Village Missionary Movement         கிராம மிஷனரி இயக்கம்

దిన ధ్యానము(Telugu) 31.01.2024
Share:

By Village Missionary Movement

Wednesday, 31-Jan-2024

దిన ధ్యానము(Telugu) 31.01.2024

 

అంశం:- త్యాగమా? అవకాశమా? 

 

"ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు?" - రోమీయులకు 11:35

 

క్రైస్తవ లోకంలో దేవునికి కానుక ఇచ్చిన యెడల అది త్యాగపూరితమైన కానుక అని చెప్పబడుతుంది. యవనస్తుడు ఒకరు మిషనరీగా వెళ్తే ఆయన జీవితాన్ని దేవుని కొరకు త్యాగము చేసినాడు అని ప్రజలు చెబుతూ ఉంటారు. ఒకడు పేదవారికి ఎక్కువగా సహాయం చేసిన యెడల త్యాగపూరితంగా సహాయం చేస్తున్నారు అంటారు కొందరు. ఇలాగా త్యాగములు గూర్చి మిషనరీ అయినా డేవిడ్ లివింగ్స్టన్ చెప్పిన కార్యాలను ఈ దినం ధ్యానిద్దాం. 

 

అనేక సంవత్సరాలుగా ఆఫ్రికాలో త్యాగపూరితమైన పరిచర్య చేసిన డేవిడ్ లివింగ్స్టన్ వృద్ధాప్య కాలంలో ఆయనను దర్శించుటకు ఇంగ్లాండు నుండి స్టాన్లీ అనే జర్నలిస్టు వచ్చారు. అనేక కార్యాలు గురించి మాట్లాడిన తర్వాత లివింగ్స్టన్ పరిచర్య గురించి ఇంగ్లాండులో ఉన్న ప్రజలు చాలా గొప్పగా అనుకుంటున్నారు అన్నాడు. తరువాత తాను ప్రస్తుతం వెళ్లవలసిన నావలో లివింగ్స్టన్ కూడా తనతో ఇంగ్లాండ్ కి రమ్మని పిలిచారు. ఈ అవకాశాన్ని విడిచిపెడితే లివింగ్స్టన్ కు ఇంగ్లాండ్ కు వెళ్ళడం చాలా కష్టమని చెప్పారు. కానీ లివింగ్స్టన్ అయితే దాని తిరస్కరించి ఆఫ్రికాలో ఉండిపోయారు. స్టాన్లీ బయలుదేరిన మరుసటి రోజున లివింగ్స్టన్ డైరీ ఇలా రాశారు. నా జీవితంలో ఎక్కువ భాగాన్ని ఆఫ్రికాలో మిషనరీగా గడిపిన కార్యాన్ని ప్రజలు గొప్ప త్యాగంగా మాట్లాడుకుంటున్నారు. దేవుని వద్ద నుండి గొప్ప కార్యాలు పొందుకున్న నేను ఆ అప్పును తీర్చడానికి ఒక భాగాన్ని నేను మరలా తిరిగి చెల్లించుట త్యాగమా? మనసులోనికి సంతృప్తి కలుగజేసే కార్యాలు చేయుట త్యాగమా? నిత్యములో మిక్కిలి ఫలితాన్ని దయ చేస్తున్న పనిని చేయుట త్యాగమా? కాదు కానే కాదు. త్యాగము అన్న మాట ఇక్కడ పనికిరాదు దానిని అవకాశం లేదా భాగ్యము అని చెప్పవచ్చు. మహిమగల తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉండుట తిరస్కరించి మన కొరకు భూలోకమునకు దిగివచ్చిన ఏసుక్రీస్తు ప్రభువు యొక్క త్యాగము ముందు మనము ఎలాంటి త్యాగము చేయలేదు. నేను ఏమి చేయలేదు అని తన డైరీలో రాసి పెట్టుకున్నారు. 

 

ప్రియమైన వారలారా మనము ప్రభువు కొరకు చేసిన కార్యాలను ఎలా చూస్తున్నాం? కానుక ఇచ్చుట పరిచర్య చేయుట అనే వాటి గురించి ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాము? వాటిని దేవుడు మనకు ఇచ్చిన భాగ్యముగా భావిస్తున్నామా లేక సర్వలోకంలో ఏదో గొప్ప కార్యాన్ని సాధించాను అని పసిపిల్లల వలె ఆలోచిస్తున్నామా? డేవిడ్ లివింగ్స్టన్ చెప్పిన ఈ గొప్ప క్రైస్తవ ఆలోచన మీ మనసులో కూడా ఉండనివ్వండి. 

- బ్రదర్ జె. సంతోష్ గారు 

 

ప్రార్థన అంశం:-

గ్రామ పరిచర్యలో సువార్తకు వ్యతిరేకత చూపిస్తున్నటువంటి ప్రజలు ఏసుక్రీస్తు ప్రభువు ప్రేమను రుచిచూచేటట్లు ప్రార్థిద్దాం.

 

*Whatsapp*

ఈ దిన ధ్యాన సందశమును తమిళ్, ఇంగ్లీష్ , హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, పంజాబీ మరియు ఒరియా బాషలలో వాట్సాప్ త్వరా పొందుటకు *+91 94440 11864* అనే నెంబర్ ను సంబ్రదించగలరు.

 

www.vmm.org.in

ఈమెయిల్: info@vmm.org.in

Android App: https://play.google.com/store/apps/details?id=com.infobells.vmmorgin

 

విలేజ్ మిషనరీ మూమెంట్, విరుదునగర్, ఇండియా- 626001

ప్రార్ధనా అవసరాల కోసం: +91 94424 93250



hacklink satın al