Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 14.02.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 14-Feb-2024

దిన ధ్యానము(Telugu) 14.02.2024

 

అంశం:- లోతైన ప్రేమ

 

"మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును" - ఎఫెసీయులకు 3:18

 

కాలేజీలో చక్కగా చదువుతున్న యవ్వనస్తురాలు ఒక అబ్బాయిని ప్రేమించింది. అతడు ఆమె వద్ద ప్రతిరోజు నువ్వు లేనియెడల నిన్ను చచ్చిపోతానని చెప్తూ ఉంటాడు. ఈమె దానికి భయపడి వివాహమునకు ఒప్పుకున్నది. హఠాత్తుగా ఒకరోజు తల్లిదండ్రులకు తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. వారం రోజుల్లోనే అతని యొక్క నిజమైన గుణాతిశయము బయటపడింది. అప్పుడు ఆమెకు అతని యొక్క నిజమైన గుణాతిశయము తెలిసింది. నేను నిన్ను నమ్ముకుని నా సమస్త కార్యములు విడిచిపెట్టి వచ్చానే అని ఏడ్చింది.

 

లోకప్రామ ఇలాంటిదే. పై రూపాన్ని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతున్న లోతులేని ప్రేమ. మనుషులందరి కోరిక ఏమిటంటే నన్ను ఎవరైనా ప్రేమిస్తారా? నాతో మాట్లాడతారా అని ఇందు కొరకే స్త్రీలు తమను అలంకరించుకుంటారు అబ్బాయిలు జిమ్ముకు వెళుతూ ఉంటారు. మనం అందంగా ఉండిన యెడల మన కొరకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వస్తారు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. నీవు లేకపోతే నేను జీవించలేను అని చెప్పే అదే వ్యక్తి ఒకరోజు నిన్ను చూస్తేనే నాకు నచ్చటం లేదు అని చెబుతారు. ఈ ప్రేమ అంతా మాయ ప్రేమ కాని మారని నిజమైన లోతైన ప్రేమ ఏసుక్రీస్తు ప్రేమ మాత్రమే. 

 

ఆ ప్రేమ యొక్క వెడల్పు ఎలాంటి రంగు ఎలాంటి మతము ఎలాంటి భాష మాట్లాడుతున్న మనుషులనైన వెతుకుతూ రక్షిస్తుంది. ఆ ప్రేమ యొక్క పొడవు నువ్వు పుట్టకముందే నీకు పేరు పెట్టి పిలిచిన నిత్య ప్రేమ. ఆ ప్రేమ యొక్క లోతు మనం పాప ఊబిలో ఉండేటప్పుడే మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనలను రక్షించిన ప్రేమ. ఆ ప్రేమ యొక్క ఎత్తు చెత్తలోనూ బూడిదలో ఉండిన మనలను హెచ్చించి మనలను చూస్తూ మురిసిపోతున్న ప్రేమ. 

 

ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవాన్ని కొనియాడుతున్న ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీరు వివాహం అయినవారు అయినప్పటికీ యవనస్థురాలుగా, యవనస్తులుగా ఉండినప్పటికీ మన యొక్క మొదటి ప్రేమ యేసయ్యకు మాత్రమే. ఆ తర్వాత మన జీవిత భాగస్వామ్యం, తల్లిదండ్రులు, స్నేహితులు ఈ లోతైన ఎనలేని యేసయ్య ప్రేమ మీ జీవితంలో నింపబడనివ్వండి 

- డాక్టర్. రంజిత గారు 

 

ప్రార్థన అంశం:-

చైల్డ్ కేర్ చైల్డ్ పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉన్న చిన్న పిల్లలు మరియు వారి యొక్క కుటుంబము దీవించబడేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio jojobet giriş casibom milanobet piabellacasino betpas bahiscasino atlasbet betpas casinoroyal bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom holiganbet jojobet casibom vaycasino romabet