By Village Missionary Movement
Saturday, 03-Feb-2024దిన ధ్యానము(Telugu) 03.02.2024
అంశం:- బయలుదేరి వెళ్ళుము
"...మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి" - మత్తయి 28:19
ఒక యవ్వనస్థుడు తన ఇంటి పక్కనే ఉన్న ఒక పెద్ద ధనవంతుడు కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఏమిటంటే ఆ ధనవంతుడు చాలామందికి మంచి కార్యాలు చేసి మంచివాడిగా జీవించాడు కాని దేవున్ని ఎరుగకుండ ఉన్నాడు. అందువలన యవనస్తుడు అతని కొరకు భారము కలిగి తరచుగా ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఒకరోజు దేవుడు నీవు వెళ్లి అతనితో మాట్లాడమని చెప్పాడు కాని ఆ యవ్వనస్తుడు నేను చిన్న వాడిని అంతేకాదు నాకు చదువు కూడా లేదు ఎలా వెళ్లి అతనితో మాట్లాడతాను అని ఆలోచించి ఉండిపోయాడు. దేవుని గురించి వినలేని వారు అతని గురించి ఎలా విశ్వసించెదరు? బోధన చేసేవారు లేకుండా ఎలా వారికి అర్థమవుతుంది అని రోమీలు రాసిన పత్రిక 10: 14 లో దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ యవ్వనస్తుడు ఈ రాత్రంతా నేను ప్రార్థన చేసి ఉదయమున వెళ్తాను అని ఆ రోజంతా ప్రార్థన చేశాడు. ఆరోజు రాత్రి ఆ ధనవంతుడితో పాటు వ్యాపారం చేసిన వ్యక్తి ఆ ధనవంతున్ని చంపేశాడు. ఉదయమున లేచి యవ్వనస్తుడు చూసేసరికి ఆ ధనవంతు ఇంటిముందు ప్రజలు గుంపులుగా ఉన్నారు. ఏమిటి అని అడిగితే ఇది సంగతి అని చెప్పారు. దానికి యవ్వనస్తుడు బహుగా దుఃఖపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు మీరు త్వరపడి వెళ్లి ప్రజలందరినీ ఆయన కొరకు శిష్యులుగా చేయుడి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వాళ్లకు బాప్తిస్మము ఇవ్వండి అని మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని దానిని వారికి ఉపదేశించుము అని మత్తయి సువార్త 28: 19 -20 లో చెబుతున్నారు. దేవుడు చెప్పిన తర్వాత కూడా చాలా సాకులు చెప్పి తప్పించుకునే వారిలా ఈరోజు మనము కూడా ఉన్నామా? సైన్యాధిపతి అయినటువంటి నయమాను దేవున్ని తెలుసుకొనుటకు దేవుడు ఆ ఇంటిలో చిన్నదానని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నయమాను స్వస్థత పొందుకొనడం వలన సిరియా దేశం అంత దేవుని ఎరిగినవారుగా ఉన్నారు. తల్లిదండ్రులు లేనటువంటి స్థితిలో తన అన్నయ్యతో పరాయి దేశంలో జీవిస్తున్నటువంటి ఎస్తేరు ద్వారా దేవుడు యూద ప్రజలకు విడుదల ఇచ్చారు. యేసు క్రీస్తు ప్రభువు తనతోపాటు ఉంచుకొనుటకు చదువు లేని జాలర్లను శిష్యులుగా ఎంచుకున్నారు. మూడుసార్లు ఆయన ఎవరో నాకు తెలియదు అనే పేతురు ద్వారా దేవుడు సంఘమును కట్టించారు. దేవుడు పేతురు ద్వారా 3000 మంది 5000 మంది రక్షింపబడే వారిలా వాడుకున్నాడు. అంతేకాదు పేతురు నీడ పడిన యెడల స్వస్థత పొందుకున్న వారు అనేకమందున్నారు. నాకు మాట్లాడటం రాదు నోటి మాంద్యము గలవాడును అని చెప్పిన మోషే ద్వారా దేవుడు లక్షల కొలది ప్రజలను రక్షించుట వాడుకున్నారు. మోషే, ఎస్తేరు, చిన్నదానివలె, పేతురు వలె వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటారు. మీరు దేవునికి మీ హృదయాన్ని ఇచ్చి వెళ్ళండి ఏమి మాట్లాడాలో దిగులు పడొద్దు. ఎందుకంటే మాట్లాడుతున్న వారు మీరు కాదు దేవుడే మీ ద్వారా మాట్లాడతారు అని చెబుతున్నారు మత్తయి సువార్త 10: 20. మనము దేవుని కొరకు ఒక్క అడుగు వేస్తే దేవుడు మన నుండి మహిమను పొందుతారు. ఈ రోజే ఆయనను రుచి చూచి సువార్త ప్రకటించుటకు బయలుదేరండి.
- శ్రీమతి. అంబుజోతి స్టాలిన్ గారు
ప్రార్థన అంశం:-
తమిళనాడులో గల 313 గ్రామాలలో ఇద్దరేసి దేబోరాలు లేచేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250