Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 21.02.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 21-Feb-2024

దిన ధ్యానము(Telugu) 21.02.2024

 

అంశం:- మీరు పిల్లలను ఎలా పెంచుతున్నారు

 

"బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు" - సామెతలు 22:6 

 

నాకు తెలిసిన ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి తెగింపుగా చిన్న చిన్న తప్పులు చేస్తూ వచ్చాడు. వారి తల్లిదండ్రులు వాడిని శిక్షించకుండ వదిలేసే వారు. అతడు చేసిన తప్పులు గురించి ఎవరైనా వాళ్ళకి చెప్పడానికి వస్తే నా కొడుకు అలాంటివి ఏమీ చేసి ఉండడు అని చెప్పి తన కొడుకు చేసిన తప్పులను కప్పి వేస్తూ ఉండేవారు. ఒక దినం ఏమి జరిగిందంటే వాడు పెరిగిన తర్వాత తెగింపుగా చాలా తప్పులు చేయడానికి కారణమైంది. అతను తన సొంత ఇంట్లో ఉన్న రోజుల కంటే చెరసాలలో ఉన్న రోజులే ఎక్కువగా ఉన్నాయి. అది ఇప్పటికీ జరుగుతూ వస్తుంది. దీనివలన భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, చుట్టాలు, స్నేహితులు అందరూ చాలా ఇబ్బందులకు కష్టాలకు గురి అవుతున్నారు. 

 

పరిశుద్ధ గ్రంథంలో ప్రధాన యాజకుడైన ఏలి యొక్క పిల్లలు ఒఫీని, ఫినేహాసు ఇద్దరూ దేవుని దృష్టిలో పాపము చేసిన వారుగా ఉన్నారు. (1సమయాలు 2:12) ఏది తప్పు ఏది ఒప్పు, ఈ పాపం చేస్తే ఎలాంటి శిక్ష మనకు వస్తుంది వ్యాధులు, శాపాలు, వస్తాయని ఇతరులకు బోధించిన ఏలికి తన కుమారులను సరైన మార్గంలో పెంచ లేకపోయాడు. తర్వాత ప్రధాన యాజకుడిగా రావలసిన పిల్లలు ప్రత్యక్ష గుడార ద్వారం వద్ద దేవునికి ఇష్టం లేని కార్యాలను చేశారు. అందువలన దేవుని యొక్క ఉగ్రత, ఆయన కోపానికి గురి అయ్యారు. యవ్వన బిడ్డలు ఇద్దరు ఒకే దినమును చనిపోయారు. అంతేకాక వారి వంశంలో వారి సంతతిలో శాపాలు వచ్చాయి. ఇలాంటి ఇన్ని కష్టాలకు గల కారణము ప్రధాని యాజకుడైన ఏలి తన పిల్లలను సరియైన మార్గంలో పెంచకపోవడమే. 

 

ప్రియమైన తల్లిదండ్రులారా! చాలామంది పిల్లలు లేకుండా ఏడుస్తున్నప్పుడు దేవుడు మీకు మంచి బహుమానములను (పిల్లలు) మీకు ఇచ్చారు. వాళ్లను ఈరోజు ఏ విధముగా పెంచుతున్నారు? ఈరోజు చాలామంది పిల్లలు మొబైల్ ఫోన్లోనూ, త్రాగుడు లోను, ప్రేమ అనే మాయ ఆయిన కార్యాలలో, వ్యభిచారంలోనూ దేవునికి ఇష్టము లేని కార్యాలను చేస్తూ ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది తన ఇష్టానికి తన ఇష్టమైన కార్యాలు చేయడానికి వదిలిపెడుతున్న పిల్లలు తన తల్లికి సిగ్గుని తీసుకొస్తారు అని. దీన్ని చదువుతున్న ప్రియులారా మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? ఒకసారి ఆలోచించండి. 

- బ్రదర్. సిమ్యోను గారు 

 

ప్రార్థన అంశం:-

ఆకలితో ఉన్నవారికి భోజనం పెడుతున్న స్కీములో పాలు పొందుతున్న ఒక్కొక్కరు దేవున్ని తెలుసుకొనేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al