Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 10.02.2024
Share:

By Village Missionary Movement

Saturday, 10-Feb-2024

దిన ధ్యానము(Telugu) 10.02.2024

 

అంశం:- విశ్వాసము అనే విత్తనము

 

"అందుకాయనమీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును" - మత్తయి 17:20

 

బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన ఒకాయన విద్యార్థులకు ఆవగింజంత విశ్వాసము అనే అంశము మీద బోధించారు. విద్యార్థులందరూ దానిని విని వెళ్లిపోయారు. కానీ రాజేష్ మాత్రం ఆ మాటను పట్టుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. రాజేష్ యొక్క హృదయంలో తన కాలేజీకి వచ్చేటప్పుడు అడ్డుగా ఉంటున్న ఆ పెద్ద బండరాయిని ప్రార్థన ద్వారా తొలగించాలి అని ఆలోచన కలిగింది. రోజు ఆ బండరాయిని చూచి నువ్వు ఇక్కడ నుండి తొలగిపొమ్ము అని ప్రార్థన చేసేవాడు. ఇలా రెండు నెలలు గడిచాయి రాజేష్ యొక్క ప్రార్థనను చూచిన తోటి విద్యార్థులు వీడికి మతి స్థిమితం లేకుండా పోయింది అని అన్నారు. మూడు నెలల తర్వాత ఒకరోజు పెద్దపెద్ద యంత్రాలు సహాయంతో ఆ బండరాయిని అక్కడి నుండి తొలగించారు. దానిని గురించి అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నం వలన అది జరిగింది అని తెలిసింది. రాజేష్ ని పిలిచిన కాలేజీ ప్రిన్సిపల్ నీ విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచారు. విశ్వాసము అన్నది ఒక ఆవ గింజ వంటిది అది ఎంత చిన్నదిగా ఉన్నప్పటికీ ఫలితము కొండంత పెద్దగా ఉంటుంది అని అతన్ని పొగిడారు. 

 

బైబిల్లో కూడా అవగింజ అంత విశ్వాసముతో కొండంత అద్భుతాన్ని చూచిన ఒక స్త్రీ కలదు. ఆమె పేరు రాహాబు. ఆమె ఒక వేశ్య। ఆమె ఇశ్రాయేలీయులకు చెందినది కాదు అయినప్పటికీ ఆమెకు దేవుని పనిమీద విశ్వాసం ఉండేది. దేవుని జనాంగం ఎరిగిన వ్యక్తి కాదు తన పాప జీవితపు మధ్యలో కూడా ఇశ్రాయేలు జనాంగమునకు ప్రభువు చేసిన అద్భుతాలు విని దాని విశ్వసించింది. ఫలితము ఆమె హృదయంలో పడిన ఆ చిన్న విశ్వాసం గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. 

 

ఈ దినము మీ యొక్క హృదయములో చిన్న విశ్వాసము ఉన్నదా? ఆ విశ్వాసము ఆవగింజ వంటిది దాంట్లో జీవముగలదు అది పెరుగుతుంది. విశ్వాసం అనే విత్తనము హృదయములో ఉండిన యెడల గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుడు మీ యొక్క గొప్ప కార్యాలను ఎదురు చూడలేదు, ఆవగింజంత విశ్వాసాన్ని మీ యొద్ద ఎదురుచూస్తూ ఉన్నారు. మరి మీ వద్ద అది ఉన్నదా? మీరు ఎదుర్కొంటున్న సమస్యలను జయించుటకు ఆ చిన్న విశ్వాసమే చాలు. హల్లెలూయ! 

- బ్రదర్. క్రిస్టఫర్ గారు 

 

ప్రార్థన అంశం:-

ఈ దినము జరుగుతున్న 24 గంటల ఉపవాస ప్రార్థనలో ఆన్లైన్ మరియు ఆమె విలేజ్ టీవీలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపడేట్లు ప్రార్థిద్దాం

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al perabet perabet giriş safirbet safirbet giriş betasus betasus giriş virüsbet medusabahis medusabahis giriş grandpashabet grandpashabet giriş jojobet jojobet giriş vaycasino vaycasino giriş pusulabet pusulabet giriş perabet perabet giriş perabet perabet giriş matbet slot oyna perabet perabet giriş hiltonbet perabet perabet perabet betnano holiganbet galabet kalebet holiganbet