By Village Missionary Movement
Sunday, 11-Feb-2024దిన ధ్యానము(Telugu) 11.02.2024 (Kids Special)
అంశం:- తాతీయ ఇచ్చిన గిఫ్ట్
"బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును" - సామెతలు 10:4
జాన్, జెస్సి ఇద్దరు అన్నా చెల్లెలు. మీ ఇంట్లో కూడా అక్క, చెల్లి, తమ్ముడు అందరూ ఉన్నారు కదూ? ఒకరి వలె ఇంకొకరు ఉండరు కదా! హఠాత్తుగా ఇంట్లో నుండి పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతూ ఉంటాయి. గొడవ పడుతూ ఉంటారు కానీ కొంతసేపటి తర్వాత అందరూ కలిసి ఆడుకుంటారు కదా. మీలాగే జాన్, జెస్సి ఉండేవారు. జాన్ అన్ని కార్యాలలో చురుకుగా ఉండేవాడు కానీ జెస్సి అలాంటిది కాదు చాలా సోంబేరిగా ఉండేది. అమ్మ నాన్న అమ్మ ఇలా ఉండకూడదు అని చెప్పేవారు దాన్ని గమనించిన తాతయ్య జాన్ కు జెస్సి కి ఒక పని చెప్పారు. దానిని బాగా చేసిన వారిని మంచి గిఫ్ట్ ఇస్తాను అని చెప్పారు। తాతీయ చెప్పిన దానిని ఇద్దరూ బాగా విన్నారు వెంటనే తాతయ్య ఇద్దరికీ ఒక్కొక్క విత్తనాన్ని ఇచ్చి దీనిని మీరు నేలలో పెట్టి పెంచమని చెప్పారు. జాన్ దానికి రోజు నీళ్లు వేస్తూ ఉండేవాడు దాన్ని బాగా చూసుకుంటూ ఉండేవాడు మొక్కొచ్చింది, ఆకులు వచ్చాయి. జాన్ కు చాలా సంతోషం వేసింది కానీ జెస్సీ అయితే పడుకుని ఉంది. ఎప్పుడు దానికి ఏ పని చేయలేదు. కానీ జాన్ చెట్టు అయితే బాగా ఎదిగింది పువ్వులు వచ్చాయ కానీ జెస్సి చెట్టు మట్టిలో మట్టిగా కలిసి పోయింది. తాతయ్య జాన్ కు ఇష్టమైన ఒక మంచి సైకిల్ కొని నీవు పనిని బాగా చేసినందుకు నీకు గిఫ్ట్ అని ఇచ్చారు. దానిని చూసిన జెస్సీ తాత నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు అని అడిగింది. అందుకు పాపా నేను నీకు ఇచ్చిన పనిని నువ్వు సరిగా చేయలేదు కాబట్టి నీకు గిఫ్ట్ లేదు అన్నారు. కానీ నేను ఇంకొక అవకాశం నీకు ఇస్తాను అని చెప్పారు. మరొక విత్తనాన్ని ఇస్తాను దాన్ని పెంచి చూపించు అన్నాడు. తర్వాత జాన్ జెస్సీని మనిద్దరం కలిపి సైకిల్ ను తొక్కుకుందాం అని పిలవగానే జెస్సీ వెళ్ళింది. జాన్ తో కలిసి సైకిల్ తొక్కుతూ జెస్సి ఇలా అనుకుంది. నా సోంబేరి తనం వలన నేను తాతీయ వద్ద నుంచి ఏ గిఫ్ట్ పొందుకోలేకపోయను కాబట్టి ఇకనుండి సోంబేరితనానికి ఒక ముగింపును పెట్టి జాన్ వలే చురుకుగా మారుటకు ప్రయత్నం చేస్తాను అని నిర్ణయం తీసుకుంది.
బుజ్జి పిల్లలారా మీరును ఇప్పటి వరకు సోంబేరి వలె ఉండడం చాలా మంచి గిఫ్ట్ లు పొందలేకున్నారా? ఇకనుండి అయినా చురుకుగా ఉండండి మంచి దీవెనలు పొందుకొనడానికి రెడీగా ఉండండి .
- బ్రదర్. రూబ్ చార్లెస్
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250