Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 17.02.2024
Share:

By Village Missionary Movement

Saturday, 17-Feb-2024

దిన ధ్యానము(Telugu) 17.02.2024

 

అంశం:- పిలవండి

 

"దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును" - కీర్తనలు 72:12 

 

జారిపడి గొయ్యలో పడిన ఒక అతను ఏడుస్తూ ఉంటే అతనికి ఎవరు సహాయము చేయరు కానీ ఆ గోతిలో నుండి తనను కాపాడుటకు కేకలు వేసి పిలిస్తే ఆ శబ్దం విని ఎవరైనా వచ్చి అతనికి సహాయము చేస్తారు. అప్పుడు ఆ లోతు నుండి బయటికి వస్తారు. ఏడ్చే పిల్లలకు ఆహారము పెడతారు అని ఒక సామెత ఉంది. 

 

అవును ఏసుప్రభువు ఈ భూమిలో ఉన్నప్పుడు బర్తిమయి అని చూపులేని ఒకాయన బిక్షం అడుగుతూ వచ్చాడు. ఆ దారిలో యేసుప్రభు వస్తున్నారని ఎరిగి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు యేసుప్రభు కొరకు అతను కేకలు వేశాడు. వెంటనే యేసు అక్కడ నిలబడి అతనికి చూపునిచ్చారు. ఇలాగే మనకు ఏమీ అవసరమైనను దేవుని వైపు చూచి మనం పిలిచినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు. ఇక్కడ అ చూపులేని బర్తిమయి ఆయన పిలిచినప్పుడు దేవుడు అతనికి జవాబు ఇచ్చాడు. కుష్టు రోగం కలిగిన వ్యక్తులు యేసయ్యను పిలిచినప్పుడు ఆయన వారికి జవాబు ఇచ్చారు. 

 

దేవుడు తనను చూసి పిలుస్తున్న అందరికీని నిజాయితీగా తనను చూసి పిలుస్తున్న అందరికీను పక్కనే ఉన్నారని కీర్తన 145: 18లో చదువుతున్నాం. ఆయన వైపు చూస్తూ పిలిచిన అందరి పైన కృప చూపిస్తున్నారని కీర్తనలు 86: 5 లో చదువుతున్నాం. మనం నిజాయితీగా పూర్ణ హృదయముతో పిలిస్తే దేవుడు జవాబు ఇస్తారు. కాబట్టి దేవుడు ముఖమును చూసేవాడు కాదు పిలుస్తున్న వారి యొక్క హృదయాన్ని చూస్తారు. కాబట్టి మనం ఎలాంటి కష్టంలో, నష్టాలలో, ఇబ్బందుల్లో ఉన్నాను అవి అన్నిటి నుండి మనలను విడిపించడానికి మన దేవుడు శక్తిమంతుడు. 

 

దీనిని చదువుతున్న ప్రియులారా మీరు పడుతున్న మీ కష్టాలలో కన్నీళ్ళలో అతని వైపు చూసి పిలిస్తే ఆయన మిమ్మల్ని విడిపించి కాపాడుతారు. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను ఆయన విడిపించుటకు శక్తివంతుడైనటువంటి దేవుడు. ఆయన పక్షపాతము చూపించే దేవుడు కాదు కానీ మనుషులైతే పక్షపాతము చూపించే మనస్తత్వం కలవారు. దేవుడు హృదయాన్ని చూస్తున్నారు మీరు పిలిస్తే అతను వచ్చి మీ కొరకు పని చేస్తారు. కాబట్టి దేవుని చూచి పిలవండి రక్షణ పొందుకుంటారు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్! 

- బ్రదర్. గ్లాడిస్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఫ్రెండ్షిప్ మిషనరీ ఉజ్జీవములో వాడబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al