Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 07.02.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 07-Feb-2024

దిన ధ్యానము(Telugu) 07.02.2024

 

అంశం:- సమరయ స్త్రీ యొక్క విత్తనాలు

 

"అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" - సామెతలు 28:13 

 

ఒక క్రైస్తవ యవనస్తుడు ఒక పాపములో పడిపోయాడు. వెంటనే తన హృదయములో ఆ పాపము గురించి తెలుసుకొని దేవుని దగ్గర ఆ పాపమును ఒప్పుకోవడం మాత్రము గాక ఆ పాపములో పడిపోయిన కారణాలు తెలుసుకొని దాన్ని కూడా సరి చేసుకున్నాడు. కానీ సాతాను ఆ యవ్వనస్తుడు వద్ద నేరం మోపుతూ వచ్చాడు. చాలా సంవత్సరాలు తన హృదయములో ఆ పాపం గురించిన బాధతో ఆ యవ్వనస్తుడు కష్టపడుతూ ఉన్నాడు. ఒకరోజు తన సంఘములో ప్రవచన వరము కలిగిన తల్లి వద్దకు వెళ్లి తన కొరకు ప్రార్థన చేయమని అడిగాడు. ఆ తల్లి తన కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ యవ్వనస్తుడు కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. తన హృదయంలో ప్రభువా ఇలాంటి పాపము చేశాను నన్ను క్షమించావా అని మరలా మరలా అడుగుతూ తన హృదయంలో ప్రార్థన చేశాడు. ఏసుప్రభువు ఆ తల్లి ద్వారా మాట్లాడారు నా కుమారుడా నీవు చేసిన పాపం ఏమిటి నాకు జ్ఞాపకం లేదు. అవును దేవుడు మన పాపములను క్షమించిన దేవుడు దాన్ని మర్చిపోతాడు. హల్లెలూయ! 

 

ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు సమరయ పట్టణం గుండా వెళ్ళవలసి వచ్చింది. ఏసుప్రభు ప్రయాణం చేసి చాలా అలసిపోయినందున బావి వద్ద కూర్చున్నారు. అప్పుడు అక్కడికి ఒక స్త్రీ నీళ్లను తీసుకు వెళ్ళటకు వచ్చింది. ఏసుప్రభు ఆమెను దాహమునకు నీళ్లు ఇమ్మని అడిగారు. ఏసుప్రభు ఆ స్త్రీని పాపాత్మురాలు అని చూసి పక్కన పెట్టలేదు నేరం ఆమె పైన మోపలేదు. తనను ఆమెకు బయలుపరచుకున్నారు. వెంటనే ఆ స్త్రీ నీళ్లు మోయడానికి తీసుకువచ్చిన ఆ బిందెను అక్కడ పెట్టి నేను చేసిన అన్నింటిని ఒక మనుష్యుడు నాకు చెప్పెను వచ్చి చూడము అని సువార్తను ప్రకటించెను. ఈ స్త్రీ ద్వారా గ్రామం అంత ఏసుప్రభువును తెలుసుకున్నారు. 

 

నా ప్రియమైన వారలారా! మన యొక్క తండ్రి మనము చేస్తున్న పాపమును క్షమించడం కాదు దాన్ని మరిచిపోయే దేవుడు కాబట్టి మన యొక్క పాపములు గురించి మనకు హృదయములో బాధ అనిపించినప్పుడు దాన్ని ఏసుప్రభు యొద్ద చెప్పి దాన్ని వదిలేద్దాం. సమరయ స్త్రీ మనకు నేర్పించిన పాఠాలు ఇవే. దీనినే మనకు ఆమె నేర్పిస్తూ ఉంది. ఈరోజు నా ద్వారా ఏమి చేయు చేయగలను అనే బాధతో ఉన్న మీరు ఏసుప్రభు మీ జీవితంలో చేసిన అద్భుతాలను మంచి కార్యాలను మిగతా వాళ్లకు సాక్ష్యముగా చెప్పండి ఇదే సువార్త. సముద్రములు దాటి కొండలు దాటి సువార్త చెప్పడం మాత్రమే కాదు చెప్పాలి అని కచ్చితం కాదు కాని మీరు ఉన్న స్థలంలోనే ఒక విత్తనముగా మార్చబడితే దేవుడు మీ ద్వారా చాలా గొప్ప కార్యాలను చేస్తారు. 

 

ప్రార్థన అంశం:-

అన్ని ప్రాంతాల్లోనూ ఒక గంట దేవుని కొరకు పనిచేసే మిషనరీలు లేవాలి అని ప్రార్థించండి.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al