By Village Missionary Movement
Tuesday, 13-Feb-2024దిన ధ్యానము(Telugu) 12.02.2024
అంశం:- పూర్ణ మనసుతో చేయుడి
"మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మన స్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులైయున్నారు" - కొలస్సీయులకు 3:24
ఆ దినము 1984వ సంవత్సరము డిసెంబర్ 2వ తారీకు అర్ధరాత్రి సమయంలో మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో యధావిధిగా ఫ్యాక్టరీ రన్ అవుతూ ఉంది. పనిలో ఉన్న ఒక వ్యక్తి అక్కడ పెట్టబడిన మూడు బాయిలర్లని చూసి వచ్చాడు. అప్పుడు యధావిధికి మారుగా మూడవ బాయిలర్లో అపాయకరమైన మిథైల్, ఐ సో సైనైడ్ (ఎమ్.ఐ.సి) అనే గ్యాస్ ఉండుట చూసాడు. వెంటనే తన పై అధికారికి చెప్పాడు కానీ ఆ పై అధికారి దాన్ని పట్టించుకోలేదు. ఆ పనివాడు తన పని ముగించుకొని బయలుదేరి వెళ్లిపోయాడు. సమయం 12 గంటలు దాటిన తర్వాత డిసెంబర్ 3వ తారీకు ఉదయాన అపాయకరమైన ఆ గాలిని తట్టుకోలేక బోపాల్ మహానగరంలో ఉంటున్న అనేకులు శ్వాస సమస్యకు గురయ్యారు. కళ్ళు తెరిచి మూసేలోగా ఆ గాలి ఆ పట్టణం అంతా విస్తరించి ప్రజల గుంపులు గుంపులుగా మరణించారు. అనేక రకములైన జంతువులు మరణించాయి. ఆ లెక్క ప్రకారం 20,000 మంది మరణించారు సుమారుగా 5 లక్షల 50 వేల మంది శ్వాస తీసుకోవడంలో సమస్యతో ఇబ్బంది పడ్డారు। చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటన బోపాల్ విషపూరితమైన సంఘటన అని చెప్పబడుతుంది. కొన్ని సంవత్సరాలు దాని యొక్క బాధను ఓ అధికారి యొక్క నిర్లక్ష్యము మన భారతదేశానికి ఒక దుఃఖ దినాన్ని తీసుకుని వచ్చింది.
బైబిల్లో అపోస్తులుడైన పౌలు తాను ఏర్పరిచిన సంఘ ప్రజలకు ఈ విధంగా చెబుతున్నాడు ఏది చేసినా దేవుని కొరకు పూర్ణ మనసుతో చేయడి అని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ఆ విధంగా జీవించాడు కాబట్టి ఆయన మనుషులను సంతోష పెట్టుటకు లేక ఎదుటివారి దగ్గర గొప్ప తెచ్చు కొనుట కొరకు ఏదీ చేయలేది కానీ అన్ని దేవుని కొరకే మనస్ఫూర్తిగా చేసి ముగించారు. స్నేహితులారా ఈ దినము మనము ఏమి చేసి ముగించాము అనేదానికంటే ఎలాంటి మనస్తత్వంతో మనం ముగించాము అన్నదే ప్రాముఖ్యం. దేవుడు మనకు ఏది ఇచ్చినా అందులో మనస్ఫూర్తిగా ఉండుడి, మనస్ఫూర్తిగా ప్రార్థించుడి, బైబిల్ ను చదివి ధ్యానించుడి. మీకు దొరికిన సమయంలో చేయగలిగిన పరిచర్యను మనస్ఫూర్తిగా చేయుడి. దేవుడు మనకు నిర్ణయించి ఇచ్చిన ఈ భూలోకంలో అశ్రద్ధతో ఉండిపోకండి. మీ వద్ద గంట సమయం ఉన్నదా దాంట్లో మీరు మాతోపాటు కలిసి కరపత్రిక పరిచర్య, హాస్పిటల్ పరిచర్య, చిన్న పిల్లల పరిచర్య అనే వాటిని దేవుని కొరకు పరిచర్య చేయుటకు మిమల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. వాటిని మనస్ఫూర్తిగా చేసిన యెడల చిన్న కార్యమైన పెద్ద కార్యమైన మనస్పూర్తిగా చేసేటప్పుడు దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవిస్తారు. అప్పుడు మీరు ప్రయోజకులుగా మారతారు.
- బ్రదర్. టి. శంకర్ రాజ్ గారు
ప్రార్థన అంశం:
తమ పిల్లలు తరపున 500 రూపాయలు ఇచ్చే లక్ష మంది కుటుంబాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250