Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 22.02.2024
Share:

By Village Missionary Movement

Thursday, 22-Feb-2024

దిన ధ్యానము(Telugu) 22.02.2024

 

అంశం:- ధైర్యముగా పనిచేద్దాం

 

"దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి" - ఎఫెసీయులకు 6:20

 

1973లో యుగాండాలో యిదిఅమీన్ అనే ఒక నాయకుడు పరిపాలిస్తూ ఉన్నాడు. వాడు క్రైస్తవులను కాల్చి చంపుతూ వచ్చాడు. అప్పుడు జోసెఫ్ సింబల్స్కి అనే బోధకుడు ప్రసంగాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు పోలీసులు వచ్చి తుపాకిని చూపించి అతనిని తీసుకుని వెళ్లారు. మేము నిన్ను చంపబోతున్నాం నీ యొక్క చివరి కోరిక ఏమిటో చెప్పమన్నారు. అందుకు ఆ బోధకుడు వణుకుతున్న స్వరముతో మీ కొరకు నేను ప్రార్థన చేయాలి మీరు చేయబోతున్న కార్యములో దేవుడు మీకు కృప చూపించాలని మిమ్మల్ని క్షమించాలి అని ప్రార్థన చేస్తాను అన్నాడు. అందుకు ఆ నాయకుడు అక్కడున్న ప్రజలను చూస్తూ ఉన్నాడు. ఆ ప్రజలలో అనేక మంది స్త్రీలు ఆ నాయకుడి వలన తమ భర్తలను కోల్పోయిన వారిగా అనేకమంది నిలబడి ఉన్నారు. వారిని చూసి బోధకుని యొద్ద వీరు సంతోషంగా ఉండుటకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బోధకుడు మాకు మరణం ముగింపు కాదు మరణము నిత్య జీవానికి ప్రారంభము అని చెప్పాడు. బోధకుడు ప్రార్థన చేసిన వెంటనే ఆ నాయకుడు దేవున్ని తెలుసుకున్నాడు. 

 

సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను ఇంటికి బానిసగా తీసుకుని వెళ్ళబడిన ఆ ఇశ్రాయేలు చిన్నది తాను ఒక బానిసను అని చూడకుండా నయమాను యొక్క కుష్టు రోగము నుండి బాగుపడవలసిన మార్గాన్ని చూపించింది. దానివలన ఆయన స్వస్థత పొందుకున్నాడు. సిరియా దేశము నయమాను ద్వారా దేవుని యొక్క మహిమను చూడగలిగింది. ఆ రోజే నయమాను దేవున్ని అంగీకరించడం జరిగింది. పౌలు కూడా చెరసాలలో, దీవిల్లోనూ, ఇంట్లోనూ, న్యాయస్థానం ఎదుట, రాజుల ముందర ధైర్యంగా మాట్లాడాడు. అందువలన అనేక మంది సంఘముగా కట్టబడ్డారు. తన ప్రాణాన్ని ఏసుప్రభు కొరకు అర్పించాడు. మనలను కూడా పూర్తిగా దేవునికి అర్పించినప్పుడు దేవుడు ధైర్యం ఇస్తారు. ధైర్యంగా విత్తుదాం చాలా సంతోషమైన పంటను కొద్దాం. కానీ ఈరోజు క్రీస్తు కొరకు ధైర్యంగా ఉండవలసిన వారు తగ్గిపోయారు. 

 

ఎవరికైనా మనం దేవుని కొరకు గట్టిగా చెబితే మన ప్రాణం పోతుంది అని భయపడుతూ ఉంటాం. మనం ఆలోచించకుండా దేవుని గురించి చెప్పినప్పుడు, పనిచేసినప్పుడు దేవుడు మనలో నుండి కార్యాలు చేస్తాడు. శరీరాన్ని మాత్రం చంపుతున్న వారికి మీరు భయపడవద్దు ఆత్మను నరకములో వేసేవారికి భయపడండి అని దేవుడు చెబుతున్నారు. ధైర్యం లేని వారు పదును లేని కత్తి వలే ఉన్నారు. కాబట్టి దాని ద్వారా ఏమి చేయలేము, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ధైర్యముగా ఉన్నవారి ద్వారానే దేవుడు తన యొక్క ప్రణాళికను నెరవేరుస్తూ వస్తున్నారు. 

- బ్రదర్. గుణశీలన్ గారు 

 

ప్రార్థన అంశం:-

మనం ఇస్తున్న కరపత్రికల ద్వారా మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు దేవున్ని ఎరిగేటట్లు ప్రార్థించండి

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al