By Village Missionary Movement
Thursday, 01-Feb-2024దిన ధ్యానము(Telugu) 01.02.2024
అంశం:- నాట్యము మాత్రము కాదు
"మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి" - మార్కు 16:15
దేవుడు తమను దీవించినప్పుడు దేవుని ప్రజలు దానిని నాట్యముతో కొనియాడుట మన బైబిల్లో చూడగలం. ఎర్ర సముద్రం రెండుగా చీల్చబడినప్పుడు గొప్ప విడుదల దేవుడు ఇచ్చినప్పుడు మిరియాము మిరియాముతో ఉండిను స్త్రీలు నాట్యముతో దేవున్ని ఆరాధించారు. దేవుని మందసము మరలా యెరుషలేమునకు తీసుకొని రాబడినప్పుడు దావీదు సంతోషముతో దేవుని నాట్యము చేసి ఆనందించాడు. ఇలా సంతోషముతో దేవున్ని నాట్యముతో ఆరాధించుట మంచిదే కాని అదే నాట్యము మీద కేంద్రీకృతమై ఉండకుండా అది సరదాగా మారిపోయే ప్రమాదము కలదు. యవనస్తులు, యవ్వనస్తురాలు కలిసి ఉన్న కూడికలో ఇలాంటి నాట్యములు అభ్యంతర పరిచే విధంగా ఉండవచ్చు. సినిమా రంగంలో ఉన్న నాట్యము మ్యూజిక్ వలె ఈ దినపు ఆరాధనలు ఉన్నాయి. మన ఆరాధన క్రమం ఏ ఒక్కరికి అభ్యంతరము కాకూడదు.
బబులోను తీరమున వాయిద్యాలు వాయించుటకు మనసు లేక దుఃఖముతో నిలబడిన ఒక గుంపు ప్రజలను కీర్తన 137 లో చూస్తున్నాం. తమ యొక్క పాపము యొక్క ఫలితం వలన బబులోనుకు చెరగా పంపించబడ్డ ఇశ్రాయేలీయులు వాళ్లు. ఈ దినము బైబిల్లో చెరసాలలో పట్టుబడిన ఈ ప్రజలు మరల తమ సొంత దేశంనకు తిరిగి వస్తారు అని ప్రవచనము దేవుడిచ్చారు. దేవుని జనాంగము సంతోషముతో నాట్యమాడుతారు అని చెబుతున్నారు. నాట్యముతో నిలబడి పోకుండా దేవుని యొద్ద ఈ యొక్క రక్షణను దూరమైన దీవిలో ఉన్నవారికి ప్రకటించండి అని ఇర్మియా 31:10 లో చెబుతున్నారు.
ప్రియమైన వారలారా! మనము దేవుని వద్ద సంతోషించుట మంచిది. మనము దేవున్ని ఆరాధించుట, నాట్యం చేయట మంచిదే కానీ అది శిష్యత్వము యొక్క ముగింపు కాదు. లోకమంతా వెళ్లి యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించాలి అనే దేవుని యొక్క ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. పాపం వలన నిజమైన సంతోషాన్ని కోల్పోయి జీవితం యొక్క ఉద్దేశము అర్థం కాక రోగములతోనూ ఇంకా అనేక వ్యాధులతోనూ జీవించే ప్రజలకు సువార్త ఒక్కటే మందు. దీనికి క్రైస్తవులందరూ తమ జీవితంలో ఏదో కార్యములో నిలబడిపోయి బయలుదేరి వెల్లుడి అనే ఆజ్ఞను మరిచిపోయారు. కొందరు ఆరాధన, నాట్యము, పాటలు అని బయలుదేరకుండా నిలబడి ఉన్నారు. దీనిని చదువుతున్న మీరు ఎలాంటి స్థలంలో నిలబడి ఉన్నారు. దేశము సువార్త మైము అవుటకు ఏదైనా చేయుడి. మీరు వెళ్ళగలిగిన స్థలమునకు వెళ్లి సువార్త ప్రకటించుడి వెళ్లలేని స్థలమునకు అక్కడ జరుగుతున్న మిషనరీ పరిచర్యలన ప్రార్థనతోనూ త్యాగపూరితమైన కానుకతోను వారిని బలపరచుడి. హల్లెలూయ!
- బ్రదర్. జె. సంతోష్ గారు
ప్రార్థన అంశం:-
ఈ నెల అంతా జరగబోతున్న పరిచర్యలో దేవుని హస్తము తోడైయుండి నడిపించేటట్లు ప్రార్థిద్దాం.
*Whatsapp*
ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.
www.vmm.org.in
ఈమెయిల్: info@vmm.org.in
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin
విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250