By Village Missionary Movement
Tuesday, 20-Feb-2024దిన ధ్యానము(Telugu) 20.02.2024
అంశం:- ఆన్లైన్ ఆఫ్ లైన్
"నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు" - యోహాను 15:4
మనం జీవిస్తున్న ఈ లోకం చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నవారి నుంచి పెద్దవారి దగ్గర మొబైల్ ఫోన్ చాలా ప్రాముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. మనుషులు కోసం కనిపెట్టబడిన ఈ మొబైల్ ఈరోజు మనుషులనే ఆక్రమించుకుంటుంది. మరియు ఇంటర్నెట్ కనెక్షన్ చాలా ప్రాముఖ్యమైనది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే చాలా కార్యాల్లో మనం తెలుసుకోవడానికి అవుతుంది. కానీ అది ఆన్లైన్లో ఉంటేనే లేకపోతే అది ఒక పక్కన పడి ఉంటుంది. దానికి ఏ విలువ ఉండదు.
ఇలానే దేవునితో మనం ఐక్యత కలిగి ఉంటేనే ఎప్పుడూ ఆన్లైన్లోనే ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో దేవునితో ఆన్లైన్లో ఉన్నవారు చాలామందిని చూస్తున్నాం.
1.యోసేపు దేవునితో ఎప్పుడు ఐక్యత కలిగి ఉండడం వలన పాపములో పడిపోకుండా పరుగెత్తుకొని వెళ్లగలిగాడు.
2. యెహోషువ దేవునితో ఆన్లైన్లో ఉండటం వలన ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా మారాడు.
3. ఎలీయ దేవునితో ఆన్లైన్లో ఉండటం వలన ధైర్యంగా సవాళ్లు చేయగలిగాడు.
ఇలానే ఈరోజు చాలామంది దేవుని సేవకులను చూస్తున్నాం. దైవ ప్రసన్నతలో అతనితో ఎప్పుడూ ఐక్యతతో ఉన్నవారిని దేవుడు ఎప్పుడూ వాడుకుంటూనే ఉన్నారు. తీగ చెట్టుతో కలిసి ఉండకపోతే అది ఫలము ఇవ్వలేదు అది అగ్నిలో వేయబడడానికి పార వేయబడుతుంది. అది ఎవరికి ప్రయోజనం లేకుండా పోతుంది. మనము దేవునితో ఐక్యత కలిగి ఉంటేనే చాలా ఫలములను ఇవ్వడానికి అవుతుంది. దేవుడు మనలను వాడుకొనుటకు అవుతుంది. దేవునితో ఐక్యత సరిగా లేకుండా మనము జీవిస్తే మనము దేవునికి ప్రయోజనం లేకుండా అగ్నిగుండంలో వేయబడతాం.
ప్రియమైన వారలారా! ఈరోజు ఆలోచించండి దేవునితో మీ ఐక్యత ఎలా ఉంది మీరు దేవునితో ఆన్లైన్ లో ఉన్నారా లేక ఆఫ్ లైన్ లో ఉన్నారా? మీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించి చూడండి దేవునికి భయపడుతున్న భయం మనకు ఉండాలి. అతడు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉన్నారు అనే తలంపు మనలో ఉండాలి. పాపాలు విడిచి వెళ్ళుటకు దేవుడు సహాయము చేయుటకు దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. ఆఫ్లైన్లో ఉంటే మన కఠినమైన హృదయము మనము ఏమి చేస్తున్నా నేను సరిగానే చేస్తున్నాను అనే ఒక నిర్ణయము మనకు ఉంటుంది. కానీ దేవునితో మనం ఉంటే దేవుడు అన్నింటినీ శోధించి సరి చేయడానికి మనకు సహాయం చేస్తారు. అలాగే చేయండి దేవుడు మిమ్మల్ని వాడుకుంటారు. ప్రయోజనమైన వారిగా జీవించగలుగుతారు.
- బ్రదర్. పౌల్ రాజు గారు
ప్రార్థన అంశం:-
500 మంది నార్త్ ఇండియన్ మిషనరీలు దొరకాలని ప్రార్థించండి
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250