By Village Missionary Movement
Friday, 23-Feb-2024దిన ధ్యానము(Telugu) 23.02.2024
అంశం:- కాపాడుతున్నది ఎవరు?
"ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశపెట్టు కొనునో వాడు ధన్యుడు" - కీర్తనలు 146:5
2024 సంవత్సరము రెండవ నెలలో మనము అడుగుపెట్టి ఉన్నాం. ఈ వాక్యం మనకు నమ్మకాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. దేవుడైన యెహోవా దగ్గర మనం నమ్మకం ఉంచిన యెడల ఆయన మడలను సరైన మార్గంలో నడిపిస్తారు. చెడు కార్యం నుండి మనల్ని కాపాడుతారు, మరణకరమైన రోగముల నుండి మనలను తప్పిస్తారు. మన పక్కన వెయ్యి మంది పడినను, పదివేల మంది కూలీనను అది మనలను ఏమీ చేయదు. ఏ కీడును మనకు రాకుండా దేవుడు మన గుడారమున కాపాడుతారు. అవును దేవుడే మనకు మంచి కాపరిగా ఉంటున్నారు.
ఒక అడవిలో ఒక కుక్క ఉన్నది. ఎవరో ఒకరు నన్ను కాపాడుతారులే అని నమ్మింది. ఇంతలో ఒక నక్క వచ్చింది. కుక్క అనుకున్నది నక్క నన్ను కాపాడుతుంది అని అనుకుంది కానీ అక్కడికి ఒక పులి వచ్చింది ఆ పులిని చూసిన నక్క పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ కుక్క అనుకుంది అయ్యో నేను నక్క నన్ను కాపాడుతుంది అనుకున్నాను కానీ నక్క పారిపోయింది సరేలే పులి నన్ను కాపాడుతుంది అని అనుకుంది. అప్పుడు ఆ కుక్క ఆ పులి యోద్దకు వెళ్లి నన్ను కాపాడుతావా అని అడిగింది. తాను అడిగిన వెంటనే అదే సమయంలో ఒక వేటగాడు ఒక తుపాకీ ని చేతిలో పట్టుకుని చాలా వేగంగా అక్కడికి వచ్చాడు. అప్పుడు అ పులి ఆ వేటగాడి నుండి తప్పించుకొనుటకు అక్కడ నుండి పారిపోయింది. అప్పుడు ఆ కుక్క అనుకుంది ఇక్కడ ఉన్న ఏ జంతువుని నమ్మిన నాకు ప్రయోజనం లేదు ఈ వేటగాడిని నమ్ముతాను అనుకుని ఆ వేటగాని వెనక వెళ్ళింది ఆ కుక్క.
ఈ లోకంలో మనుషులు యొక్క ప్రేమ, డబ్బు, అంతస్తులు, డబ్బులు, చదువులు, ఇవన్నీ ఉన్నను మన యొక్క చూపులో మనకు ఇవి చాలా ప్రయోజనమైనవే కానీ దీనివలన మనకు వస్తున్న ఫలము మనకు నమ్మకమును నిరంతరముగా ఇవ్వలేదు. ఒక్కొక్క పరిస్థితుల్లో ఇవన్నీ మారిపోతాయి ఇవి మనలను కాపాడుటకు నడిపించుటకు అవ్వకుండా వెనకకు వెళ్ళిపోతుంటాయి. ఎలాంటి పరిస్థితిలోనైన మనలను కాపాడుతున్న దేవుడు యెహోవా దేవుడు మాత్రమే.
ఈ దేవుడే సదాకాలము మన దేవుడిగా ఉన్నారు. మరణకరమైన స్థితిలో ఉన్న కూడా మనలను నడిపిస్తున్నటువంటి దేవుడు యెహోవా దేవుడు మాత్రమే. అవును మన యొక్క నమ్మకము విశ్వాసము మన చుట్టూ ఉన్న ప్రజల మీద కాక దేవుని మీద ఉంచుదాం. మన కనులు ఎప్పుడును దేవుని వైపు ఎదురు చూడాలి. అతను ఈ నెల మాత్రమే కాదు మన జీవితం అంతము వరకు కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నారు.
- శ్రీమతి. బెర్లిన్ సెల్వ భాయ్ గారు
ప్రార్థన అంశం:
మన ట్యూషన్ సెంటర్లో చదువుతున్న పిల్లలను వారి కుటుంబాలను దేవుడు దీవించులాగున ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250