Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 16.02.2024
Share:

By Village Missionary Movement

Friday, 16-Feb-2024

దిన ధ్యానము(Telugu) 16.02.2024

 

అంశం:- ప్రయాసకు ఫలితం

 

"నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును" - 1 కోరింథీయులకు 3:8

 

ఒక ఆమెకు చెట్లు పెంచడంలో చాలా ఆసక్తి కలిగి ఉండేది. ఎక్కడ దొరకని ఒక పువ్వుల చెట్టును తీసుకొచ్చి తన ఇంటి తోటలో పెంచింది. ప్రతిరోజు దానికి నీళ్లు వేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది. ఆ చెట్టు వేగంగా ఎదిగింది. ఎదిగి గోడ అవతల వైపునకు వ్యాపించింది. ఆ చెట్టుకు పువ్వులు వస్తాయని ఆమె ఎదురు చూస్తూ ఉంది కానీ పువ్వులు ఏమి కూడా రాలేదు। ఆ చెట్టులో ఏ పూలు కనిపించలేదు కాబట్టి తన ప్రయాసకు ఫలితము కనిపించకుండా పోయిందని చాలా కృంగిపోయింది. ఒకరోజు ఆ తోటలో ఉన్న గోడకు పక్కనే ఉన్న ఆమె ఆ చెట్టు గురించి చాలా పొగిడింది. పువ్వులు లేని ఆ చెట్టును ఎందుకు ఆమె ఇంతగా పొగుడుతుంది అని అనుకొని పువ్వులు లేని ఈ చెట్టు గురించి ఎందుకు గొప్పగా చెబుతున్నావు అని అడిగింది. అందుకు ఆమె నువ్వు గోడ అవతల వైపు వచ్చి చూడు అని ఆ పక్కింటి ఆమె చెప్పింది. ఆ పక్కా వైపు వెళ్లి చూస్తే గోడ అవతల వైపు ఆ చెట్టు నిండా పువ్వులు పూసి ఉన్నాయి. అప్పుడు ఆ చెట్టును పెంచిన ఆమె నా ప్రయాస ఫలితం లేదు అనుకున్నాను కానీ నా ప్రయాస ఫలితము దొరికిందని చాలా సంతోషించింది. 

 

ఇలాగే దేవుని కోసం కోసం ప్రయాసపడి తన ప్రజలను జనాంగమును విడిచిపెట్టి వచ్చింది రూతు. ప్రారంభంలో ఆమె తీసుకొన్న నిర్ణయానికి ఏ ఫలితము కనిపించలేదు కానీ చివరికి ఏసుప్రభు వారి యొక్క వంశంలోనే పుట్టే భాగ్యాన్ని పొందుకున్నారు. బెతానియ అనే గ్రామంలో మరియ చాలా ఏళ్లుగా సమకూర్చిన డబ్బుతో ఖరీదైన పరిమళ తైలమును కొని తీసుకుని వచ్చి యేసయ్య పాదాల పైన పోసింది. మనుషులు దాన్ని చూచి చాలా వ్యర్థం అని అన్నా కానీ ఆ ప్రయాస ఫలితముగా ఇప్పటివరకు ఆమె చేసిన కార్యాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. 

 

అవును ప్రియమైన వారాలరా దేవుని కొరకు మనం ఏమి ప్రయాసపడినా అవి చూపులో ఫలితం లేకుండా ఉండవచ్చు కానీ మీకు తెలియకుండానే దానికి ఫలితము ఇస్తూనే వస్తుంది అని మర్చిపోవద్దు. మీకు తెలియకుండానే మీరు చేస్తున్న కార్యాలకు ఫలితము ఉంటుంది అనేదాన్ని మర్చిపోవద్దు. కాబట్టి కృంగిపోకుండా మీ పనిని తరచూ చేయండి. యేసుప్రభు మీ ప్రయాసకు తగిన ఫలితాలను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమెన్! 

- శ్రీమతి. ఎస్తేరు మనోజ్ కుమార్ 

 

ప్రార్థన అంశం:-

ఉద్యోగం కొరకు రోజుకు 12 నిమిషాలు ప్రార్థన చేసిన వ్యక్తులు దొరకాలని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet