Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 04.02.2024
Share:

By Village Missionary Movement

Sunday, 04-Feb-2024

దిన ధ్యానము(Telugu) 04.02.2024

 

అంశం:- సోకేస్

 

"అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను" - ఆదికాండము 16:13

 

ప్రత్యేకముగా చిన్న పిల్లల కొరకు

 

హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంది? ఈ కొత్త సంవత్సరంలో మీరు స్కూల్ కి వెళ్లారు కదా ఎలా చదువుతున్నారు? ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మును కాపాడి మంచి పిల్లగా ఉండుటకు సహాయం చేశారు. అంతే కాదు మీరు తప్పులు చేసినప్పుడు మీ తల్లిదండ్రులు తిడితే కోపం పడకుండా అది మంచిగా చేయడానికి ప్రయత్నం చేయండి. సరైనా పిల్లలు కధ విందామా? 

 

మీ ఇంట్లో ఉన్న సెల్ఫ్ అందంగా అలంకరించుటకు చాలా వస్తువులను కొని పెడతారు కదా అలాగే ఒక ధనవంతుడు తన ఇంటిని అందముగా చేయడానికి ఎక్కడా దొరకలేని ఒక ప్రత్యేకమైన వస్తువు కొని తన ఇంటిని అలంకరించుకోవాలి అనుకున్నాడు. అప్పుడు మంచి శిల్పము ఒకటి చేయించాలి అని అనుకున్నాడు. చెప్పిన పనిని బాగా చేయగలిగిన ఒక శిల్పకారుని చూసి అతనికి తన ఆశ అంతటిని చెప్పాడు। చాలా విలువైన రాయిని చూసి ఎంత ఖర్చైనా పరవాలేదు మంచి శిల్పాన్ని నాకు చేసి ఇవ్వమని చెప్పాడు. ఆ శిల్పకారుడు ఆ పనిని మొదలు పెట్టాడు కొన్ని రోజులు తర్వాత ధనవంతుడు శిల్పాకారుని వద్దకు వెళ్లి చూశాడు అక్కడ చూడగానే కళ్ళు మెరిసేటట్లు ఒక శిల్పమ అతని కనిపించింది. ఆ శిల్పాకారుడు ఆ శిల్పం యొక్క వెనక పక్కన బాగా అందంగా చెక్కుతూ ఉన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు శిల్ప కారుని అడిగాడు ఎందుకు వెనకవైపు ఇంత చక్కగా చెక్కుతున్నావ్ వెనకవైపు ఎవరు చూడరు కదా అని అడిగాడు. అందుకు ఆ శిల్పకారుడు నేను యేసయ్య బిడ్డను అతనికి అన్ని తెలుసు అతనికి వెనక పక్క తెలుసు ముందు పక్క తెలుసు. నేను నా మనసులో ఏమనుకున్నానో అతనికి తెలుసు కాబట్టి నేను నిజాయితీగా ఉండాలి నా పనిని మంచిగా చేయాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు. దీనివల్లనే నా పనిని సక్రమంగా చేసి ముగిస్తేనే నాకు సంతోషమయ్యా అని ఆ శిల్పాకారుడు ధనవంతునితో చెప్పాడు అందుకు ధనవంతునికి చాలా ఆశ్చర్యం కలిగింది. అతనికి ఇవ్వవలసిన ధనమును ఇచ్చాడు అది మాత్రమే కాదు దానికంటే ఎక్కువగా ఇచ్చి అతని ఘనపరిచాడు. యేసయ్య నన్ను కూడా చూస్తున్నారా అని ఆ ధనవంతుడికి ఒక ఆలోచన పుట్టింది. మనం ఏమి అనుకున్నామో అన్నది అతనికి తెలుసు అని చెప్పినటువంటి ఆ మాటలు ఆ ధనవంతుని జీవితంలో ఒక మార్పును తీసుకొచ్చాయి. శిల్పము ద్వారా యేసయ్య నన్ను చూస్తున్నారు అనే ఒక తలంపు ధనవంతునికి వచ్చింది. ఆ రోజు నుండి అతని జీవితంలో ఏమి చేసినాను నిజాయితీగా చేయాలి అని అనుకున్నాడు. యేసుప్రభువుని కూడా తన హృదయంలో అంగీకరించాడు. 

 

చిన్నపిల్లల్లారా మీరు చేస్తున్న ఏ పనైనను, ఏ కార్యమైనను దేవుడు చూస్తున్నారు ఎప్పుడు మీతోనే ఉన్నారు అనే తలంపు మనలో ఉంటే మనం తప్పు చేయము కదా! దేవునికి భయపడే మనసు నాకు కావాలి అని ప్రార్థన చేయండి. సరే పిల్లలు బాయ్. వెరీ గుడ్! 

- సహోదరి. దేబోరా

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al