార్యాలు నీ దృష్టికి బరువైనవిగా అనిపించవచ్చు కానీ దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానముతో దాని సులువుగా చేయవచ్చు. దేవుడు నియమించినది మనకు దీవెనకరము. ఆ కాడికి కట్టబడిన ఆవు తన మీద పెట్టబడిన దేవుని యొక్క మందసాన్ని ఆఖరి వరకు మోసుకుని వెళ్లి తన పనిని ముగించిన యెడల మన యొక్క చింత మరీ ఆలోచన ఏవిధంగా ఉండాలి ఆలోచిద్దాం. దేవుడు మీ మీద పెట్టిన సిలువను సనుగు కొనకుండా మోసి దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుద్దాం.
- శ్రీమతి. భువిత ఎబినేజర్ గారు
ప్రార్థన అంశం:-
మన క్యాంపస్ లో జరుగుతున్న స్వస్థత ఆరాధనలో మరియు ఆన్లైన్ ద్వారా, ఆమెన్ విలేజ్ టీవీ ద్వారా వీక్షిస్తున్న అనేకమంది స్వస్థత పొందుకునేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250