Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 05.04.2021
Share:

By Village Missionary Movement

Monday, 05-Apr-2021

దిన ధ్యానము(Telugu) 05.04.2021

సోలిపోకుము:-

"అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు(లేక, సంపాదించుకొనుటకు) విశ్వాసము కలిగినవారమై యున్నాము" - హెబ్రీయులకు 10: 39

అమెరికాలో  సార్ట్ ఫెన్నింగ్టన్ అనే ఫుట్ బాల్ ప్లేయర్  ఒకాయన ఉండేవారు. ఆయన అనేక పోర్టులో కఠినముగా ఆడినందున ఫుట్ బాల్ ఆడలేని విధముగా శరీరములో అనేక గాయాలు కలిగిన వారుగా కనిపించారు.ఆయనకు ఏర్పడిన గాయాల వలన రెండు సార్లు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం కొరకు మందులు తీసుకున్నారు. దీని తరువాత మంచి ఆరోగ్యం పొందుకున్నారు. మరలా ఫుట్ బాల్ ఆడుటకు గ్రౌండ్ లోనికి దిగి చిన్న చిన్న పోర్టు లో దిగి ఆడటం ప్రారంభించాడు ఒకానొక సమయంలో  ఆ ఇంటర్నేషనల్ పోర్టులో కూడా పాల్గొని రెండు సార్లు ఆ దేశపు ఆ సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ గా గొప్ప అంతస్తుని సార్ట్ పొందుకున్నారు.

క్రీస్తు నందు మన ఆత్మీయ జీవితం కూడా కఠినమైన ప్రయాసతో పోరాటాలతో  నిండి ఉంటుంది. మన ఆత్మీయ యుద్ధంలో  అనేక సమయాల్లో అనేక గాయాలు ఏర్పడుతున్నాయి. అది మనము మరలా లేవలేనంతగ మనల్ని వెనక్కి లాగేస్తోంది. ఇలాంటి శ్రమలు పోరాటాల్లో అనేకులు నిరుత్సాహ పడిపోయి తన ఆత్మీయ జీవితాన్ని నిలిపివేస్తున్నారు. ఈ దినం మనం చదివిన లేఖనభాగంలో హెబ్రీయులకు  పత్రిక వ్రాసిన వ్యక్తి ఇలా రాస్తున్నారు మనము చెడిపోకుండ, జారిపోకుండ వెనక్కి వెళ్ళిపోయేవారుగా  ఉండకుండ మనం ఆత్మీయంగా ముందుకు వెల్లుటకు విశ్వసించినవారముగా ఉంటాము అంటున్నారు. ఏలీయా ప్రవక్త తన యొక్క పరిచర్య దినములలోనిరుత్సాహ పడిపోయినప్పుడు ప్రభువు ఆయన యొక్క దూత ద్వారా ఇలాగు బలపరుస్తున్నారు. లెమ్ము  భోజనము చేయుము నీవు వెళ్ల వలసిన ప్రయాణము చాలా దూరంగా ఉన్నది అన్నారు. (1రాజులు19:7)

క్రీస్తునందు ప్రియమైన వారలారా! ఈ సందేశాన్ని  చదువుతున్న మీరు మీ పరుగు పందెములో అభ్యంతరం చెంది నిలబడి యున్నారా? మీ లోపములను, బలహీనతలను ప్రభువునకు సమర్పించండి. తెరవబడిన హృదయముతో మీరు ఆయనతో మాట్లాడండి. మిమ్మల్ని బాగా గ్రహించిన వారుగాను మీ బలహీనతలో మీకు సహాయము చేయువారు యేసయ్య మాత్రమే. మీ యొక్క ఆత్మీయ ప్రయాణము ఆటంకం లేకుండ ఎప్పుడు దేవుని సహాయాన్ని పొందుకొనుటకు మరువకండి. మీ చేయి పట్టుకున్నవాడు చివరి వరకు నడిపించడానికి శక్తి గల వాడిగా ఉంటున్నాడు. హల్లెలుయా!
-    బ్రదర్. పి.జాకబ్ శంకర్

ప్రార్ధన అంశం:-
బైబిల్ కాలేజీలో చేరిన విద్యార్థులు ఆత్మీయ పరంగా బలము పొందుకొనేటట్లు ప్రార్థిద్దాం.

ఈ దిన ధ్యానవాక్యం కొరకు ఈ క్రింద నoబర్లును సంప్రదించండి
వాట్సాప్ తమిళ్ కొరకు +91 94440 11864, 
ఇంగ్లీష్ కొరకు +91 86109 84002, 
హిందీ కొరకు +91 93858 10496
తెలుగు +91 94424 93250

ఈమెయిల్: reachvmm@gmail.com
Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001
ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al holiganbet giriş holiganbet padişahbet bets10 extrabet royalbet süperbetin padişahbet betcio royalbet casinoroyal queenbet bahiscasino betcio bahiscasino atlasbet padişahbet betpas bahiscasino celtabet queenbet casibom jojobet jojobet casibom holiganbet restbet safirbet