Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 12.02.2024
Share:

By Village Missionary Movement

Monday, 12-Feb-2024

దిన ధ్యానము(Telugu) 12.02.2024

 

అంశం:- శ్రేష్టమైన విత్తనాలు

 

"కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు" - కీర్తనలు 126:5 

 

అనుభవము కలిగిన సేవకుడు తన విశ్వాసుల దగ్గర ఒక ప్రశ్న అడిగాడు. పరలోక ఫలితం కొరకు విత్తబడిన విత్తనములు ఏవి అని అడిగాడు. అందుకు వారు చాలా విధాలుగా చెప్పారు. అప్పుడు అ సేవకుడు నేను చెబుతాను అని చెప్పడం మొదలుపెట్టాడు. 

 

ప్రేమ అనే విత్తనాలు:-

దుర్మార్గముగా జీవించడానికి తన తండ్రిని విడిచిపెట్టి వెళ్లిన చిన్న కుమారుడు కొరకు తండ్రి కనిపెట్టుకొని ఉన్నాడు. అన్నింటినీ పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో వచ్చిన తన కుమారుడిని పరిగెత్తుకుని వెళ్లి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని విందు చేయించెను. తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పది. తన పైన శత్రుత్వం చూపించిన సహోదరుల కొరకు ఆహారము తీసుకుని వచ్చి వారిని కనుగొనగానే యోసేపు లో ప్రేమ ఉప్పొంగెను. 

 

మంచితనం అనే విత్తనాలు:-

సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కుష్టు రోగము స్వస్థత పొందుకోవడానికి బానిసగా తీసుకుని వచ్చిన చిన్నది చెప్పిన మాటను విన్నాడు. తనను బానిసగా తీసుకొచ్చిన నయమానుకు కీడు చేయకుండా మంచి చేసింది ఆ చిన్నది. ఆ చిన్నదాని మాట విని నయమాను స్వస్థత పొందుకున్నాడు. మంచితనం అనే విత్తనాలు విత్తింది ఆ చిన్నది కాబట్టి ఇప్పటివరకు బైబిల్ గ్రంధంలో మనము ఆమె గురించి చదువుతున్నాం దాని కొరకు మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు ఫలితాలు ఇస్తూనే ఉంది. 

 

కన్నీరు అనే విత్తనాలు:-

కన్నీటితో విత్తుతున్న వారు సంతోషముతో పంట కోయుదురని బైబిల్ గ్రంధం చెబుతుంది. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేసింది హన్న. ఆమెకు సమూయేలు అనే ఒక కుమారుడిని ఇచ్చాడు దేవుడు. రాత్రింబవాళ్లు అంతయు నాకు కన్నీళ్లే నాకు అన్నపానములాయను ఆయన అని దావీదు చెబుతున్నాడు. అయితే దేవుడు దావీదును రాజుగా చేసి ఘనపరిచారు. చచ్చిపోయిన లాజరును పోగొట్టుకున్న సహోదరీల కన్నీళ్లు చూసి నాలుగు రోజుల తర్వాత లాజరును దేవుడు తిరిగి లేపారు. నాలుగు రోజుల తర్వాత తిరిగి లేపి తన మహిమను బయలుపరచెను. మన కన్నీళ్లు ఎప్పుడు కూడ ఆశ్చర్యమైన ఫలితాలు ఇస్తూనే ఉంటాయి. 

 

సువార్త అనే విత్తనాలు:-

సువార్త అనే విత్తనాలు విత్తుతున్నదానిలో అపోస్తులైన పౌలు సువార్తను విత్తడం నా యొక్క బాధ్యత అని అపోస్తులు డైన పౌలు చెబుతున్నారు. అలానే సువార్త అనే విత్తనాలు విత్తితే ఆత్మలు అనే పంటను కోయడం ఎంత గొప్ప కార్యము. అవును ప్రియమైన వారలారా దేవున్ని మహిమ పరుస్తున్నారా? అలాగైతే మీరు ఊరికినే ఉండలేరు బైబిల్ చెప్తుంది మీరు ప్రేమ అనే విత్తనాలు విత్తండి. మీ కొరకు ఫలితాలు ఇచ్చేవాడు దేవుడు. పైన చెప్పబడిన అన్ని విత్తనాలు విత్తి దేవుని యొక్క రాజ్యాన్ని నింపుదామా ? 

- సహోదరి. మంజుల గారు 

 

ప్రార్థన అంశం-

మనతో కలిసినా దేబోరా గుంపులను దేవుడు ఘనముగా వాడుకునేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet casibom bets10 extrabet royalbet süperbetin casibom giriş betcio royalbet betpas giriş milanobet bahiscasino betpas bahiscasino atlasbet romabet giriş holiganbet giriş bahiscasino ngsbahis betplay holiganbet jojobet casibom romabet betpas