By Village Missionary Movement
Thursday, 15-Feb-2024దిన ధ్యానము(Telugu) 15.02.2024
అంశం:- కృతజ్ఞతలు
"క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి" - కొలస్సీయులకు 3:15
గవర్నమెంట్ జాబు నుండి రిటైర్మెంట్ పొందిన ఒకతను ఆ సంవత్సర చివరి రోజున దేవుని పాదాల యొద్ద కూర్చుని సంవత్సరములో జరిగిన అన్నింటిని ఆలోచించాడు. ఈ సంవత్సరము నా గుండెకు ఆపరేషన్ జరిగింది. బాగా పనిచేస్తున్న నాకు రిటైర్మెంట్ వచ్చింది. డాక్టరు చదువుతున్న నా కొడుకు యాక్సిడెంట్ జరిగినప్పుడు కారు పాడైపోయింది కానీ నా కొడుకుకు చిన్న చిన్న గాయాలు మాత్రమే తగిలాయి. ఈ సంవత్సరము నా పరిస్థితి ఘోరంగా జరిగిందని రాసిపెట్టి తాను పడుకోడానికి వెళ్ళిపోయాడు కొంతసేపు తర్వాత అతని యొక్క భార్య ఆ పేపర్ ని చూసింది. తర్వాత విడిగా ఒక గదిలోనికి వెళ్లి ప్రార్ధన చేయడం ప్రారంభించింది. ప్రభువా చాలా అవసరంతో పరిగెత్తిన నా భర్తకు మంచి ఆరోగ్యము ఇచ్చావు ప్రభువా దానికి నీ వందనాలు. గుండె సర్జరీలో మేజర్ ఆపరేషన్ చేసినప్పుడు నా భర్తకు మరల ఆయుష్ దినాలు పొడిగించావు ప్రభువా నీకు వందనాలు. నా కుమారుడికి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రమాదం నుంచి తప్పించావు ప్రభువా నీకు వందనాలు అని కన్నీటితో ప్రార్థన చేసింది అతని యొక్క భార్య. చూడండి ఇద్దరు యొక్క చూపులు ఎలా ఉన్నాయో కానీ దేవుడు ఎవరి మనసును చూసి సంతోషిస్తారు అవును కృతజ్ఞత కలిగిన హృదయం కదా!
పదిమంది కుష్టు రోగులు దేవుని వద్దకు వచ్చి ప్రభువా మాపైన కనికరము చూపించమని కేకలు వేశారు. యేసు ప్రభువు వారికి మంచి స్వస్థతనిచ్చి యాజకునికి మీదేహం కనపరుచుకోమని చెప్పారు కానీ అందులో ఒక్కరు మాత్రమే వారి స్వస్థత పొందిన దాన్ని గ్రహించి పెద్ద కేకలు వేసి దేవుని ఘనపరిచారు. అప్పుడు ఏసుప్రభు స్వస్థత పొందిన మిగతా 9 మంది ఎక్కడ అని అడిగారు.
ప్రియమైన వారలారా! మన ప్రభువు మన దగ్గర దేనిని చూసి మనల్ని రక్షించలేదు, మనల్ని పిలవలేదు, మనల్ని ప్రేమించలేదు కానీ దేవుడు మన నుండి చూస్తుంది ఒక్కటె కృతజ్ఞత కలిగిన హృదయము కలిగి ఉండడమే. మనకును మన కుటుంబమునకును దేవుడు చేసిన మేలులు ఎన్నో కానీ మనము చాలాసార్లు దేవుడు చేసిన మంచితనాన్ని మరిచి ప్రతిరోజు దేవుడు మనలను ఈ భూమ్మీద ప్రాణముతో ఉంచారు కదా దానిని కోసం మన నిశ్చయముగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నిజమే కదా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారముగా కనబడధాం, దేవుడిచ్చిన దీవెనలను పొందుకుందాం.
- శ్రీమతి. దవమని వైరవెల్ గారు
ప్రార్థన అంశం:
313 మండలాలలో జరుగుతున్న మీటింగ్లో చిల్డ్రన్ క్యాంపు మరియు యవనస్తుల క్యాంపు కొరకు ప్రార్థించండి.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250